(గంగరాజం బిడ్డ పుస్తకం మీద డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల ట్విట్టర్లో చేసిన పోస్ట్)
Saturday, January 31, 2026
మంచి పుస్తకం చదివాను అన్న ఆనందం
Wednesday, November 12, 2025
గంగరాజం బిడ్డ కోవెటుకొచ్చింది...
గంగరాజం బిడ్డ కోవెటుకొచ్చింది.
Sunday, November 9, 2025
చిరుస్పర్శల కథలు
(5-1-2025 నాటి స్వరూప్ తోటాడ ఎఫ్బీ పోస్ట్)
ఈ పుస్తకంలో "మెడిటేషన్" అనే కథ కథలో ఆలోచనని అదుపు చేయాలని ప్రయత్నిస్తున్న మనిషి నియంత్రణ లోంచి తప్పించుకుని మనసు ఎన్ని గంతులు వేస్తుందో భలే వివరం ఉంటుంది. ఆ చిన్న చిన్న nuances of thoughts and feelings లోనే మనం కధల్లోకి ఎక్కవనుకునే ఎన్నో జీవితపు నీటి బుడగలు పేలుతాయి. "మట్టిపాము లా కనబడిన బుక్ షెల్ఫ్ చెదలు, క్రిస్మస్ ట్రీని తలపించే సీతాఫలం లోపలి తొడిమ" ప్రత్యేకంగా ప్రస్తావించబడి, ఆ వివరాల్ని ప్రత్యేకంగా దాచుకునే చిన్న మెదడు గదుల తలుపుల్ని తడతాయి. బ్రాడ్ బ్రష్ స్ట్రోక్స్ లో జీవితాల్ని జీవించేస్తూ ఈ వివరాల్ని కేవలం collateral, peripheral feelings గా అనుకుని మనం ముందుకెళ్ళిపోతుంటే ఇలాంటి చిరుస్పర్శల్ని గుచ్చి కథలు చెప్పే రచయిత ఈ micro-macro juxtaposition ని కాగితం మీదకి తెస్తాడు. ఐతే చిత్రంగా ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కథ "ఎడ్డి" మళ్ళీ బ్రాడ్ స్ట్రోక్స్ ఎమోషనే. అవును, మనకు జీవితం మీద ఓవరాల్ వ్యాఖ్యానం చేసే కథలు కావాలి, ఆ కథ చెప్పే రచయితకు మన శరీరానిదో మనసుదో ఇంకా తేలని మన immediate senses స్పందన తాలూకు ఊగిసలాటలూ తెలియాలి. వీటన్నిటినీ కలిపి మూడేసుకోవాలనే మన ప్రయత్నమూ, నిస్సహాయతా జీవితమైతే వాటిని కలిపి ముద్ద తినిపించే కథలు ఒక ప్రత్యేకమైన రుచి.
Thursday, November 6, 2025
ఫస్ట్ ప్లేస్ దేనికి...
(16-12-2024 నాటి వి.మల్లికార్జున్ ఎఫ్బీ పోస్ట్)
ఈ పుస్తకం గురించీ ఇందులోని రెండు కథల గురించీ ఈ మధ్య బాగా ఆలోచిస్తున్నా. మొన్ననే రాజిరెడ్డితో కూడా చెప్పానిది. కొండ, ఎడ్డి అని రెండు కథలుంటాయీ పుస్తకంలో. రాజిరెడ్డి రాసినవాటిల్లో ఈ రెండింటినీ టాప్-టూలో పెట్టి చూసుకుంటాను. ఫస్ట్ ప్లేస్ దేనికివ్వాలా అని నాతో నేనే గొడవ పడుతుంటాను. మొన్న ఒక రోజు ఎందుకో కొండ కథ గురించి ఆలోచిస్తూ ‘ఇదేనేమో బెస్ట్’ అనేసుకున్నా.
Monday, April 8, 2024
మనసు నుండి రాసి, మనసుల్ని రాజేసిన రాజిరెడ్డి!!
ఫిలిం మేకర్ సత్య తేజ్ ‘గంగరాజం బిడ్డ’ పుస్తకం మీద తన అభిప్రాయాన్ని ఏప్రిల్ 1, 2024న ఎఫ్బీలో పోస్ట్ చేశారు. అదే ఇక్కడ పంచుకుంటున్న.
-----------------------------------------------------------------
మనసు నుండి రాసి, మనసుల్ని రాజేసిన రాజిరెడ్డి!!
Tuesday, April 2, 2024
'ఆంధ్రజ్యోతి'లో 'గంగరాజం బిడ్డ' సమీక్ష
గంగరాజం బిడ్డ
బహుముఖ విన్యాసాల కదంబం
కల్పనకు, వాస్తవానికి మధ్య ఉన్న పొరను ఒలిచేస్తున్న రచయిత పూడూరి రాజిరెడ్డి, వాక్యాన్ని భావగర్భితంగా నిర్మించే వీరి రెండో కథా సంపుటి 'గంగరాజం బిడ్డ'. 12 కథల ఈ సంపుటిలో మనిషి మానసిక విన్యాసాలతోపాటు, భౌతిక పరిస్థితుల ప్రభావిత చర్యలు, అనేకానేక పరిమితుల్లో చర్య, ప్రతిచర్యల క్రియలు వంటివి ఎన్నో ఉన్నాయి. ఎక్కువగా గ్రామీణ నేపథ్యంలో సాగుతూ, వాతావరణ పరికల్పన, అద్భుత పాత్రచిత్రణలతో కనిపిస్తాయి. 'బోర్లించిన చెప్పు'లో గతంలోని ఆవేశపు మాటల్ని వదులుచేసే వర్తమాన సన్నివేశం కలిగించే హాయి ఉంది. 'గంగరాజం బిడ్డ'లో తండ్రి చేసిన తప్పులకు బిడ్డకు ఎందుకు శిక్షపడాలని ఓ అవ్వచేసే తిరుగుబాటు అబ్బురపరుస్తుంది. 'మెడిటేషన్' కథ సంకల్పిత, అసంకల్పితాల్లోంచి పుట్టిన మనో నిర్మిత చైతన్యస్రవంతి, తాత్విక సిద్ధాంతాల పోరును వెల్లడిస్తుంది. 'జీవగంజి' వాస్తవాన్ని సత్యమని స్వీకరించడమే ఉత్తమమని అన్నం మెతుకు సాక్షిగా బోధిస్తుంది. 'చిలుము' స్వప్నంలా రాలిపోయిన ప్రేమతో పాటు, ప్రాంతం, మతం, భాషల ఆధిపత్య భావజాలాన్ని బలంగా చూపిస్తుంది. జ్ఞాపకాల పొత్తిళ్లలోకి కథనాత్మకంగా జారిపోయే ఈ రచయిత, కళ మనిషికి సంబంధించిన అత్యుత్తమ పార్శ్వం అని నమ్మి, మిగిలిన కథల్లోనూ అదే విష యాన్ని నిరూపించాడు. నిజంగా, ఇవి పెనుగులాటలోంచి పుట్టిన మేలైన కథలు.
- ప్రణ
గంగరాజం బిడ్డ మరిన్ని కథలు, రచన: పూడూరి రాజిరెడ్డి
పేజీలు: 114, వెల: రూ.150, ప్రతులకు: 99124 60268 మరియు 'అమెజాన్'
Monday, April 1, 2024
సాక్షి- పుస్తక పరామర్శ - గంగరాజం బిడ్డ
Friday, January 19, 2024
గంగరాజం బిడ్డ పుస్తకంపై పద్మజ సూరపరాజు గారి స్పందన
(గంగరాజం బిడ్డ పుస్తకంపై పద్మజ సూరపరాజు గారు తన అభిప్రాయాన్ని జనవరి 3న తన ఫేస్‌బుక్ వాల్ మీద పోస్ట్ చేశారు. దాన్నే ఇక్కడ కాపీ చేస్తున్నా.)
గంగరాజం బిడ్డ - పూడూరి రాజిరెడ్డి










