ఖచ్చితంగా చెప్పలేను కానీ, అదే ఈ కథ కు ప్రేరణ.
అయితే ఈ కథ లో కేవలం మల్లయ్యే లేడు. కొత్త లింగన్న-నాకు తాత అవుతాడు - ఉన్నాడు. ఆయన్ని పాత్రగా ఊహించి, ఆయనైతే ఈ మాటలు ఎలా మాట్లాడుతాడో అలా రాశాను. కొన్ని అచ్చంగా ఆయన మాటలు కూడా ఉన్నాయి. మా కన్రెడ్డి తాత గురించి నాకు చెప్పింది ఆయనే.
ఇంక కొన్ని మా బాపు అనుభవాలు, నా బాల్యం ఉన్నాయి.
మా ఊరిని, మా తాతను, మనందరి తాత లాంటి మల్లయ్యను ఈ కథ లోకి తేగాలిగినన్దుకు నేను కొంత గర్వపడుతున్న.
ఇక కథ పేరు గురించి. ముందు నేను అనుకున్నది 'బతికి చెడనివాడు'. నా మిత్రుడు యాకూబ్ పాషా ఇది హృదయాలను సూటిగా తాకేట్టుగా లేదు అన్నాడు. కథలో అన్నట్టుగానే 'చింతకింది మల్లిగాని కథ' అంటే బాగుంటుది అని సూచించాడు. 'కథ' అనేకంటే 'ముచ్చట' అని పెడితే ఇంకా ఆత్మీయంగా ఉంటుందని నేను ఫీలయ్యాను. అలాగే 'మల్లిగాడు' కంటే 'మల్లయ్య' గౌరవంగా ఉంటుందనిపించింది.








9 comments:
life ni elivate cheyyakunda.. drama ni add cheyyakunda.. konni, russian and europian stories chadiva vipula lo.. i think this one belongs to that genre.
Thank u aravind. I am very happy that software engineer like u is reading serious literature very seriously.
చెబితే నమ్ముతారో లేదో గాని, నేను సాక్షిలో మీ కథ చదవగానే, వెంటనే సాక్షి వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకున్నాను. నాకు అంత బాగా నచ్చింది మీ "చింత కింది మల్లయ్య కథ". ఇకపోతే, "చింత కింది మల్లయ్య" అనే పేరు నాకు చాలా సుపరిచితం. మా నాన్నగారు ఎక్కువగా ఆ పేరు ఉపయోగిస్తారు. అందులోనూ, నేను కూడా కరీంనగర్ వాన్ని అవడం మూలంగా మీరు కథలో ఉపయోగించిన భాష నాకు బాగా నచ్చింది. మల్లయ్య జీవితాన్ని మీరు వివరించిన తీరు బాగుంది. మల్లయ్య లాంటి వ్యక్తులు ప్రతి పల్లెలో కనిపిస్తారు. చక్కని కథని అందించినందుకు ధన్యవాదాలు. ఇలంటి స్వఛ్చమైన రచనలు ఇంకా మీ నుండి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
థాంక్స్ తాపసి,
అయితే చింతకింది మల్లయ్య మీకు తెలుసన్నమాట.
అట్లాంటి ఇంటి పేరుతోనే ఉన్నాడా?
మీరు అన్నట్టు రాయడానికి ప్రయత్నిస్తాను.
idedo pottakutikosam chesukuntunna udyogam annayya.. lopala nunchi nenu patha kalam manishine.. pusthakalu chadavadam.. sangeetham enjoy cheyyadam.. viluvala gurinchi vadanalu cheyydam.. ;)
ok ok ok my dear aravind.
namastey raji reddy garu...sakshi lo mi postings anni chala baguntai...thnx for such works....may b v r goin to get more and more frm u...can v xpect?and can u help me funday maharshi gari blog.his comedy timing is also xcelent in his stories...thnk u all d team for ur works...continue rocking the days......
నమస్తే రామ్ గారు.
మీ అభినందనలకు థాంక్స్. ఊ.. తప్పకుండా ఆశించొచ్చు.
నాకు తెలిసి మహర్షి గారికి బ్లాగు లేదు.
Post a Comment