పోయిన్నెల మా కరెంట్ బిల్లు 51 రూపాయలు!
Tuesday, November 18, 2025
పోయిన్నెల మా కరెంట్ బిల్లు 51 రూపాయలు!
Saturday, March 16, 2024
శాస్త్రి గారు - ఇడ్లీ పొట్లం
పతంజలి శాస్త్రి గారికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం వచ్చినట్టుగా తెలియజేసిన వార్తాపత్రిక ఇడ్లీ పొట్లంగా మారడంలో పెద్ద వింతేమీ లేదు. కానీ అది సరిగ్గా ఆ రచయిత దగ్గరికే చేరడంలోనే సృష్టి కుట్ర ఏదో ఉందనిపిస్తుంది. దీనికిదే ఒక చిన్న కథ అవుతుంది. టైటిల్ కావాలంటే పైది పెట్టుకోవచ్చు
Sunday, December 31, 2023
బ్లాగునామ సంవత్సరం
బ్లాగునామ సంవత్సరం
ఈ బ్లాగును ఇంకా ఎవరు చదువుతున్నారో, ఎందుకు చదువుతున్నారో తెలీదుగానీ– నాకైతే ఈ బ్లాగు మీద ఆసక్తిలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. నేను కూడా ‘అందరిలాగే’ ఎఫ్బీ వైపు మళ్లినప్పటికీ, ఏదైనా వెనక్కి తిరిగి చదువుకోవాలంటే అక్కడ కష్టం; స్క్రోలింగ్ చేస్తూనే పోవాలి. మనం రాసినవి కొంత పద్ధతిగా కూర్చుకునే వీలు బ్లాగులోనే ఉంటుంది. ఇది కూడా కొత్తగా నా ఆసక్తి మళ్లీ పెరగడానికి కారణం.
ఈ బ్లాగును 2007లో మొదలుపెట్టాను. కొన్ని సంవత్సరాలు ఎక్కువే పోస్టులు పెట్టాను. ఆరు సంవత్సరాల్లో 30, అంతకుమించి పోస్టులున్నాయి. 2014లో అత్యధికం(38). ప్రారంభ సంవత్సరం వదిలేస్తే, నాలుగేళ్లలో పది, అంతకుతక్కువ పోస్టులున్నాయి. 2020లో అత్యల్పం (4). బాగా పోస్టులు ఉన్న సంవత్సరాల్లో కూడా, నెలల వారీగా చూస్తే కొన్ని నెలల్లో ఏమీలేవు. ఈ ఒక్క 2023లో మాత్రమే ప్రతి నెలా ఏదో ఒకటి పోస్టు చేస్తూ వచ్చానని గమనించాను. అందుకే ఇదొక అదనపు పోస్టు. ఎఫ్బీలోవి కొన్ని రీపోస్టు చేసినప్పటికీ, అత్యధిక పోస్టులు(45+) కూడా ఈ సంవత్సరమే అవుతున్నాయి. అందుకే ఇది బ్లాగునామ సంవత్సరం.
Wednesday, November 22, 2023
ఉండకూడని స్పేస్
Monday, November 13, 2023
ఒక మీమ్...
Wednesday, February 24, 2016
వీడియో: ఒక బాటసారి బైరాగి పదాలు
https://www.youtube.com/watch?v=SjdU70Ieg1A
https://www.youtube.com/watch?v=1byCHpP590w
Sunday, January 31, 2016
ఒక బాటసారి బైరాగి పదాలు
రాయడం అంతకు పదేళ్లముందే మొదలుపెట్టినా, 2008 నుంచి 2015 వరకు ఈ ఎనిమిదేళ్లలో మూడు పుస్తకాలు ప్రచురించాను. మధుపం, పలక-పెన్సిల్, రియాలిటీ చెక్. ఇంకా పుస్తకాలుగా రానివి ఆజన్మం కాలమ్, ఆ తర్వాతి రాతలు... అలాగే, నా కథలు. వీటన్నింటి గురించి మిత్రుడు, విమర్శకుడు కాకుమాని శ్రీనివాసరావు ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 5:30కు దోమలగూడలోని ఇందిరా పార్క్ దగ్గరి హైదరాబాద్ స్టడీ సర్కిల్లో మాట్లాడుతారు. ఆ రాతల్ని బట్టి, తన ప్రసంగానికి కాకుమాని ఎంచుకున్న శీర్షిక 'ఒక బాటసారి బైరాగి పదాలు'. ఈ కార్యక్రమ నిర్వహణ ఛాయ మిత్రులు.
వచ్చే ఆదివారం జరగనున్న ఈ కార్యక్రమానికి హైదరాబాదులో ఉన్న మిత్రులు ఎవరైనా వీలు చేసుకుని వస్తే సంతోషిస్తాను.
Friday, September 27, 2013
కామెంటుకు ఎలా స్పందించాలి?
అసలు, ఒక పోస్టు పెడుతున్నానంటే అది నేను నావైపు నుంచి జరుపుతున్న సంభాషణ కదా! ఎవరైనా ఒక కామెంటు రూపంలో రెస్పాండు అవుతున్నారంటే, అది నా సంభాషణకు జవాబు. దానికి కచ్చితమైన విలువ ఉంది. మరలాంటప్పుడు నేను ఉత్తినే ఏ విలువా చెయ్యని అదనపు మాట ఎందుకు మాట్లాడాలి!
Wednesday, September 5, 2012
మిత్రుడి మొదటి పుస్తకం
Friday, February 17, 2012
మళ్లీ టైప్ చేసే పని తప్పింది!
అయితే, కొన్ని రోజులుగా బ్లాగులో లైట్ బాక్స్ అని వస్తోంది. ఇమేజెస్ థంబ్ నెయిల్స్ లాగా వరుసగా డిస్ ప్లే అవుతాయి. అక్షరాలు మసగ్గా ఉంటాయి.
దానికి కంట్రోల్ ప్లస్ ప్లస్ అని జూమ్ చేసుకోవడమో, లేకపోతే ఇమేజ్-ను డెస్క్ టాప్ మీద కాపీ చేసుకుని చూడాల్సి రావడమో పరిష్కారంగా ఉండింది. అది కొంత అసౌకర్యం. దానివల్ల మిత్రులు చాలామంది ఇబ్బంది పడేవుంటారు. దాన్ని తొలగించేందుకు, మళ్లీ ఇవన్నీ రీ కంపోజ్ చేసి ఎలా పెట్టాలి, అనుకున్నా.
అయితే, బ్లాగు మిత్రురాలి సలహా (తను ఇంకెవరినో సలహా అడిగిందట) మేరకు ఆ లైట్ బాక్స్ ఇమేజెస్-ను డిజేబుల్ చేసేశాను. ఇప్పుడు ఇమేజెస్ రూపంలో ఉన్నది ఈజీగా చదువుకోవచ్చు.
చాలా ఈజీ పరిష్కారం ఇన్ని రోజులు తెలియనందుకు బాధ పడుతూనే, ఇప్పటికైనా తెలిసినందుకు ఆనందపడుతూ, ఇంకెవరికైనా పనికొస్తుందేమోనని ఈ లింకు దిగువన ఇస్తున్నా.
http://googlesystem.blogspot.in/2011/10/how-to-disable-bloggers-lightbox.html
Monday, February 13, 2012
50 మంది బ్లాగు మిత్రులు
మిత్రులుగా చేరడానికి పెట్టిన ఆహ్వానాన్ని స్వీకరించి ఇప్పటికి యాభై మంది మిత్రులుగా చేరారు.
ఇందులో నాకు ముఖపరిచయం ఉన్నవాళ్లు కేవలం నలుగురే. అంటే భౌతికంగా వాళ్ల ముఖం నేనూ, నా ముఖం వాళ్లూ చూసుకున్నవాళ్లం. ముఖ పరిచయం లేకపోయినా, అరే, నేనింకా వీళ్లను ఇప్పటిదాకా చూడలేదా... అనుకునేంత పరిచయం అయినవాళ్లు మరి ఆరేడుగురు. ఇంకా కొందరి తాలూకు పరిచయాలకు పూర్ణ రూపం రాకపోయినా, ఒక సంకేతమేదో వాళ్లను తలుచుకున్నప్పుడు నా మనసులో మెదులుతూ ఉంటుంది. మరికొందరు పూర్తి గుప్తంగా ఉండిపోయినవాళ్లు. అంటే వాళ్ల తాలూకు ఏ ఊహకీ అవకాశం ఇవ్వకుండా, బహుశా మౌనంగా నన్ను గమనిస్తున్నవాళ్లు.
ఎవరెవరు ఎక్కడెక్కడ, ఏయే పనుల్లో, ఏయే రాష్ట్రాల్లో, ఏయే దేశాల్లో ఉన్నారో... మీ అందరినీ ఒకసారి నేను పేరుపేరునా తలుచుకుంటున్నానని చెప్పడానికే ఈ పోస్టు.
అరవిందాచారి
సుధాకర్ శివరాత్రి
వాసు
బాలు
నాగ్
రమేష్
మూన్
సంతోష్ కుమార్
శాండీ
దాస్
అఫ్సర్
గీతిక
సాయి మహేశ్ రెడ్డి
రాజు
శివకాశి
విజయ మైమూన్
స్కైబాబా
ఎన్.రావు
హెచ్చార్కె
గురు
అక్షర
రమ
అంజిరెడ్డి ధర్మ
సుభాషిణి పోరెడ్డి
చక్రి
వై వనజ
బాలు-2
సూర్య
రామ్
అజయ్ త్రిపాఠి
అండెం లింగారెడ్డి
పాండురంగాచారి
మధురవాణి
అశోక్
తన్నీరు శశి
రవి మూత
బృహస్పతి
వినయ్
రఘు
పైడినాయుడు గవిడి
జ్వాల
ఎందుకో ఏమో
జోయెల్
కవి యాకూబ్
ఎం.సుధాకర్రెడ్డి
సతీష్ కుమార్
శరత్
అజయ్ గౌడ్
పవన్
విష్ణు కానుమతిరెడ్డి
Monday, October 31, 2011
నిజంగానే వీళ్లు నా బ్లాగ్ చూస్తున్నారా?
ఓహో... ఈ కౌంటింగ్ ఫెసిలిటీ ఉందని నేను గుర్తించాక, నా రీడర్స్ కౌంటర్ తీసేశాను. ఇంకెందుకు?
అయితే, ఇక్కడో నాకో పిచ్చిలాంటిది తగులుకుంది. ఏయే దేశాలవాళ్లు నా బ్లాగు చదువుతున్నారని?
సహజంగా అందులో ఇండియావాళ్లు ఉంటారు. అమెరికా వాళ్లు కూడా ఉంటారు. ఆస్ట్రేలియా వరకు ఓకే అనుకుందాం. ఏ యూకేలోనో, సౌదీ అరేబియాలోనో కూడా మన తెలుగువాళ్లు ఉంటారంటే నమ్ముదాం
ఇప్పుడు ఈ కింది దేశాల జాబితా చూడండి.
ఇవి నేను కొన్ని వారాలుగా సేకరిస్తున్న పేర్లు. నిజంగా ఇన్ని దేశాల్లో మన తెలుగువాళ్లున్నారా? లేకపోతే ఈ క్లిక్స్ నమోదు కావడానికి ఇంకేమైనా మార్గాలుంటాయా?
లేకపోతే ఏమిటి? అర్జెంటినానుంచి చదవడమా? స్వీడన్ నుంచి చదవడమా?
గ్రీస్, నైజీరియా, కొలంబియా, స్విట్జర్లాండ్, ఖతార్, డెన్మార్క్... ఈయా దేశాల్లో తెలుగువాళ్లు ఉండటమే ఒకెత్తయితే, అందరూ మన బ్లాగు చూడాలని లేదుకదా. ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది.
Angola
Argentina
Australia
Bahrain
Bangladesh
Barbados
Belarus
Belgium
Bulgaria
Brazil
Cambodia
Canada
Chile
China
Colombia
Congo
Côte d’Ivoire
Czech Republic
Denmark
Ecuador
Egypt
El Salvador
Finland
France
Germany
Ghana
Greece
Hong kong
India
Indonesia
Iraq
Ireland
Israel
Italy
Japan
Kuwait
Latvia
Malaysia
Mexico
Moldova
Nepal
Netherlands
Nicaragua
Nigeria
Norway
New Zealand
Oman
Philippines
Poland
Qatar
Russia
Saudi Arabia
Singapore
Slovakia
South Korea
Sweden
Switzerland
Taiwan
Tanzania
Thailand
Ukraine
United Arab Emirates
United Kingdom
United States of America
Venezuela
Vietnam
Monday, September 13, 2010
పదివేల ఒక పరుగు
అయినా నాలుగు మాటలు పంచుకుంటాను.
అక్టోబర్ 13, 2007లో నేను తొలిసారిగా ఒక(అంటే ఇదే) బ్లాగు క్రియేట్ చేశాను. అయితే బ్లాగును క్రియేట్ చేయడం కోసం దాన్ని క్రియేట్ చేయలేదు. ఈనాడు ఆదివారం అనుబంధం కోసం బ్లాగుల గురించి ఒక కవర్ స్టోరీ రాయాల్సి వచ్చింది. అసలు బ్లాగు అంటే ఏమిటో, ఎలా చేయాలో తెలియకుండా రాయడమేంటని అనుకుని తెలుసుకోవడానికి మొదటిసారి బ్లాగు రాశాను. దాన్ని మసనోబు ఫుకుఓకాకు అంకితం చేస్తూ ఆయన గురించి రెండే మాటలు రాశాను, నాకు వచ్చీరాని ఇంగ్లీషులో. కవర్ స్టోరీ "బి అంటే బ్లాగు' రాసేశాక, ఇంకంతే! దాన్ని అలాగే వదిలేశాను.
మళ్లీ "సాక్షి'లోకి వచ్చాక, ఓహో, ఈ బ్లాగును నేను కంటిన్యూ చేయొచ్చు అనిపించింది. కాని అప్పటికి కూడా నాకు నిజంగా బ్లాగును ఎలా మెయింటెయిన్ చేయాలో తెలియదు. అందుకే కుప్పలుతెప్పలుగా రెండు మూడురోజుల్లోనే నా పాత పేపర్ కటింగులన్నింటినీ ఇందులో నింపేశాను. నాకు సంబంధించిన ముఖ్యమైనవన్నీ ఒకేచోట ఉండాలి, అనుకుని అలా చేశాను.
బ్లాగు స్టార్టు చేసిన ఎప్పటికో నేను కూడా "కూడలి'లో చేరొచ్చని అనిపించింది(కొన్ని తెలిసినవి కూడా తెలియనట్టే ఉంటాయి. అంటే స్ట్రయిక్ అవడం అంటారే అలాంటిది). అప్పుడు నేను దాని ఎడిటర్ గారికి ఈమెయిల్ రాస్తే, మీవన్నీ పిక్చర్ మెసేజెస్, పైగా ఇంగ్లీషు టైటిల్స్ ఉన్నాయి, కనీసం శీర్షికలనైనా తెలుగులోకి మార్చండి, కనీసం ఇకనుంచి పెట్టేవైనా అన్నారు. అలాగేనన్నాను.
లేఖినితో తిప్పలు పడుతూ చాలావరకు శీర్షికలు మార్చాను(ఇంకా ఈజీగా తెలుగులో రాయువిధము ఈమధ్యే తెలుసుకున్నాను).
మళ్లీ-
నేను అరుదుగా వేరే వాళ్ల బ్లాగులు చూస్తుంటాను. ఎప్పుడైనా చూస్తే వాళ్లు ఈ మధ్యే స్టార్ట్ చేసినట్టు ఆర్కైవ్స్-ను బట్టి అర్థమవుతూ ఉంటుంది. కాని ఒక్కొక్కరికి ఇరవై ముప్పయి మంది ఫాలోవర్సు ఉంటారు. అరే, నిజానికి నేను చాలా సీనియర్నే వీళ్లతో పోల్చితే అనుకుంటాను. తర్వాత్తర్వాత అర్థమైంది ఏమిటంటే, నేనేదే ఇందులో పోస్టు పడేసి వదిలేశాను తప్ప, ఈ నెట్వర్స్క్-లో చేరలేదు. మరి మన బ్లాగు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? అప్పటికి మేల్కొని ఆ మధ్య హారంలో, నిన్న మొన్న జల్లెడలో సభ్యుడనైతి.
ఇందుమూలంగా చెప్పబోయేదేమిటంటే, నా లొల్లిని వీలైనంత ఎక్కుమంది దగ్గరకు చేర్చే మార్గాలను నేను చాలా చాలా ఆలస్యంగా తెలుసుకున్నానూ, అని. నాకంటే ఆలస్యంగా బ్లాగింగ్ స్టార్ట్ చేసినవాళ్లు నాకంటే ముందే ఇవన్నీ తెలుసుకునేశారని కుల్లుగా ఉందీ, అని.
ఇంకా ఇంకా చెప్పబోయేదేమిటంటే- నాకు ఇప్పటికీ బ్లాగు గురించిన పూర్తి అవగాహన రాలేదూ, అని. బ్లాగు గురువుల సహకారంతో కొద్దికొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానూ, అని.
చివరిమాట.
2009 గాంధీజయంతి రోజు గణాంక కౌంటర్ పెట్టాను. ఈ పదివేల హిట్స్ ఎప్పుడయితే అప్పడు ఈ కడుపుబ్బు తీర్చుకోవచ్చు కదాని ఎదురుచూస్తున్నాను. ఇవ్వాళ వచ్చి ఓపెన్ చేయగానే పదివేల ఒకటి కనబడింది. పదివేల హిట్ మరి ఎవరిదో! వారి కీబోర్డుకు నా ముద్దులు.
-పూడూరి రాజిరెడ్డి.







