Pages

నేను ఈ ప్రపంచాన్ని రెండు రకాలుగా విభజిస్తున్నా. నాలా ఉండగలిగేవాళ్లు, నాలా ఉండలేనివాళ్లు.

Monday 17 May 2010

'చినుకు రాలినది' అను ఒక కథ





ఈ కథకు నేను ముందు అనుకున్న టైటిల్ సిద్దిపేట - సిరిసిల్ల. కాని నా మిత్రులు యాకూబ్, క్రాంతి అది బొంబాయి - గోవా లాగా అనిపిస్తోంది. బాగోలేదన్నారు. రెండో టైటిల్ నాకు తోచలేదు. ఏదైనా బాగుంది అంటే దాన్ని చినుకు రాలింది అనడం యాకూబ్ అలవాటు. అదే టైటిల్ అయితే బాగుంటుంది అని క్రాంతి అన్నాడు. రాలింది కొంచం మార్చి రాలినది చేశాం. వాళ్ళిద్దరికీ థాంక్స్.
కాని ఇదీ నాకు నచ్చలేదు. కాని కథ అన్నాక ఒ టైటిల్ ఉండాలిగా!
ఈ కథ బొమ్మ కోసం అన్వర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వారికి ధన్యవాదాలు.
గుడిపాటి గారు ఒ కథ సంకలనం కోసం రాయమని అడిగితే ఈ కథ రాయాలన్న ఆలోచన వచ్చింది. ఆ సంకలనం ఏమైందో నేను అడగలేదు. కారణం అయినందుకు ఆయనకు కృతజ్ఞతలు.

ఈ కథ ఫండే లో ఏప్రిల్ పదహారు న అచ్చయ్యింది.
అయితే, ఇది నా 'మరణ లేఖలు', 'చింతకింది మల్లయ్య ముచ్చట' స్థాయి కథ కాదన్న ఫీలింగ్ నాకుంది.

9 comments:

Srinivas said...

నాదీ మీ ఫీలింగే.

అబ్రకదబ్ర said...

మొదటి పేజ్ కలిగించిన ఆసక్తి మిగతా పేజీలు నిలబట్టలేకపోయాయి. చర్వితచర్వణంలా అవే అవే 'పరిశీలనలు' చెప్పుకుంటూ పోయారు. చెప్పిన శైలి చివరికంటా చదివించింది - అదే లేకపోతే పూర్తిగా చదవటం కష్టం.

JESSON and REY ANN said...

Nice post i like it, keep blogging and If you want too, kindly and please visit my blog http://jabrasr.blogspot.com/ thank you in advance.

I would like also to share this to your reader,... The Succes and Opportunity Family:

The father of succes is WORK,
The mother of succes is AMBITION,
The oldest son of succes is COMMON SENSE
Some of the other sons of success are PERSEVERENCE, HONESTY, THOROUGHNESS, FORESIGHT, ENTHUSIASM, and COOPERATION;
The oldest daughter of succes is CHARACTER,
Some sisters of success are CHEERFULNESS, LOYALTY, CARE, ECONOMY, and SINCERITY,
The baby is OPPORTUNITY.

Dr.Tadepalli patanjali said...

ఒక మంచి వాక్యాన్ని రసానుభూతి కలిగించేట్టు రాస్తే దాన్ని కావ్యం అన్నాడు జగన్నాథుడు అనే ఆలంకారికుడు(వాక్యం రసాత్మకం కావ్యం).
మీ కథలోని “ఏదో కొత్త సంతోషాలని చూస్తున్న ముఖంలోకి వచ్చి చేరే ఆనందం ఉంది” అనే వాక్యం అటువంటి రసానుభూతి కలిగించింది.అభినందనలు
- డా.తాడేపల్లి పతంజలి

గీతిక said...

ఈ కధ గురించి నేను నా స్పందన చెప్పాలనుకుంటున్నాను. కానీ మీరు ఇలా "Google" వాళ్ళు మాత్రమే అభిప్రాయాల్ని వ్రాయాలంటే ఎలా సర్...?

raji reddy said...

అలా ఎందుకు?
ఎవరైనా పొస్టు చెయొచ్చు. నాది కూదా యాహూ నే కదా!

Anonymous said...

Hi Raji Reddy Garu

E katha chaduvutunte Malli Share Auto Karimnagar lo ekki nattunnadi

Meedi Karimnagare Naadi Karimnagare

Chala Natural ga Hrudayaniki hattukune vidamga vunnagi

Mee migata kathalu kuda chadavalani Vunnadui

As of now this is superb Keka

Prasad
California

Poodoori Raji Reddy said...

ప్రసాద్ గారూ, అయితే మీదీ కరీంనగరేనా!
సంతోషం.
మీ అభినందనలకు ధన్యవాదాలు.
కథలు పక్కనే విడిగా పెట్టాను. ప్రత్యేకించి చింతకింది మల్లయ్య ముచ్చట అక్కడి యాసలో రాసింది.

Poodoori Raji Reddy said...

ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షంతవ్యుణ్ని.
@శ్రీనివాస్:
థాంక్యూ. అంటే మీరు ఆ రెండు కథలూ చదివినట్టే కదా! థాంక్యూ.

@అబ్రకదబ్ర:
మీ అభిప్రాయంతో విభేదిస్తున్నా. అసలు, కథను రాసింది కేవలం ఆటో ప్రయాణం గురించి చెప్పడానికి కాదుగదా, ఆ వంకన కొన్ని పరిశీలనలను చెప్పాలనేకదా.
అయినా శైలి మీద మీరు రాసిన వాక్యానికి ధన్యవాదాలు.

@తాడేపల్లి పతంజలి:
ఆ కథలో నాకు చాలా బాగా నచ్చిన వాక్యాల్లో అదీ ఒకటి. దాన్ని మీరు కోట్ చేసినందుకు నా ముఖంలోకి కొత్త సంతోషం వచ్చి చేరుతోంది. ధన్యవాదాలు.

Post a Comment

Get Flower Effect