Wednesday, December 29, 2010

అతడు ఇలా అన్నాడు

Just because I'm so horribly conditioned to accept everybody else's views, and just because I like applause and people to rave about me, doesn't make it right. I'm ashamed of it. I'm sick of it. I'm sick of it not having the courage to be an absolute nobody. I'm sick of myself and everybody else that wants to make some kind of a splash.
- J D Salinger


ఈ మాటలతో శాలింజర్ నా ఆత్మబంధువైపోయాడు.
ఇలాంటి రచయితను నేను చాలా చాలా ఆలస్యంగా చదివాను. ఇంకా చెప్పాలంటే, ఆయన పోయినప్పుడే ఆయన ఉన్నట్టు తెలిసింది. పూర్ రాజి!

Monday, December 27, 2010

ఆమె ఇలా అంది

You meet a woman who's clumsy and doesn't read, and because of that it won't work. But then you meet a woman who's clumsy and won't read, but she's just right for you. The two can have the same failures, but some ineffable alchemy allows you to forgive the right one anything.

- mary-louise-parker


ఇక నుంచీ ఈ బ్లాగులో ఈ మధ్యో, అప్పుడెప్పుడో చదివిన మంచి వాక్యాలనో, మొత్తం ఐటం నో పోస్టు చేద్దామని అనుకుంటున్నా.
ఇది esquire లో చదివాను.

Monday, November 15, 2010

అ ఆ ఇ ఈ



బాలల దినోత్సవ ఫన్డే సంచిక కోసం రాసిన చిన్న రైటప్ ఇది.

Wednesday, November 3, 2010

ఒక ప్రశంస



ఈమధ్య ఇక్కడ అన్నీ సొంత డబ్బాలనే పోస్టు చేస్తున్నానని నాకు నేనే చింతిస్తున్నట్టుగా నటిస్తూ...

ఈభూమి మ్యాగజైన్ నవంబరు సంచికలో వచ్చిన వ్యాసం ఇది.
కమలాకర్ గారికీ, పొనుగోటి గారికీ ధన్యవాదాలు.

ఓల్డ్ వైన్: వికీ అన్నింటి'కీ'!





కన్ఫెషన్: "అరే, ఇది కూడా మీరే రాశారా?" అనిపించుకోవాలని నాకు లేదనలేను.

నేను రాసిన ప్రతిదీ ఈ బ్లాగులో లేకపోయినా, ఈ వ్యాసం ఇక్కడ ఉండదగినదే అనుకుంటున్నాను.
జర్నలిజంలోకి వచ్చాక, ఏదైనా సందేహం వస్తే, నెట్-ను ఆశ్రయించేవాడిని. గూగుల్ వాడు ప్రతిసారీ దీన్ని నా ముందుకు జరిపేవాడు. దీన్ని తడిమితే చాలా విషయాలు తెలిసేవి(లుస్తున్నాయి). అరే, ఇది ఒక అద్భుతమైన సోర్సు, అని నాకు నేనే యురేకా అని అరుచుకున్నాను. నిజంగా ఇది నాకు మాత్రమే తెలిసిన రహస్యం అని కూడా కొంతకాలం భ్రమించాను, ప్రేమించాను. తర్వాత్తర్వాత తెలిసింది ఏమిటంటే, దీన్ని చాలామంది నాలాగే, నాకంటే ముందునుంచీ ప్రేమిస్తున్నారని. అయినాసరే, దీని మీద ఐటెమ్ రాయడం ద్వారా నేను మరింత విలువైన ప్రేమికుడినని రుజువు చేసుకున్నాననుకుంటాను.
ఇది 5 నవంబరు 2006 ఈనాడు ఆదివారం అనుబంధం కోసం రాసిన కవర్ స్టోరీ.

Monday, October 25, 2010

ఈ నవ్వులరాట్నం మీరూ ఎక్కవచ్చు!



నిన్నటి-24 అక్టోబరు 2010- ఫన్డేలో కొత్తగా ప్రవేశపెట్టిన శీర్షిక ఇది. ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు.

Friday, October 22, 2010

బి అంటే బ్లాగు అను ఓ పూర్వపు పోస్టు

ఒక్కోసారి అద్దంలో మన ముఖం మనం చూసుకోవడం బాగుంటుంది.
అదేంటో... అరే, చిన్న గడ్డం చూడ్డానికి బాగుంది, కళ్లు కాంతివంతంగా ఉన్నాయి, ముక్కు ముచ్చటగా ఉంది... ఇలాంటి ఎన్నో అనిపిస్తుంటాయి. నాకు తెలుసు అద్దం పెద్ద అబద్ధాల కోరు అని. అయినా కొన్ని అందమైన అబద్ధాలు వినడానికీ అనుకోవడానికీ బాగుంటాయి కదా!
.. ఈ అప్రస్తుత ఇంట్రో అంతా ఎందుకంటే, ఊరికే నా బ్లాగు అనే అద్దాన్ని చూసుకుంటే, బి అంటే బ్లాగు అనే ఓ పాత కవర్ స్టోరీని చదువుతుంటే కొన్ని అక్షరాలు ముద్దొచ్చాయి. ఇప్పటి ప్రేయసి వేరైనా, టెన్తులో ప్రేమించిన అమ్మాయిని సీరియస్గానే ప్రేమించాం కదా!

Saturday, October 9, 2010

అఫ్సరీకుడి ఇంటర్వ్యూ

ఇక్కడ ఈ లింకును ఇవ్వడంలో పచ్చి స్వార్థం తప్ప ఇంకో కారణం లేదు.
నార్సిసిస్టుకు మంచి తెలుగు పదం ఏదైనా ఉంటే చెప్పరూ!

Monday, September 27, 2010

మధుపం రాజిరెడ్డి జెంటిల్మెన్ ఫీలింగ్స్



ఈ విలువైన సమీక్ష నిన్నటి(26 సెప్టెంబరు 2010) వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. సమీక్షించిన చింతపట్ల సుదర్శన్ గారికి ధన్యవాదాలు. ఈ పోస్టుకు పెట్టిన టైటిల్ సమీక్షకుడు ఒరిజినల్గా పెట్టుకున్నది.

వర్తమాన తెలుగు కథ: 'నవ్య' రివ్యూ



ఇది 22 సెప్టెంబరు 2010 నాటి నవ్య వార పత్రికలో ప్రచురితమైంది. సమీక్షకులు రామా చంద్రమౌళి గారు.

Friday, September 17, 2010

వర్తమాన తెలుగు కథ: వార్త సమీక్ష



ఇది 12 సెప్టెంబరు 2010 నాటి వార్త- ఆదివారం అనుబంధంలో వచ్చింది.

Monday, September 13, 2010

పదివేల ఒక పరుగు

ఈ పోస్టు పెట్టడమంటే ఓ విధంగా జాతినుద్దేశించి ప్రసంగించడం లాంటిది.
అయినా నాలుగు మాటలు పంచుకుంటాను.

అక్టోబర్ 13, 2007లో నేను తొలిసారిగా ఒక(అంటే ఇదే) బ్లాగు క్రియేట్ చేశాను. అయితే బ్లాగును క్రియేట్ చేయడం కోసం దాన్ని క్రియేట్ చేయలేదు. ఈనాడు ఆదివారం అనుబంధం కోసం బ్లాగుల గురించి ఒక కవర్ స్టోరీ రాయాల్సి వచ్చింది. అసలు బ్లాగు అంటే ఏమిటో, ఎలా చేయాలో తెలియకుండా రాయడమేంటని అనుకుని తెలుసుకోవడానికి మొదటిసారి బ్లాగు రాశాను. దాన్ని మసనోబు ఫుకుఓకాకు అంకితం చేస్తూ ఆయన గురించి రెండే మాటలు రాశాను, నాకు వచ్చీరాని ఇంగ్లీషులో. కవర్ స్టోరీ "బి అంటే బ్లాగు' రాసేశాక, ఇంకంతే! దాన్ని అలాగే వదిలేశాను.

మళ్లీ "సాక్షి'లోకి వచ్చాక, ఓహో, ఈ బ్లాగును నేను కంటిన్యూ చేయొచ్చు అనిపించింది. కాని అప్పటికి కూడా నాకు నిజంగా బ్లాగును ఎలా మెయింటెయిన్ చేయాలో తెలియదు. అందుకే కుప్పలుతెప్పలుగా రెండు మూడురోజుల్లోనే నా పాత పేపర్ కటింగులన్నింటినీ ఇందులో నింపేశాను. నాకు సంబంధించిన ముఖ్యమైనవన్నీ ఒకేచోట ఉండాలి, అనుకుని అలా చేశాను.

బ్లాగు స్టార్టు చేసిన ఎప్పటికో నేను కూడా "కూడలి'లో చేరొచ్చని అనిపించింది(కొన్ని తెలిసినవి కూడా తెలియనట్టే ఉంటాయి. అంటే స్ట్రయిక్ అవడం అంటారే అలాంటిది). అప్పుడు నేను దాని ఎడిటర్ గారికి ఈమెయిల్ రాస్తే, మీవన్నీ పిక్చర్ మెసేజెస్, పైగా ఇంగ్లీషు టైటిల్స్ ఉన్నాయి, కనీసం శీర్షికలనైనా తెలుగులోకి మార్చండి, కనీసం ఇకనుంచి పెట్టేవైనా అన్నారు. అలాగేనన్నాను.
లేఖినితో తిప్పలు పడుతూ చాలావరకు శీర్షికలు మార్చాను(ఇంకా ఈజీగా తెలుగులో రాయువిధము ఈమధ్యే తెలుసుకున్నాను).

మళ్లీ-
నేను అరుదుగా వేరే వాళ్ల బ్లాగులు చూస్తుంటాను. ఎప్పుడైనా చూస్తే వాళ్లు ఈ మధ్యే స్టార్ట్ చేసినట్టు ఆర్కైవ్స్-ను బట్టి అర్థమవుతూ ఉంటుంది. కాని ఒక్కొక్కరికి ఇరవై ముప్పయి మంది ఫాలోవర్సు ఉంటారు. అరే, నిజానికి నేను చాలా సీనియర్నే వీళ్లతో పోల్చితే అనుకుంటాను. తర్వాత్తర్వాత అర్థమైంది ఏమిటంటే, నేనేదే ఇందులో పోస్టు పడేసి వదిలేశాను తప్ప, ఈ నెట్వర్స్క్-లో చేరలేదు. మరి మన బ్లాగు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? అప్పటికి మేల్కొని ఆ మధ్య హారంలో, నిన్న మొన్న జల్లెడలో సభ్యుడనైతి.

ఇందుమూలంగా చెప్పబోయేదేమిటంటే, నా లొల్లిని వీలైనంత ఎక్కుమంది దగ్గరకు చేర్చే మార్గాలను నేను చాలా చాలా ఆలస్యంగా తెలుసుకున్నానూ, అని. నాకంటే ఆలస్యంగా బ్లాగింగ్ స్టార్ట్ చేసినవాళ్లు నాకంటే ముందే ఇవన్నీ తెలుసుకునేశారని కుల్లుగా ఉందీ, అని.
ఇంకా ఇంకా చెప్పబోయేదేమిటంటే- నాకు ఇప్పటికీ బ్లాగు గురించిన పూర్తి అవగాహన రాలేదూ, అని. బ్లాగు గురువుల సహకారంతో కొద్దికొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానూ, అని.

చివరిమాట.
2009 గాంధీజయంతి రోజు గణాంక కౌంటర్ పెట్టాను. ఈ పదివేల హిట్స్ ఎప్పుడయితే అప్పడు ఈ కడుపుబ్బు తీర్చుకోవచ్చు కదాని ఎదురుచూస్తున్నాను. ఇవ్వాళ వచ్చి ఓపెన్ చేయగానే పదివేల ఒకటి కనబడింది. పదివేల హిట్ మరి ఎవరిదో! వారి కీబోర్డుకు నా ముద్దులు.

-పూడూరి రాజిరెడ్డి.

Friday, August 27, 2010

హిందూ రిపోర్ట్: బెస్ట్ ఆఫ్ ద బెస్ట్



వీటిని ఎలా పోస్టు చేసినా, స్వోత్కర్షగానే కనబడతాయి. కానీ మనకు ఉన్నవి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదా! కాబట్టి మీరు భరించకతప్పదు. లేదా సింప్లీ స్కిప్ ఇట్. ఇది ఇవ్వాళ్టి హిందూ(27-8-10)లోని ఫ్రైడే రివ్యూలో వచ్చింది.

Monday, August 23, 2010

వర్తమాన తెలుగు కథ-2009



2009లో వచ్చిన ఉత్తమ కథలను తిరుపతికి చెందిన అభినవ ప్రచురణలు సంపాదకుడు సాకం నాగరాజ సంకలనం చేశారు. ఈ తరహాలో వారి నుంచి ఇది తొలి ప్రయత్నం. ఇందులో నా కథ చింతకింది మల్లయ్య ముచ్చట కూడా చోటు చేసుకుంది. దీనికోసం నేను మొట్టమొదటిసారిగా తిరుపతికి వెళ్లాల్సివచ్చింది. రెండ్రోజులు జీవితాన్ని మరింతగా విస్తరించుకున్నట్టు అనిపించింది. ఒకట్రెండు క్వాలిటీ పరిచయాలు జరిగాయి.
ఫొటో రైటప్... ఎడమనుంచి వరుసగా: మహమ్మద్ ఖదీర్ బాబు, దగ్గుమాటి పద్మాకర్, బి.చంద్రశేఖర్, వేంపల్లి షరీఫ్, పూడూరి రాజిరెడ్డి, సాకం నాగరాజ, తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి, బి.వినోదిని.

యండమూరి వీరేంద్రనాథ్-తో స్పెషల్ ఇంటర్వ్యూ





యండమూరితో సంభాషించినదాన్లోంచి పేజీ పరిమితుల వల్ల పాతిక శాతమైనా ఎడిట్ చేయాల్సి వచ్చింది. అయినా క్రీమ్ ఏమీ మిస్ కాలేదు. ఈ ఐటెమ్-లో నేను ఈర్శ్య అని తప్పుగా రాశానని, దాన్ని ఈర్ష్య అని రాయాలని మిత్రుడు భాస్కర్ చెప్పాడు. అలాగే బాచి.

Wednesday, August 4, 2010

థాంక్స్ విహారి గారు!




మధుపం- మీద వచ్చిన విలువైన రివ్యూ ఇది. రాసింది విహారి గారు. ఇది జూలై 18న ఈవారం జనవార్త పత్రికలో అచ్చయింది. కాని నేను ఆలస్యంగా, అంటే ఇవ్వాళే చూశాను. దాన్నే ఇక్కడ రీ-ప్రొడ్యూస్ చేస్తున్నా.

Friday, July 23, 2010

అసలు లవ్ కెమిస్ట్రీ ఎలా కుదురుతుంది?

మనుషులు ఎందుకు ప్రేమించుకుంటారు?
ప్రేమలో నిండా మునిగినవారు కూడా దీనికి సమాధానం చెప్పలేకపోవచ్చు. దేవులపల్లి అంతటివాడే-

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా Hruదయంబు ప్రేమించు నిన్ను?

అన్నారు.

చూడకుండా నిమిషమైనా ఉండలేమన్నంతగా, దూరమైతే క్షణం కూడా బతకలేమన్నంతగా ఎదుటివారిలో ఏం నచ్చిందీ అని నిలదీసి అడిగితే, కారణాలు చెప్పడం ఎవరికైనా కష్టమే. ఇతరులకు కనబడని ప్రత్యేకమైందేదో మనకు మాత్రమే కనబడిందని కన్విన్స్ చేయడం కత్తిమీద సామే. అందుకే ప్రేమలో లాజిక్కులు, రీజనింగులు పనిచేయవు. ప్రేమ వెర్బా... నౌనా... అన్న పట్టింపులుండవు. అదో జరిగి తీరాల్సిన ప్రక్రియలా ప్రేమలో పడొచ్చు.

అయితే ప్రేమలో ఎందుకు పడతారు? అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు శరీరంలోని రసాయనాలు పెట్టే గిలిగింతలే కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. అపోజిట్ సెక్సుని చూసినప్పుడు చెమట పట్టడం, గొంతు తడారిపోవడం, ఎటూ తోచక పోవడం జరుగుతుంది. వీటినే లవ్ సింప్టమ్స్ అంటారు. శరీరంలో విడుదలయ్యే పెనీలిథాలమైన్ ఈ ప్రేమజబ్బుకు కారణం. ఇక ఇది ఆరంభమైందంటే చాలు...

ఆమె దగ్గర్లో కూర్చుంటే అటువైపు ముఖం తిప్పకుండా ఏ శక్తీ ఆపలేదు. అడ్రెనలిన్ ఉప్పెనలా ఎగజిమ్మి అటు చూసేట్టుగా బలవంతపెడుతుంది మరి! దీనితో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంకానికి తెరలేస్తుంది. అంటే మూగసైగలు... ఓరచూపులు... అన్నమాట! ఈ ప్రత్యేక భాష ఫెరోమైన్స్ వల్ల పుడుతుంది. చూడ్డంతోనే ఆగిపోతే లవ్ స్టోరీ ఏముంటుంది?

దగ్గరగా కూర్చోవాలనిపిస్తుంది. తాకాలనిపిస్తుంది. ఏదో మిషమీద పైన చేయి వేయాలనిపిస్తుంది. ఈ చిలిపి చేష్టలన్నింటికీ ఆక్సిటోసిన్-దే తప్పు. అమ్మాయి కలలోకొచ్చినా, అదోలా చూసినా, తను మన పరిసరాల్లోనే ఉందని తెలిసినా ఇది విడుదలైపోతుంది. అక్కడికి పరుగెత్తిస్తుంది.

గంటల తరబడి మాట్లాడటం, విషయం ఏం లేకపోయినా పడీపడీ నవ్వుకోవడం, ఎంతకీ చాలనిపించకపోవడం, ఎదుటివారు చెప్పింది చాలా గొప్ప విషయంగా తోచడం, ఆవలింత కూడా అందంగా కనబడటం... ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ఆ క్రెడిట్ తీసుకోవాల్సింది నోరెపైనేఫెరైన్. ఈ లక్షణాలు మరీ ఎక్కువ కనిపిస్తున్నాయంటే శుభలేఖలు అచ్చు వేయించాల్సిందే.

ఇక పెళ్లయిన కొత్తలో ఉక్కిరిబిక్కిరి చేసే విరహానికి కారణం డోపమైన్. ఆ హనీమూన్ కాస్తా అయిపోయిందంటే దీని విడుదల ఆగిపోతుంది. భాగస్వామిపై విపరీతమైన కాంక్షను కలిగించడంలో టెస్టోస్టిరాన్ కూడా ఏం తక్కువ తిన్లేదు.

ఇక ఒకరిని వదిలిపెట్టి మరొకరిని చూసుకోవాలనే ఉబలాటానికి బ్లేమ్ చేయాల్సింది వాసోప్రెస్సిన్ రసాయనాన్నే. ఇది మనలో చాలా తక్కువగా ఉంది. ఒకరిని ఒక్కరికే కట్టడి చేయగలిగే మహత్తర శక్తి ప్రపంచంలో దీనికే మాత్రమే ఉందిట!
అయితే బియ్యం పాతబడ్డకొద్దీ అన్నం ఎదిగివచ్చినట్టు కాలం గడుస్తున్నకొద్దీ అనుబంధం బలోపేతమవుతుంది. దీనికి ఎండార్ఫిన్స్ కీలకం. ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు తట్టుకోలేక ఏడ్చెయ్యడానికి కారణమివే!

...........................................
(అదీ సంగతి!)
(ఈ ఐటెమ్ నేను 2005లో ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రేమికుల రోజు కోసం రాసిన చిన్న బాక్స్. అప్పటి హెడ్డింగ్: లవ్ కెమిస్ట్రీ. మెయిన్ ఐటెమ్ నా కొలీగ్ స్వాతి(ప్రస్తుతం హిందూలో చేస్తోంది) రాసింది.)
(గతంలో ఇది ఈ బ్లాగులోనే ఇమేజ్ రూపంలో ఉండేది. దాన్ని తొలగించి ఇలా రీ-పోస్టు చేస్తున్నా.)

Tuesday, July 20, 2010

దొంగలు పడిన ఏడున్నర నెలలకు (రెండో ఆర్య గురించి... )



అప్పుడెప్పుడో(అంటే పైన చెప్పినట్టు ఏడున్నర నెలల కింద)రాసిందిది. తవ్వకాల్లో ఈరోజే బయటపడింది.
ఆర్య-2 గురించి ఇప్పుడు మాట్లాడటం అసందర్భమే కావొచ్చు. కానీ నేను రాసిన ప్రతిదాన్ని ఒక రికార్డుగా పెట్టడానికి కూడా ఇక్కడ పోస్టు చేస్తున్నా.
మై లవ్ ఈజ్ గాన్... రంజీత్ గొంతు ఇంకా చెవుల్లో ఉందబ్బా!

Monday, July 12, 2010

ఒక పగిలిన కల: 'కాలాచష్మా'

ఇది కొంచెం ఇబ్బందేనబ్బా!
"ఇది బాగుంది' అన్నామంటే, ఎంతయినా స్నేహితుడిది కదా, బాగాలేదని ఎలా చెబుతాడూ అనే అవకాశం ఉంది.
కాబట్టి మిత్రుడి వర్కుని జడ్జి చేయటం కష్టమే. నిజానికి, జడ్జ్ చేయడం కష్టం కాకపోవచ్చు, చేసిందాన్ని నిజంగానే బాగాచెప్పాడు అనిపించేట్టుగా ఎదుటివాళ్లను మెప్పించడం కష్టం.
నా మిత్రుడు క్రాంతి తీసిన కాలాచష్మా షార్ట్ ఫిలిం గురించి నాలుగు మాటలు చెబుదామనుకున్నప్పుడు ఎదురైన సమస్య ఇది.

మొన్న హైదరాబాద్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ జరగబోతోందని అనౌన్స్ మెంట్ రాగానే సాక్షి తరఫున పంపిన నాలుగు లఘుచిత్రాల్లో ఒకదానికి దర్శకత్వం వహించే అవకాశం క్రాంతికి వచ్చింది. సాక్షి టీవీ తొలి యానివర్సరీ సహా కొన్ని ప్రోమోస్ చేసిన ప్రొడ్యూసర్-గా తనకు అది సహజం కూడా.
అప్పట్నుంచి, స్టోరీ గురించి ఎక్సయిటింగుగా చర్చించడం, ఏ షాట్ ఏ యాంగిల్లో తీయబోతున్నాడో చెప్పడం, క్యాస్టింగ్ గురించి వెతకడం, ఎప్పుడో తెలిసిన వెంకన్నను తండ్రి పాత్రకు కరెక్టు అనుకోవడం, పిల్లాడి వేషం కోసం ఒకట్రెండు డిజప్పాయింటుమెంట్లు కావడం, లొకేషన్ బాగా దొరికిందని సంబరంగా చెప్పడం, డబ్బింగ్ చెప్పించడం, పోస్టర్లు వేయించడం... 'అన్నయ్యా, అనుకున్నట్టుగా వస్తోంది' అని మధ్యమధ్యలో ఉద్వేగంగా పంచుకోవడం... ప్రతి దశా నాకు తెలుసు.
కాగితం మీద ఉన్నప్పుడే నాకు సినిమా ఏంటో తెలుసు కాబట్టి, అంతా అయ్యి, నాకు ఎడిటింగ్ రూమ్-లో ప్రత్యేకంగా చూపిస్తే, నేనేమీ ఎక్సయిట్ అవ్వలేదు. ఇలాగే చేస్తాడని నాకు తెలుసు కదా!

పైన పెట్టిన టైటిల్ ఈ ఫిలింలోని పిల్లవాడు అలీకి, దర్శకుడు క్రాంతికీ ఇద్దరికీ వర్తిస్తుంది.
కళ్లద్దం పగులుతుంది. దానిలాగే ఈ కలా పగిలింది. ఏదీ? ఏదో విభాగంలోనైనా తనకు అవార్డు వస్తుందని క్రాంతి ఎదురుచూశాడు. వచ్చిన 285 ఎంట్రీల్లో స్క్రీనింగుకు సెలక్టు అయిన 50లో ఉండటం ఒక విజయమే, కాబట్టి, అవార్డు రాలేదని బాధపడటం అనవసరం అని ఓదార్చాల్సి వచ్చింది. అంత చిన్న పిల్లాడిలా తను బాధపడటం అవసరం లేదుగానీ, తన వర్కుని తాను అంతగా ప్రేమించాడు. అదీ సమస్య!
ఎంత ప్రేమించాడో ఈ లింకులో చూడొచ్చు.

దర్శకుడిగా మనకు ఏం తెలుసో, ఏం తెలియదో, తెలుసుకునే అవకాశాన్ని ఇలాంటి లఘుచిత్రాలు ఇస్తాయి. కాబట్టి, ఈ 'ఏడు నిమిషాలకు మించనిది' మొదటి రీలే. ఇంకా పదమూడు తీయాల్సి ఉంది మిత్రమా, సాగిపో!

Saturday, July 10, 2010

అనగనగా రాంగోపాల్ వర్మతో ఒక రోజు





సాధారణంగా పత్రికలో రాసేవాటికే తలాతోకా జోడించి, నేను బ్లాగులో పోస్టు చేస్తూ వస్తున్నా. ఇది మాత్రం ఎక్కడా అచ్చు కాలేదు. రాసి కూడా ఆరు నెలలు దాటింది. అయినా ఎందుకో అలాగే పెట్టేశాను. ఇప్పటికి దాన్ని బ్లాగు మిత్రులతో పంచుకోవాలని అనిపించింది. ఇక్కడ పోస్టు చేసేముందు నిజానికి ఒరిజినల్ ప్రతిలోంచి కొంతభాగం తొలగించాను. నా వ్యక్తిగత అభీష్టాలను(మరీ వ్యక్తిగతమైనవి)తెలియజేసే కొన్ని వాక్యాలు ఉండటమే దానికి కారణం.
అలాగే, దీన్ని ఆరు, ఏడు నెలల కిందిటి నా మానసిక స్థితిగానే చూడాలి.
ఒకవేళ ఈ ఆర్టికల్ కు కారణమైన...( రాంగోపాల్ వర్మ మీద నేను రాసిన) ఐటెమ్ చదవాలని అనుకునేవాళ్లు ఇక్కడ చదవొచ్చు.

Friday, July 9, 2010

నా చదువు ముచ్చట్లు అనబడే ఓ ఇంటర్వ్యూ.

అప్పుడెప్పుడో దుప్పల రవిగారు తన బ్లాగు కోసం కొన్ని ప్రశ్నలు పంపి జవాబు రాయమని అడిగారు. అది ఇంటర్వ్యూ అని కూడా చెప్పారు. స్కూలు పిల్లాడిలా బుద్ధిగా రాసిచ్చాను.
దాన్ని కూడా నా బ్లాగులో చెప్పవచ్చని నిన్నే ఆలోచన వచ్చింది. అందుకే ఈ దిగువ లింకు ఇస్తున్నాను.
అయితే, రవిగారు అందులో ఓ సస్పెన్సు ఏదో పెట్టారు. కాని అది ఇక్కడ బ్రేక్ అవుతోంది. నాకు ఇంతకంటే మార్గం లేదు కూడా.
ఇవీ నా చదువు ముచ్చట్లు.

తెలుగు దినపత్రికల లోకంలో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో “సాక్షి” రావడంతో ఇటు జర్నలిస్టుల, అటు నాన్-జర్నలిస్టుల జీవితాలు బాగుపడడం మొదట కనిపించిన మార్పు. ‘అవతలి కోణం’ ఇప్పుడు పాఠకులకు తెలియరావడం రెండో సంగతి. అంతర్జాతీయ స్థాయి జర్నలిజపు, పత్రికా మేకప్పూ తదితర హంగులు, రూపులూ మనకు కూడా తెలియడం మూడో ముచ్చట. వీటన్నింటిని పక్కనపెడితే వార్తలను, ఫీచర్లను కలగలిపేసిన తెలుగు పాత్రికేయాన్ని ఆ చెరనుంచి రక్షించ ప్రయత్నం చేస్తోంది సాక్షి”. అందుకు ఉదాహరణలుగా నిలుస్తున్న కలాలే ఖదీర్ బాబు, యాసీన్, యాకూబ్ పాషా, మాధవ్ శింగరాజు, మాధవీకళ, తదితరులు. ఈ కుర్ర హీరోల పేర్ల జాబితాలో నేను కావాలని వదిలేసిన పేరోదో మీరు చెప్పుకోండి. ప్రతి మాటలోనూ భావుకత, లాలిత్యం ఉట్టిపడేలా అక్షరాలను చెక్కే ఆ యువ రచయిత చదువు ముచ్చట్లు ఈ వారం మీకోసం… (పేరు ప్రశ్నజవాబుల కిందనుంది – ముందు జవాబులు చదివి తర్వాతే పేరు చూడండేం!)

1. మీకు బాగా బోర్ కొట్టించిన పుస్తకం, రచయిత ఎవరు? (ఎందుకు చదివానురా బాబూ అనిపించాలి)

కొన్ని బోర్ కొడుతూనే ఉంటాయి. ఆ పుస్తకం చదవడం నాకు లక్ష్యమైతే, భరించి చదువుతా. లేదంటే పక్కన పడేస్తా. కాబట్టి సరైన జవాబివ్వలేను.

2. ఇటీవల కొన్న పుస్తకం, చదవడం పూర్తి చేసిన పుస్తకమేది?

మరీ ముఖ్యం అనుకుంటే తప్ప పుస్తకం కొనట్లేదు. నా చేతికొచ్చినవి మాత్రం చదువుతాను. అయితే, ఇటీవల వైజాగ్ వెళ్లినప్పుడు భీమిలిలోని సౌరిస్ ఆశ్రమంలో కొన్ని పుస్తకాలు కొన్నా. చలం మిత్రులు, భగవాన్ పాదాలముందు, స్త్రీ, మహేంద్ర, సుధాచలం, చలం-భగవద్గీత. (ఒకేరోజు తీసుకున్నవి కాబట్టి ఒక్క పేరు చెప్పలేకపోతున్నా.) నిన్నే చదవడం పూర్తి చేసింది – ముళ్లపూడి ‘కోతి కొమ్మచ్చి’.

3. మీ లైబ్రరీలో మొత్తం ఎన్ని పుస్తకాలున్నాయి?

నా వ్యక్తిగత లైబ్రరీలో ఎన్ని ఉన్నాయో సరిగ్గా చెప్పలేను. చెత్తాపుత్తడీ కలిపి ఓ 300?

సారీ సారీ… ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నవీ – పుస్తకాకారంలో ఉండనివీ – మరో 100 – 150 అయినా ఉంటాయి.

4. చాలా రోజులుగా చదవాలనుకుంటూ చదవలేకపోతున్న పుస్తకాలు ఏమిటి?

అట్లాంటివి ఏమీ ఉన్నట్టు లేదు. ముందు జవాబులోని డౌన్ లోడెడ్ ‘బుక్స్’ చదవడానికి టైమ్ చాలక, చదవలేకపోతున్నా.

5. మీకు బాగా నచ్చిన రచయితలు ఎవరు? పుస్తకాల పేర్లు చెప్పండి.

బుచ్చిబాబు, చలం, గోపీచంద్, కుటుంబరావు, రావిశాస్త్రి, యండమూరి, టాల్ స్టాయ్…

అల్పజీవి, అసమర్థుని జీవయాత్ర, చదువు, చివరికి మిగిలేది, అన్నా కరేనినా, గడ్డిపరకతో విప్లవం, అంతర్ముఖం, గోదాన్, ఏడుతరాలు, గోపాత్రుడు, ఓల్గానుంచి గంగకు, రైలుబడి, పురూరవ, విరాట్

6. మీ స్నేహితులకు ఈ ఏడాది ఎన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు? మీరెన్ని పుచ్చుకున్నారు?

ఐదిచ్చాను. ఒక్కటి పుచ్చుకున్నాను. (నష్టమే!)

(ఒక జర్నలిస్టుగా వచ్చే కాంప్లిమెంటరీ కాపీలను ఇందులోంచి మినహాయించాను. దాని లెక్కలు వేరు కాబట్టి)

7. ఇపుడున్న పత్రికలలో మీరు నచ్చే పత్రిక ఏది? మెచ్చని పత్రిక ఏది?

నచ్చే పత్రిక ‘హిందూ’. హడావుడి చెయ్యదు. తనదైన మార్గంలో వెళ్లిపోతుంటుంది. నాకు పెద్దగా పత్రికలు చదివే అలవాటు లేదు. కాబట్టి, నచ్చని పత్రిక గురించి చెప్పలేను.

8. జనం ఎంతో సీనిచ్చినా, మీకంతగా నచ్చని రచన ఏది?

బోల్డు. చిల్లరదేవుళ్లు, హిమవర్ష. (ఆ(.. ఇప్పుడు గుర్తొస్తోంది. లాంగ్ బ్యాక్… చండీదాస్ ‘అనుక్షణికం’ చదవలేక, బోరుకొట్టి వదిలేశాను. నిజానికి బోరు కూడా కాదేమో! ఒకలాంటి ఏహ్యభావం.)

అయితే ఈ ప్రశ్నకు జవాబివ్వడం ఇలా కాదనుకుంటా. ఫరెగ్జాంపుల్ ‘కన్యాశుల్కం’. అది చదవడానికి బాగుంటుంది. కానీ తెలుగు సాహిత్యానికి అదో… అదంటే నాకు చీమ కుట్టినట్టయినా ఉండదు. మైదానం క్లాసిక్ అంటారు. నాకు దానితో విభేదాలున్నాయి.

ఈ నచ్చడం, నచ్చకపోవడం మీదే ఇంకొంచెం వివరణ ఇవ్వాలనిపిస్తోంది. చండీదాస్ వి నచ్చలేదని అన్నానా! కాని, ఇన్ని రోజులు గుర్తుంచుకున్నానంటేనే, వాటికి ఏదో ప్రత్యేకత ఉందనేమో! నేను తొమ్మిదో క్లాసులో ఉన్నప్పుడు ‘సమర్పణ’ అనే ఓ అనామక సినిమా చూశాను. అది చూశాక ఏమనుకున్నానంటే, ఇంతవరకూ నా జీవితంలో చూసిన అత్యంత చెత్త సినిమా ఇదేనని. కాని దాన్ని మరిచిపోలేదు. మేకింగ్ పరంగా, ఇతరత్రా ఏ కారణాలతో చూసినా అది నాణ్యమైన సినిమా ఏంకాదు. అయినా అది నన్ను హాంట్ చేస్తూనే ఉంది. ఆఖరికి దశాబ్దం తర్వాత – ఆ సినిమాలోని క్రూడ్ రియాలిటీని నేను అంగీకరించే మానసిక స్థితికి వచ్చాక ఆ సినిమాను, దాని దర్శకుడు లోక్ చందర్ (ఈ మ్మీద ఇంకెవరికైనా ఇలాంటి పేరున్న దర్శకుడు ఉన్నాడని తెలుసో లేదో!)ను గౌరవించడం మొదలుపెట్టాను.

9. ప్రస్తుతం చదువుతున్న పుస్తకమేమిటి?

ఇవ్వాళ పొద్దున మొదలుపెట్టింది – “మహేంద్ర”.

10. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకాలేవి?

గడ్డిపరకతో విప్లవం, అన్నా కరేనినా. (ఇవి రెండూ నిజానికి నన్ను ప్రత్యేకంగా ప్రభావితం చేసిన పుస్తకలు కాదు. నాలో ఉన్నఏన్నో అభిప్రాయాలను బలపరిచినవి. లేదూ ఇవన్నీ నావే అని నన్ను నాతోనే గుర్తించేలా చేసినవి).

Monday, May 10, 2010

జిడ్డు క్రిష్ణమూర్తి ఏం చెప్పాడంటే...


నేను అభిమానించే కొందరు వ్యక్తుల్లో జిడ్డు ఒకరు. ఆయన చెప్పింది అర్థమైనట్టూ కానట్టూ ఉంటుంది.
ఇది రాయడంలో నేను ఎంత సక్సెస్ అయ్యానో తెలియదు. బహుశ, నేను అర్థం చేసుకోగలిగింది రాశాను.
ఇది సాక్షి- ఫ్యామిలీ- నేను- కోసం రాసింది.

అమీనా: చిరు సమీక్ష


నేను తత్వవేత్త కాదు!



జిడ్డు కృష్ణమూర్తి మీద ఫండే కోసం నేను రాసిన నాలుగు మాటలు .
పుట్టిన రోజు ౧౧ మే అని గమనించండి.

Wednesday, May 5, 2010

నూరు పాటల లింకు

ఫండే ఎంపిక చేసిన 100 పాటలను ఇద్దరు పాఠక మిత్రులు సేకరించగలిగారు.
జయప్రకాశ రాజు గారు, తాడేపల్లి పతంజలి గారు.
రాజు గారు నాకు సీడి పంపారు. పతంజలి గారు లింకు పంపారు.
ఇక్కడ వాటిని వినొచ్చు.

http://www.mediafire.com/?sharekey=3ee2b8db2e2afeb161d4646c62b381cbfef36d771aad715e4df0d6082f1c2cd0

Monday, March 29, 2010

ఉత్తమ సినిమా- ఉత్తమ పాట- ఉత్తమ పుస్తకం









ఫండే రెండో వార్షికోత్సవం కోసం మేము చేసిన ప్రయత్నం ఇది. ౧౦౦ సినిమాలు, ౧౦౦ సినిమా పాటలు, ౧౦౦ తెలుగు పుస్తకాలను ఎంపిక చేయడం మామూలు సాహసం కాదు. అయినా ప్రయత్నం చేశాం. జాబితాలు ఇక్కడ ఇవ్వడం కుదరదు. కేవలం దానికి నేను రాసిన ముందుమాటను మాత్రమే ఇక్కడ పోస్ట్ చేస్తున్న.

Friday, March 12, 2010

మధుపం: రివ్యూ


ఇది పాలపిట్ట మాస పత్రిక ఫిబ్రవరి సంచికలో వచ్చింది. వంశీ కృష్ణ గారికి థాంక్స్

Monday, February 22, 2010

మీకు బోరు కొట్టొచ్చు!


మన పుస్తకం మీద రివ్యూ వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పాలా వద్దా?
చదవండహో అన్నట్టుగా ఉంటుంది. ఇబ్బందే. నాకు తెలుసు. కాని పర్సనల్ బ్లాగ్ అనే మిష మీద ఇక్కడ పెట్టేసుకుంటున్న. రికార్డు కోసం. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు.
ఇవి వరుసగా ప్రభ, జ్యోతి, వార్తల్లో వచ్చాయి.

థాంక్స్ : విహారి, పప్పు, సుధామ.

మన తెలుగు తల్లికి 'లీడర్' దండ!


మొన్నే మెహెర్ రాస్తే చదివాను, ఓ పుస్తకం చదివినప్పుడు ఆ రచయితతో ఫోన్ చేసి మాట్లాడాలి అనిపించాలత. సినిమా వరకైతే శేఖర్ను అలా పలకరించాలని అనిపిస్తుంది. అందుకే ఈ నాలుగు మాటలు.
శేఖర్ ఇస్ రైట్. రానా కోసమే లీడర్ పాత్ర పుట్టినట్టుంది. ఆందులో అతడు (ఒ)ఎదిగిపోయాడు. మా తెలుగు తల్లి ని వాడుకున్న తీరు చూస్తె మికీ స్త్రెంగ్థ్ ఏమిటో తెలుస్తుంది. వందేమాతరం... ఇది మన భారతం లో కూడా.
నిజం. శేఖర్ కొన్ని తప్పులు చేశాడు. కాని, 'రెండు కార్లు ఉన్టే చాలదా? ఇరవయ్ ఉండాలా?'
ఈ క్షణం క్షమించేస్తున్న.

Monday, February 15, 2010

ఆమె ఓ అర్థం కాని పదార్థమా?


నేను అనువాదాలు ఎప్పుడూ చేయలేదు. ఏడాది క్రితం సరదాగా- ఆందులో వున్నా విషయం అలాంటిది- చేసింది ప్రేమికుల రోజు వేసుకోవచ్చు అనిపించింది. ఇది ఫండే లో అచ్చయింది.

అయితే ఇది ఎక్కడ చదివానో ఆ పుస్తకం పేరు గుర్తులేదు. కాని లవ్ పోఎమ్స్ అలాంటి టైటిల్ ఏదో అనుకుంటా.

Monday, January 4, 2010

ఒక మగవాడి ఫీలింగ్స్: సాక్షి రివ్యూ


సాక్షి సాహిత్యం పేజి లో ఇది ఈరోజు- జనవరి నాలుగో తారీఖు- వచ్చింది.
థాంక్స్ టు కల్పనా రెంటాల.
ఇదే సమీక్ష ఎడిట్ చేయని వెర్షన్ ఇక్కడ చదవండి.


Saturday, January 2, 2010

ఒక మగవాడి గురించి ఇంకో మగవాడి ఫీలింగ్స్



అభిప్రాయాన్ని రాతలో చెప్పడం, తక్కువ మందికి ఉండే సుగుణం.
అలా చెబితే ఆర్టిస్టు (పెద్ద మాట వాడేసానా!) అనేవాడు చాలా సంతోషిస్తాడు.
పైగా అది 'రికార్డు' అవుతుంది.
నా మిత్రుడు ప్రకాష్ అదే పని చేశాడు. అతడికి థాంక్యూ.
నా మధుపం పుస్తకం మీద అతని రివ్యూ కింది లింకులో...
http://vinuvinipinchu.blogspot.com/
అన్నట్టూ ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది అని ఒకరిద్దరు అడిగారు. విజయవాడ వాళ్ళయితే అక్కడ బుక్ ఫెయిర్ జరుగుతోంది. జనవరి పదకొండు వరకు. పాలపిట్ట బుక్ స్టాల్ నంబరు ముప్ఫై తొమ్మిది. ఇంకా విశాలాంధ్ర, ప్రజాశక్తి మామూలే.