Tuesday, November 21, 2017

The tone of the story is captivating...

(Indian Literature మాజీ సంపాదకుడు, త్రిపురనేని గోపీచంద్ రెండు నవలలు అసమర్థుని జీవయాత్ర,, మెరుపులు-మరకలు ఇంగ్లిష్ లోకి అనువదించిన డాక్టర్ దుగ్గిరాల సుబ్బారావు గారు చింతకింది మల్లయ్య ముచ్చట కథాసంపుటి మీద నాకు నవంబర్ 11, 2017న ఈ-మెయిల్ ద్వారా పంపిన అభిప్రాయం ఇది. ఆయన అనుమతితోనే ఇక్కడ పోస్ట్ చేస్తున్నా.)


Raji Reddy Garu,

I have read all the twelve stories in Chintakindi Mallayya Muchchata, Itara Kathalu.

The one I liked most is ‘Rendadugula Nela’: Telugu satire at its comic best, without a Mulk Raj Anand gibe, ‘They think we are mere dirt because we clean their dirt’ (Untouchable, 89), but with a delicious Swiftian bite: ‘Inni vyavasthalu okkasaariga stambhinchipote desaaniki zarige nashtam gurinchi pramukha aardhikavetta Ananda Sen vishleshistunnattu’ (97); ‘entavaarikaina tappadu, anna headingto lota pattukunna Soundarya Roy photonu Midnightpatrika prachurinchinattu’ (97).

The tone of the story is captivating from the very beginning: ‘Dinchi vunna lungini eththi kattaadu. Malli eththi kattina lungini kindiki dinchadhu’ (83), leading through comedic desperation:  ‘Aidaaru software sambandhalu chooste kaadannaru; evaraina paakivaallunte cheppandi’ (99), to ultimate equality: ‘Manushula madhya ellalu karigipotunnattuga, samajam oka anoohya samatasthitiki cherukobotunnattuga anipinchindi’ (99).

Some of the lines I loved are: ‘Waste ata waste… ee sunnitamaina vishayam artham kaani vaallato vaadinchadam waste’ (88); ‘Mari aa panilo vunna kashtam, asahyam, jugupsa gurtinchaana? Koti iste maatram nenu chestaana aa pani?’ (93); ‘Viluva rahitam ga kanbadutoone ardhavantamaina pani, jeevitam laage. Viluva unnattu kanabadutoone, ardhamleni pani, malli jeevitam laage’ (94).

The metaphors in ‘Rekkala Pellaam’ continue to haunt me: wings, plumes, horns; imagination, romance, ego; besides overlapping layers of desire, despair, reality. The story treads a welcome middle path between ancient Indian way and western magic realism, inviting a comparison to Tolstoy’s ‘Porcelain Doll’.

Experiments with language, particularly regional variations, with a natural mix of the local with English, add spice to the dish, reminiscent of the Hyderabad biryani.

The book is beautifully produced, with the stories well placed, opening with ‘Aame Paadaalu’, a romantic invocation of her feet, ending with ‘Srimati Certificate’, an understanding of the homemaker.

While suicide theme in ‘Marana lekhalu and ‘Tammudi maranam 1’ is a trifle repetitive, a welcome foray into the stream of consciousness relieves ‘Manta’.

Wishing you a fruitful, creative, literary career,
DSRao.


ఆకట్టుకుంటాయి

ప్రతి వ్యక్తి జీవన గమనంలో నాటకీయ మలుపులు ఉండవు. ఎదురొచ్చిన జీవితాన్ని యథాతథంగా స్వీకరించి, తృప్తిగా కాలం గడపడమూ చెప్పుకోదగిన అంశమే! పూడూరి రాజిరెడ్డి రాసిన 12 కథల సంకలనంలోని ఖచింతకింది మల్లయ్య ముచ్చట’ అటువంటి జీవితాన్నే పరిచయం చేస్తుంది. అంతర్లీనంగా కుటుంబ బాధ్యతలను నెరవేర్చి, ఆర్థిక భరోసా అందించిన మల్లయ్య తీరుని వివరిస్తుంది. కథల్లో విభిన్న ఆలోచనలూ, సమాజ పరిశీలనా కళ్లకు కడతాయి. కొన్నింటిలోనైతే ఆలోచనలు ప్రవాహంలా సాగుతాయి. ఓ కథలో రియల్‌ క్లైమాక్స్‌ రాయడం కొత్తగా ఉంది. మరణ లేఖలు, తమ్ముడి మరణంఖ1’ లోని భావాలూ ఉద్వేగాలూ మనసుల్ని కదిలిస్తాయి. భాష, కథనశైలి ఆద్యంతం చదివింపజేస్తాయి.

చింతకింది మల్లయ్య ముచ్చట - ఇతర కథలు 

రచన: పూడూరి రాజిరెడ్డి 

పేజీలు: 154; వెల: రూ.144/ 
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు 

-భద్రగాయత్రి
(ఈనాడు ఆదివారం అనుబంధంలో 19 నవంబర్ 2017 నాడు వచ్చిన పుస్తక పరిచయం.)



మంట రాజేసే కథలు

పూడూరి రాజిరెడ్డి జీవితంలోని అనేకానేక ఇతర జీవితానుభవాలకు అక్షర రూపం ‘చింతకింది మల్లయ్య ముచ్చట’ కథాసంపుటి. ఇందులోని పన్నెండు కథలూ రచయిత అనుభవాలలోని ప్రాపంచిక సత్యాన్ని ఎటువంటి సుత్తీ, సోదీ లేకుండా సూటిగా పరిచయం చేస్తాయి. క్లుప్తత కథలకు ప్రాణశక్తి. నిజానికి ఇందులోని కథలన్నీ రచయిత తనతో తాను భిన్న కాల్పనిక వ్యక్తిత్వాలతో జరుపుకున్న ఆత్మకథాత్మక సంభాషణలు. ఈ సంభాషణల్లో అధిక భాగం ప్రశ్నలే కావడం ఒక విశేష వైచిత్రి. సమకాలీన తెలుగు కథకుల్లా తెచ్చిపెట్టుకున్న ఆవేశమూ, సైద్ధాంతిక  కాల్పనికతా, కృత్రిమ కల్పనలూ ఈ కథల్లో కనబడవు. రచయిత అస్తిత్వంలోని ఒక దుఃఖపూరిత తాత్విక  అన్వేషణేదో కథలను హుందాగా, అమాయకంగా నడిపిస్తూ వుంటుంది. ఆ తాత్వికతే నిరలంకార  సత్యంగా కథల నిండా పరుచుకుని ప్రకాశిస్తుంది. అనామక బైరాగి గానంలా సాగిపోయే ఈ కథలను విడివిడిగా వివరించడం వల్ల ప్రయోజనం లేదు. ఒకటో రెండో తప్ప సంపుటిలోని కథలన్నీ పాఠకుల్లో ఆలోచనను రేకెత్తిస్తాయి. దశాబ్దాలుగా తెలుగు కథల్లో లోపించిన ప్రయోగాత్మకత అనేదొకటి ఉందని గుర్తుచేస్తాయి. మరణ లేఖలు, చినుకు రాలినది, రెక్కల పెళ్లాం, కాశెపుల్ల, తమ్ముడి మరణం వంటి కథల్లోని ప్రయోగాత్మకత పాఠకుల్ని ఆకర్షిస్తుంది. చైతన్య స్రవంతి ధోరణిలో సాగే ‘మంట’ కథలోని నిజాయితీ సో కాల్డ్ మర్యాదస్థులను ఆందోళనకు గురిచేస్తుంది. సత్యప్రకటనలో, నిజాయితీలో యూరోపియన్ కథలకు దీటుగా నిలబడుతుంది. ప్రజలు అత్యంత సహజంగా రోజువారీగా వాడే భాషను నిర్భయంగా రాయడానికి చాలా ధైర్యమే కావాలి. తెలుగులో ఆధునిక పూర్వ దిగులును అక్షరమయం చేసిన ఆధునిక కథలు ‘చింతకింది మల్లయ్య ముచ్చట’.

చింతకింది మల్లయ్య ముచ్చట
పూడూరి రాజిరెడ్డి
పేజీలు: 154, వెల: రూ.144
ప్రతులకు: నవోదయ, 040-2465 2387

 
- లెనిన్ ధనిశెట్టి

(అక్టోబర్ 8, 2017 నాటి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురితం.)

Monday, November 20, 2017

ద్వైదీ భావాల సంచారి

ఈ ప్రపంచం మీద కుతూహలమే రాజిరెడ్డిని రచయితగా చేసిందని నేననుకుంటాను. బయట కనిపించినదానిని దృశ్యమానం చేసుకుంటూ లోపల కలిగే ఆలోచనలను మననం చేసుకుంటూ ప్రతిదీ తెలుసుకోగోరే బాటసారి అతడు. తనే ప్రశ్నలు వేసుకుని తనే సమాధానాలు చెప్పుకునే జిజ్ఞాసాపరుడు.
రచయితల అంతశ్చేతన నుంచే కథనో కవితనో పుడుతుందంటారు. రాజిరెడ్డి రచనలన్నీ బౌద్ధిక స్పృహలోంచే వచ్చినట్టుంటాయి. రచయిత ఉనికితోపాటు అతడు తర్కించుకుని నిర్ధారించుకున్న వాస్తవమే డామినేట్‌ చేస్తుంటుంది. ఒకపక్క బయటనుంచి పిలిచే సజీవ జీవిత సాంసారిక లోకం, మరొకపక్క లోపల ఆకర్షించే సన్యాసి వైరాగ్యం. ఈ రెండింటిలో దేనినీ వదులుకోలేని ద్వైదీభావాల సంచారి అతడు. తనతో తనే సంవాదం పెట్టుకుంటాడు. ఆ వాదప్రతివాదాల మధ్య నిలబడి కథ చెబుతాడు.
స్వతహాగా రాజిరెడ్డి తనదైన జీవితాన్ని అన్వేషించే భావుకుడు. కాని దృక్పథపరంగా జీవితానికీ, అందులోని వాస్తవానికీ లొంగి ఉన్నాడు. ఆదర్శాలను గ్లోరిఫై చేసుకునే భ్రమలు లేవు. కథల్లోని నాటకీయత మీద, కల్పనలోని అతిశయోక్తి మీద ఏవగింపు ఉంది. ఇది కథకుడి నైపుణ్యానికి సంబంధించిన విషయం కాదు. దృక్పథానికి చెందిన ఎంపిక. మరి అతడు అనుకున్నదానికి అతీతంగా ఉండే కల్పన ఉండదా? తను కల్పనను ఎంత బాగా రాయగలడో ‘రెక్కల పెళ్లాం’ చెబుతుంది. రెక్కలు, తురాయి వంటి ప్రతీకలను అవతల ఉంచి కథ నడిపిన తీరులో సహజసిద్ధమైన ప్రతిభ కనిపిస్తుంది.
వాస్తవంలోని విషాదం, నిజ జీవితంలోని హిపోక్రసీ అతడికి కనపడలేదా అంటే ‘మంట’ వాస్తవంలోని హిపోక్రసీని ఏవగించుకుంటుంది. అందులోని ప్రొటాగనిస్ట్‌ తన నిర్ణీత సమయపు కొలతలకు అందని సరిపడని విషయాలన్నిటినీ తిరస్కారంతో నిర్దాక్షిణ్యంగా నరుక్కుంటూ పోతాడు. కర్కశంగా ఈ ప్రపంచంతో విభేధిస్తాడు. చివరికి ఊహలో ఊరట పొందుతాడు.
అనేక వాస్తవాల సారాంశం చిట్టచివరికి ఒక కళాత్మకమైన కల్పనగా రూపొందడాన్ని ‘తమ్ముడి మరణం’లో చూడవచ్చు. నిజ జీవితంలోంచి తీసుకుని రాసినా ఈ కథ వాస్తవాన్ని దాటి కళాత్మకమైన కథగా రూపొందింది.
 ‘చింతకింది మల్లయ్య ముచ్చట’ ఒక చిత్రకారుడు సగంలో విరమించిన ఒక గొప్ప వర్ణ చిత్రపటంలా నాకనిపిస్తుంది. కథని ఒక సంఘటనగా చూడక ఒక వ్యక్తి జీవితం మొత్తం కథలో వ్యక్తం కావాలని ఏ కథా చెప్పదు. సాహిత్యం జీవితాన్ని పూర్తిగా వ్యకంచేయలేదనేది ఎప్పటికీ నిర్వివాదం. తను చూసే చరాచర జగత్తులో కథకుడు దేన్ని కథ చేయాలనుకుంటున్నాడో, ఏది అతడిని కథ రాయడానికి పురిగొల్పిందో అదే అతడి దార్శనికత. మానసిక ఆధిపత్యం సాధించడం, ఎలుగుబంటితో హీరోలా పోరాడటం, వీటికి అతీతంగా చింతకింది మల్లయ్య జీవితాన్ని పట్టిచ్చే మాట, సంఘటన కథకి దొరికేది ఏదీ ఉండదా? ఒక సంఘటనని కథ చేయడానికీ అందులోని కాల్పనికమైన నాటకీయత చూడటానికీ మధ్య తేడా గుర్తించగలిగితే ఇది సమస్య అనిపించదు. ఇంకాస్త ముందుకెళ్లి అసలు డ్రామాలేని కథ ఉండదు అనికూడా అనగలను. పరిహరించుకోవాల్సింది అందులోని కృతకత్వాన్నే. నాకైతే చింతకింది మల్లయ్య చెప్పిన ముచ్చట్లలో నాటకీయతకి ఆస్కారం లేని అనేక కథలు కనిపించాయి.
రాజిరెడ్డి వచనానికి వర్ణనలతోపాటు తర్కం అదనపు అలంకారం. అయితే ఏ తర్కమైతే రాజిరెడ్డి వచనాన్ని, దృక్పథాన్ని పరిపుష్టం చేస్తున్నదో ఆ తర్కమే ఒక్కోసారి అతడి కథనానికి అవరోధం కూడా అవుతున్నది. అదే అతడిని భౌతికవాది అనుకునేట్లుగా చేస్తున్నది. అడుగడుగునా అతడి ‘నేను’ అతడికి అడ్డం పడుతుంటాడు.
ఈ పుస్తకంలో కొన్ని కథల ముగింపు కథాంశాన్ని పట్టిస్తుంది. ఎక్కువ కథల్లో అప్పటిదాకా చెప్పిన భావధారకి వ్యతిరేకంగా రచయిత యుటర్న్‌ తీసుకుంటాడు. అదికాకుంటే ద్వైదీభావంలో ఉన్న మనిషి ప్రాక్టికల్‌గా ఆలోచించి జీవితంలోని వాస్తవానికి లొంగిపోవడం జరుగుతుంది.
రాజిరెడ్డి కథల్లో కల్పన తక్కువ. కలలు అసలే ఉండవు. వర్ణనలు ఉంటాయిగాని మితిమీరిన అలంకరణలు ఉండవు. రాజిరెడ్డికి ఏది అందంగా కనిపించింది అని ఈ పుస్తకాన్ని మళ్ళీ తిరగేస్తే ‘కాశెపుల’్లలో అతడికి బాల్యంలో  బతుకమ్మ పండుగనాటి గునుగుపువ్వు దొరికింది. ‘చినుకు రాలినది’లో షేరింగ్‌ ఆటోలో పసిపాప కళ్లలో దివ్యమైన వెలుగు కనిపించింది. కథ చివర కొడుకు నవ్వు ముఖాన్ని చూడటానికి వెళ్లే అతడి ఉత్సాహాన్ని ఆటోవాడి దగ్గరనించి తిరిగిరాని రూపాయి కొంతయినా తగ్గించడం కథ పూర్వరంగాన్ని కరప్ట్‌ చేసినట్లు అనిపించింది.
ఒక కథ పుట్టడానికి ముందు ఏ నిబంధనలూ ఉండవు. ఏ సూత్రాలు అడ్డు పడవు. అది పూర్తయ్యాక అన్ని కొలతలూ సమానంగా ఉన్నాయా, కథనం కథాంశానికి అనుగుణంగా ఉందా? వస్తువుని ఎలా ఇమిడ్చాడు అనే చర్చ ఎప్పుడూ ఉంటుంది కాని పుస్తకంలో రచయిత అనుభవాలు భవిష్యత్తులోని వర్తమానానికి ఏ మేరకు వర్తిస్తాయి అన్నది కూడా పుస్తకానికి అదనపు విలువ అనుకుంటాను. అలా చూస్తే ఇందులోని కాశెపుల్ల, తమ్ముడి మరణం, రెక్కల పెళ్లాం, మంట లాంటి కథలు కాలానికి నిలబడతాయనే నా నమ్మకం.
ఒక సంకలనం తెచ్చాక కథకుడు రూపాంతరం చెందుతాడంటారు. ఈ మలుపు తరవాత ఇకముందు రాజిరెడ్డి ఎలాంటి కథలు రాయబోతున్నాడన్నది ఆసక్తికరమే. నేనైతే అతడు తన బాహ్యప్రపంచపు నలుగులాట కాస్తంత విడిచిపెట్టి ఇంకాస్త కాల్పనికతలోకి ప్రవేశించాలని కోరుకుంటున్నాను. రాజిరెడ్డి తన బయటినుంచి లోపలికి వెళ్లే దారికంటే తన లోపలినుంచి బయటకు వచ్చేదారి నాకు మరింత కళాత్మకంగా కనిపిస్తుంది.

(చింతకింది మల్లయ్య ముచ్చట – ఇతర కథలు; రచన: పూడూరి రాజిరెడ్డి; పేజీలు: 156; వెల: 144; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు. ప్రచురణ: ఛాయ రిసౌర్సెస్‌ సెంటర్, హైదరాబాద్‌; ఫోన్‌: 9848023384)

(అక్టోబర్ 9, 2017 నాటి సాక్షి సాహిత్యం పేజీలో ప్రచురితం.)
– బి.అజయ్‌ప్రసాద్‌
9247733602

Friday, May 5, 2017

ఒకటీ రెండూ ఐదూ పదీ ఇరవై

ఒక రోడ్డు, పార్కు, గుడి, హాస్పిటల్, ఆఫీస్, బాంక్, పబ్, చివరికి స్మశానం…
ఒక రచయితకి ముడిసరుకు దొరకని చోటేదైనా ఉంటుందా? అలాంటి చాలా చోట్లకి తిరిగారు రాజిరెడ్డి. రచయితగా కాదు, జనంలో ఒకడిగా. ముడిసరుకుని పోగుచేసుకుని వాటిని కథలుగా మలుచుకునేందుకు కాదు. రచయిత తాలూకూ లోలోపలి వ్యాఖ్యానాన్ని అదిమిపెట్టి ఒక కెమెరాలాగా, ఒక టేప్ రికార్డర్ లాగా తనకి ఎదురైన అనుభవాల్ని నమోదు చేసుకునేందుకు. ఆయా చోట్లలో తారసపడ్డ విషయాల్ని ఉన్నదివున్నట్టు పాఠకుల ముందు ఉంచేందుకు. ఇదొక సెల్ఫ్ చెక్, సోషల్ చెక్, రియాలిటీ చెక్. మనకి సీదా సాదాగా ఒకే డైమెన్షన్ లో కనిపించేదే రాజిరెడ్డికళ్ళతో చూసినపుడు బహుమితీయంగా, ఫిలాసాఫికల్ లోతులు తొడుక్కుని కనిపిస్తుంది. 



(వాకిలి; డిసెంబర్ 2016)


దేవుడు ఆడే ఫుట్ బాల్

యితే నేను ఫిల్టర్ ఎత్తేయడం మంచిదే అయింది. అందుకేగదా కొత్త క్యాండిల్స్ కోసం వెతుక్కుంటూ బజార్‌కు వెళ్లాల్సివచ్చింది; అప్పుడే కదా అక్కడ ‘చోటు’ ఫుట్‌బాల్ చూశాడు. పిల్లలు మాత్రమే దాన్ని ఫుట్‌బాల్ అని నమ్మగలరు! ఫుట్‌బాల్ కాని ఫుట్‌బాల్ లాంటి ఫుట్‌బాల్ అది. లేతాకుపచ్చ రంగులో ఉంది. నాలుగుసార్లు గట్టిగా తంతే నలభై సొట్టలు పడిపోతుంది! అయినాగూడా పొద్దున పార్కులో ఆడుకోవడానికి బాగానే పనికొస్తుంది! ఓ, ఇదొక పెద్ద పార్కు! పార్కు కాని పార్కు లాంటి పార్కు! కానీ పొద్దున మేము ముగ్గురమే వెళ్తాం కాబట్టి, మేము ముగ్గురం వెళ్లడం వల్లే బాగుంటుంది!

http://vaakili.com/patrika/?p=11691

(వాకిలి; ఆగస్ట్ 2016)

బాడ్ ఇమేజ్

ఇలాంటిదొకటి జరిగే అవకాశం ఉందని మీరు నమ్ముతారా?
మనం ప్రయాణిస్తున్న ఆటో ఏ బైకునో అలా తగులుతూ వెళ్లిందనుకోండి; ఆ బైకువాలా ఆటోడ్రైవర్‌ను ఉద్దేశించి- ‘నీ యమ్మ’ అంటూ కోపంగా చూడబోతాడు; కానీ ఈలోపు ఆటో ఎటూ దాటిపోతుంది; కానీ బైకు అతనికి ఏమైందోనన్న కన్సెర్న్‌తో కూడిన కుతూహలంతో మనంగానీ ముఖాన్ని అతడి వైపు పెట్టామా– ఆ ఆటోడ్రైవర్ స్థానంలో మన ప్రతిరూపాన్ని కూర్చోబెట్టుకుంటాడు.


(వాకిలి; మే 2016)