Showing posts with label సాక్షి వ్యాసాలు. Show all posts
Showing posts with label సాక్షి వ్యాసాలు. Show all posts

Friday, February 17, 2017

Monday, November 21, 2011

పాత చొక్కాను తడిమిన ఆనందం

జీవితం క్షణికం కావొచ్చు. కానీ క్షణం అసత్యం కాదు.
-యండమూరి వీరేంద్రనాథ్

యండమూరితోనే నాకు సాహిత్యం పరిచయం. కానీ "అనూహ్య' పరిచయం. అట్టలూడిపోయిన పుస్తకమొకటి మామయ్య వాళ్లింట్లో పడివుంది. అలా అంతకుముందు కూడా కొన్ని పడివున్నవి తిప్పిచూశానుగానీ అవి రాసినవాళ్ల పేర్లుగానీ, వాళ్లను మళ్లీ చదవాలన్న కోరికగానీ కలగలేదు. ఈ చీకట్లో సూర్యుడు అందుకు విరుద్ధం. నన్ను అంతరిక్షంలో గిరికీలు కొట్టించాడు. కొన్ని రోజులు యశ్వంత్ లాగా మౌన గంభీరంగా ఉండటం గొప్పనుకునేవాణ్ని. కాదు, వాయుపుత్రలాగా అల్లరిగా ఉండటమే గొప్ప కాబోలనుకునేవాణ్ని. చివరకు ఇద్దరిగానూ ఉండలేక, నాలా నేను ఉండటానికి ఇప్పటికీ విఫల యత్నం చేస్తున్నాను.
మళ్లీ ఈ మధ్యలో ప్రకాశం జొరబడ్డాడు. మాసిన దిండులాంటివాడు. ఇంకెప్పుడో గాంధీ వచ్చిచేరాడు. రెపరెపలాడే కొత్తనోటులాంటివాడు. అయితే, అటు ప్రకాశంలా ఉండిపోనూలేము. ఇటు గాంధీలాగా పచ్చనోట్లు తగలబెడుతూ చిర్నవ్వుతో చూడనూలేము. కాకపోతే, మన ప్రియురాలు ఎప్పుడు పిలుస్తుందా? తలవాల్చేందుకు పల్చటి పొత్తి కడుపు ఎప్పుడు లభిస్తుందా? అని కలలు కనడం మాత్రం చేయగలిగాము.
ఇంకా, చెంగల్వపూదండలూ వెన్నెల్లో ఆడపిల్లలూ గోదారులూ ప్రేమలూ పర్ణశాలలూ అభిలాషలూ అనైతికాలూ ప్రార్థనలూ యుగాంతాలూ...
ఈయనెవరో నాకోసమే రాస్తున్నాడా?
మందాకిని స్నానించినప్పుడు ప్రవహించే సబ్బు నురుగు పుట్టించే కొన్ని ఉత్తేజిత క్షణాలు... యండమూరిని చదవడం.

పైనెక్కడో సాహిత్యంతో పరిచయం అన్నానా!
కొంత పెద్దయ్యాక, పెద్దాళ్లు రాసింది చదివితే, యండమూరి రాసింది క్షుద్ర సాహిత్యం అని తెలిసింది. కానీ, దాన్ని క్షుద్ర సాహిత్యం అని అంగీకరించడానికి నాలో దాగివున్న క్షుద్రుడు అడ్డుపడ్డాడు.
ఇంకా యండమూరి దురదృష్టం ఏమిటంటే, "కామూ'ను చదివి ఆయన అంతర్ముఖం రాస్తే, కాపీ కాపీ అన్నవాళ్లు... అదే కామూలాంటివాళ్లను తెలుగులోకి తెచ్చినవాళ్లను సృజనశీలురుగా ముద్రవేయడం. బహుశా పేరొచ్చినవాడిని మనం సహించం. డబ్బు కూడా వచ్చినవాడంటే అసలు భరించం. సాహిత్యం సంపద ఇవ్వడమేమిటి మరి? చర్చలకూ, వాదోపవాదాలకూ పనికిరావాలిగానీ!

యండమూరి డబ్బు కోసం మాత్రమే రాసినవాడా?
ఒక మామూలు యువ ఉద్యోగి. మొదటిసారి స్లీపరు క్లాసులో ప్రయాణిస్తున్నాడు. అంగీ విడిచి, బనీన్ మీద పడుకోవాలి! సహ ప్రయాణీకులు ఖరీదుగా కనిపించారు. వాళ్ల మధ్య అలా చేస్తే తన పల్లెటూరితనం బయటపడుతుంది. ఎలా? ఇంతలో ఓ కాఫీ అమ్ముకునే కుర్రాడు వచ్చాడు. అతడికివ్వాల్సిన చిల్లర కోసం ఆ ఖరీదు మనుషులు ఎంత చిల్లరగా ప్రవర్తించారని! డబ్బులివ్వలేదు. రైలు కదిలింది. కుర్రాడు పరుగెత్తుకుంటూ వచ్చి కిందపడ్డాడు. మట్టిలో దొర్లాడు. యువకుడు చలించాడు. జేబులో ఉన్న డబ్బులో గుప్పిడితో తీసి పిల్లాడివైపు విసిరికొట్టాడు. ఖరీదైన వ్యక్తిత్వాల మీద తనకు ఉన్న భ్రమ అనే "మిస్ట్" ఇట్టే కరిగిపోయింది. ఇక వాళ్లను ఖాతరు చేయకుండా, లుంగీ బనీన్ మీదే కాళ్లు జాపుకుని హాయిగా పడుకున్నాడు.
బహుశా, యండమూరి కూడా తన విమర్శకుల విషయంలో ఇదే చేసివుంటాడు.

అయితే, నాటకాలు, నవలలు, వ్యక్తిత్వ వికాసాలు అనబడే మూడు దశలుగా ఉన్న తన సాహితీ జీవితంలో... యండమూరి మొదట్లో ఉన్నట్టు మధ్యలో లేడు. మధ్యలో ఉన్నట్టు ఇప్పుడు కనబడడు. అది మార్పుగా కాకుండా, తనను తాను ఏమార్చుకుంటూ వెళ్లాడేమోననిపిస్తుంది. సమాజపు కన్నీళ్లు తుడవడం కంటే, అందుకోసం టిష్యూ పేపర్స్ అమ్మితే బాగుంటుందన్న ఆలోచనాధోరణిలో పడిపోయాడు. పోరాటమే తప్ప జీవితంలో జయాపజయాలు ఉండవని తెలిసినా విజయసూత్రాలు లిఖించడం మొదలుపెట్టాడు.

ఇక ఇది నాకు సరిపోదని బీరువా అడుగున మడతపెట్టి దాచిన పొట్టి చొక్కా యండమూరి సాహిత్యం. వేసుకోవడానికి కుదరకపోయినా, తడిమి చూసుకుంటే అపురూపంగా ఉంటుంది.

(నవంబర్ పద్నాలుగున యండమూరి పుట్టినరోజు)

Tuesday, October 11, 2011

నాకు బాగా నచ్చిన కథ 'అతడు మనిషి'



సాక్షి సాహిత్యం పేజీలో "ఎంపు" శీర్షిక కోసం రాసిందిది.

Tuesday, January 18, 2011

ఒక ఒగ్గు కళాకారుడి గురించి...



కొమురయ్య గురించి రాయడంలో ముఖ్యోద్దేశం, ఆయన మౌఖికంగా చెప్పే గొల్లల చరిత్రను పుస్తకంగా తేవడంలో ఆ తరహా అభిరుచి ఉన్నవాళ్లు ఎవరైనా ఆయనకు సహకరిస్తారేమోనని.
ఆయన్ని మళ్లీ ఎప్పుడైనా కాంటాక్ట్ చేయడానికి, ఫోన్ ఏమన్నా ఉందా?, అని అడిగాను.
ఒక్కొక్క మాటనే ఒత్తి పలుకుతూ, "నైను ఐటు ఫోరు నైను వన్ను త్రీ ఫైవు త్రీ సిక్సు సెవను' అన్నాడు.
"చదువురాదన్నవ్, ఇవ్వెట్లొచ్చె?'
"గీయింతమందం మా మనువరాలి దగ్గర నేర్సుకున్న'

ప్రచురణ: సాక్షి ఫ్యామిలీ- రిపోర్టర్స్ డైరీ శీర్షిక

Wednesday, May 5, 2010

నూరు పాటల లింకు

ఫండే ఎంపిక చేసిన 100 పాటలను ఇద్దరు పాఠక మిత్రులు సేకరించగలిగారు.
జయప్రకాశ రాజు గారు, తాడేపల్లి పతంజలి గారు.
రాజు గారు నాకు సీడి పంపారు. పతంజలి గారు లింకు పంపారు.
ఇక్కడ వాటిని వినొచ్చు.

http://www.mediafire.com/?sharekey=3ee2b8db2e2afeb161d4646c62b381cbfef36d771aad715e4df0d6082f1c2cd0

Monday, March 29, 2010

ఉత్తమ సినిమా- ఉత్తమ పాట- ఉత్తమ పుస్తకం









ఫండే రెండో వార్షికోత్సవం కోసం మేము చేసిన ప్రయత్నం ఇది. ౧౦౦ సినిమాలు, ౧౦౦ సినిమా పాటలు, ౧౦౦ తెలుగు పుస్తకాలను ఎంపిక చేయడం మామూలు సాహసం కాదు. అయినా ప్రయత్నం చేశాం. జాబితాలు ఇక్కడ ఇవ్వడం కుదరదు. కేవలం దానికి నేను రాసిన ముందుమాటను మాత్రమే ఇక్కడ పోస్ట్ చేస్తున్న.

Wednesday, June 10, 2009

రైలుబడిలో చదువుదాం!




నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటి రైలుబడి. బాల్యాన్ని ఎంత అందంగా రాయడానికి వీలుందో అంత అందంగా రాసింది కురోయనాగి. పిల్లలు, టీచర్స్ ఖచ్చితంగా చదవాలి దీన్ని.
ఇది జూన్ ౭ న ఫండే లో వచ్చింది.

Monday, March 30, 2009

ఫండే పుట్టిన రోజు ఇవ్వాళ!

మార్చ్ ౩౦ రోజు ఫండే తొలి సంచిక ఇచ్చాం. అప్పుడే ఏడాది గడిచిపోయింది. మొదటి దాన్లో తొలి అడుగు పేరిట ప్రారంభ వ్యాసం రాశాను. ఈ వార్షికోత్సవానికి దాని సీక్వెల్ ఇది.