మా ఊరి మల్లయ్యను నేను జడత్వానికి ప్రతినిధిగా భావించేవాణ్ని.
అలా అనుకుంటున్నప్పుడు నన్ను నేను చైతన్యానికి ప్రతిరూపంగా తలచేవాణ్ని.
ఆయన ఎప్పుడూ ఊరు కదల్లేదు. ఏ కొత్తచోటూ చూల్లేదు. ఏ కొత్తదీ అనుభవించలేదు.
రుమాలు, బుడ్డగోచి, చేతికర్ర... ఇంతేనా జీవితం?
ఇదే అడిగానాయన్ని ఓరోజు.
బదులు చెప్పకుండా ఆయన తను పెంచిన మామిడిచెట్టును చూపించాడు.
"చెట్టు కదలకుండానే పెరుగుతుంది చూడు, మనిషి అలా లోపల పెరగలేడంటావా?' అని నాకు వేసిన ప్రశ్నగా భావించాను.
నేను నిజమేనా?




6 comments:
chithanyam ante kadalika.rayi,chettu,janthuvu,manishi anni chithanyam
kaligivuntayi.ivanni chaithanya kramam lo sopaanalu.
చాలా బాగుంది ...సహబాస్ పూడూరీ !!
చాలా ఏళ్ళ నుంచి ఒకే ఊర్లో ఉన్నానని ఒకాయన నన్ను ఓ.. దొబ్బెస్తున్నాడు
ఆయన చూడాలి ఇది, చూస్తాడో లేదో ...
Thought provoking! :)
శశి, ఆత్రేయ, మధురవాణి:
థాంక్యూ సో మచ్.
చాలా బాగుంది. నిజమే అది. అలాగే.. మీ గురించి మీరు రాసుకున్న లైన్ నచ్చింది ... "నేను నాకే ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఆ ప్రయత్నంలో మాత్రం లేను."
-కృష్ణప్రియ. (krishna-diary.blogspot.com)
ఆ వాక్యం గురించి మాట్లాడిన మొదటి వ్యక్తి మీరే. థాంక్యూ.
Post a Comment