Showing posts with label చిరస్మరణీయులు. Show all posts
Showing posts with label చిరస్మరణీయులు. Show all posts

Monday, May 16, 2011

చలాన్ని విన్నాను!

పురుషుడి నిర్జీవమైన బతుకులో రసం నింపడానికి స్త్రీ సృష్టించబడిందంటాడు చలం.
నిర్జీవమైన సాహిత్యంలో రసం వంపడానికి చలం పుట్టాడేమో!
అలాంటి చలాన్ని చూడగలిగే తరంలో పుట్టనివాణ్ని కాబట్టి, కనీసం ఆయన గొంతు వినడం ఒక భాగ్యమే కదా! అది ఈ మధ్యే తీరింది. వాడ్రేవు వీరలక్ష్మీదేవి వల్ల. "చలం సీడీ'ని ఆమె నాకు అభిమానంగా పంపడం వల్ల.
మూడు గంటల నిడివిగల ఇందులో వరుసగా-
౧ పురూరవ గంటన్నర రేడియో నాటకం
౨ చలం గురించి విశ్వనాథ, శ్రీశ్రీ, మో, రంగనాయకమ్మలాంటివాళ్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు
౩ బాలాంత్రపు రజనీకాంతరావుకు చలం ఇచ్చిన రేడియో ఇంటర్వ్యూ
౪ చలం పాడిన పాటలు ఉన్నాయి.
చలం వీరాభిమాని గురుప్రసాద్ వీటిని సంకలించి, కొంత రికార్డింగు చేసి, "చలం ఫౌండేషన్' తరఫున రెండేళ్లక్రితం సీడీగా తెచ్చారు. ధర 100 రూపాయలు. ఫోన్: 9951033415.

చలం మాస్టర్ పీస్ పురూరవను వినడం బాగుంది. ఊర్వశిగా శారదా శ్రీనివాసన్ గొంతు ఒకలాంటి జీరతో మత్తుగా ఉంటుంది. గొప్ప వాయిస్. అయితే, పుస్తకంగా చదివినప్పుడు నాకు అజ్ఞాతంగా వినిపించిన ఊర్వశి గొంతంత గొప్పది మాత్రం కాదు. చదవడం కంటే ముందు వినివుంటే ఇలా ఉండేది కాదేమో! బహుశా, మనం ముందే ఒక ప్రమాణానికి లోబడినప్పుడు దాన్ని అంగీకరించేస్తాం. మన ఊహే మన ప్రమాణమైనప్పుడు దాన్ని అందుకోవడం ఎవరితరమూ కాదు.
ఇక, "చలం ఎంగిలిమాటలు ఎప్పుడూ వాడలే'దని ప్రశంసిస్తాడు విశ్వనాథ. వేమన, చలం ఇద్దరూ ఒకటేనని చెబుతాడు శ్రీశ్రీ. "వేమన ఇంట్యూటివ్గా చెబితే, చలం ఇంటెలెక్చు్యవల్గా చెప్పాడు'.

ఇంటర్వ్యూలోనూ, పాటల్లోనూ చలాన్ని వినగలుగుతాం. చివరిదశలో, ముద్దముద్దగా మాట వచ్చే వయసులో. అయినా అది చలం గొంతు! ఈ ప్రపంచంతో సమన్వయం చేసుకోవడానికి తనకు ఎప్పటికి కుదురుతుందోనని వాపోయే చలం, నాలోని చీకటినే కాగితం మీద పెట్టాను తప్ప, ఎవరినో, దేన్నో దండించడానికి కాదని ఒప్పుకునే చలం, సత్యం లోపల్నుంచి దొరకాలి తప్ప, బైటెక్కడో లేదనే అన్వేషి చలం, ఈ చలం అనేవాణ్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాననే ఆధ్యాత్మిక చలం, ఎందరో చలాల ఏక గొంతుకైన చలం...

పీఎస్:
ఒకప్పుడు నా ఊహలో ఉన్న ఊర్వశిని శారదా శ్రీనివాసన్ రీప్లేస్ చేశారు. "ఒరిజినల్ వాయిస్' మరిచిపోయాను. చలం గొంతు గురించి మాట్లాడాల్సిన సందర్భంలో కూడా నేను శారద గొంతు గురించి మాట్లాడుతున్నానంటే... ఖర్మ! కొన్నయినా చలం అక్షరాలేగా నాలోనూ ప్రవహిస్తోంది.

Monday, May 10, 2010

నేను తత్వవేత్త కాదు!



జిడ్డు కృష్ణమూర్తి మీద ఫండే కోసం నేను రాసిన నాలుగు మాటలు .
పుట్టిన రోజు ౧౧ మే అని గమనించండి.

Monday, June 29, 2009

శంకర్ కోసం!



శంకరన్నను మెచ్చుకుంటూ నాలుగు మాటలు రాయాలని నా ప్రయత్నం. తను ఆనంద పడ్డాడు. కానీ, ప్చ్.. తంబురా అని రాయాల్సింది వీణ అనేశాను. అజ్ఞానం.

Monday, April 6, 2009

ఓ లెజెండ్

నాకు బాగా నచ్చే వ్యక్తుల్లో రాహుల్జీ ఒకరు. ఆయన రాసిన వోల్గా నుంచి గంగకు నా అభిమాన పుస్తకాల్లో ఒకటి. ఆయన పుట్టిన రోజుకు నేను రాసిన నాలుగు మాటలు
.

Monday, March 23, 2009

పతంజలికి అంజలి!

'
కారణం తెలియదు, పతంజలిని నేను చాలా ఆలస్యంగా చదివాను.
మా ఎడిటర్ అయ్యాక కూడా చదవక పోవడం దారుణం అన్నట్టుగా చదివాను.
ఎంత నవ్వుకున్నానో నాకే తెలియదు.
గోపాత్రుడు తెలుగు సాహిత్యంలో క్లాసిక్. నా ఫేవరేట్ కూడా.
తెలుగులో టాప్-౨౫ నవలల్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటే ఇది కూడా అందులో ఉంటుంది. ఉండాలి.
ఈ విషయం నేను ఆయనకు మెసేజ్ కూడా ఇచ్చాను. ఏమనుకున్నారో తెలియదు.
'థాంక్స్' అని రిప్లై మాత్రం ఇచ్చారు.

Monday, August 25, 2008

అతడు ఎడారిని జయించాడు


I admire him as Mahatma. It was painful when I read He is no more. Masanobu Fukuoka, A legend of Natural Farming was died on 16th August 2008. He was 95 years old. I am posting one Mr.Nagesh's Article as a tribute to him.
One of My pen names is also Fukuoka.

Monday, August 11, 2008

ఆయన జీవితమే సందేశం


I liked these sketches by Mr.Shankar. I wrote few lines on Mahatma, remembering him on coming Independence Day. This was published on 10th August 2008 in Funday.