Monday, September 27, 2010

మధుపం రాజిరెడ్డి జెంటిల్మెన్ ఫీలింగ్స్



ఈ విలువైన సమీక్ష నిన్నటి(26 సెప్టెంబరు 2010) వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. సమీక్షించిన చింతపట్ల సుదర్శన్ గారికి ధన్యవాదాలు. ఈ పోస్టుకు పెట్టిన టైటిల్ సమీక్షకుడు ఒరిజినల్గా పెట్టుకున్నది.

వర్తమాన తెలుగు కథ: 'నవ్య' రివ్యూ



ఇది 22 సెప్టెంబరు 2010 నాటి నవ్య వార పత్రికలో ప్రచురితమైంది. సమీక్షకులు రామా చంద్రమౌళి గారు.

Friday, September 17, 2010

వర్తమాన తెలుగు కథ: వార్త సమీక్ష



ఇది 12 సెప్టెంబరు 2010 నాటి వార్త- ఆదివారం అనుబంధంలో వచ్చింది.

Monday, September 13, 2010

పదివేల ఒక పరుగు

ఈ పోస్టు పెట్టడమంటే ఓ విధంగా జాతినుద్దేశించి ప్రసంగించడం లాంటిది.
అయినా నాలుగు మాటలు పంచుకుంటాను.

అక్టోబర్ 13, 2007లో నేను తొలిసారిగా ఒక(అంటే ఇదే) బ్లాగు క్రియేట్ చేశాను. అయితే బ్లాగును క్రియేట్ చేయడం కోసం దాన్ని క్రియేట్ చేయలేదు. ఈనాడు ఆదివారం అనుబంధం కోసం బ్లాగుల గురించి ఒక కవర్ స్టోరీ రాయాల్సి వచ్చింది. అసలు బ్లాగు అంటే ఏమిటో, ఎలా చేయాలో తెలియకుండా రాయడమేంటని అనుకుని తెలుసుకోవడానికి మొదటిసారి బ్లాగు రాశాను. దాన్ని మసనోబు ఫుకుఓకాకు అంకితం చేస్తూ ఆయన గురించి రెండే మాటలు రాశాను, నాకు వచ్చీరాని ఇంగ్లీషులో. కవర్ స్టోరీ "బి అంటే బ్లాగు' రాసేశాక, ఇంకంతే! దాన్ని అలాగే వదిలేశాను.

మళ్లీ "సాక్షి'లోకి వచ్చాక, ఓహో, ఈ బ్లాగును నేను కంటిన్యూ చేయొచ్చు అనిపించింది. కాని అప్పటికి కూడా నాకు నిజంగా బ్లాగును ఎలా మెయింటెయిన్ చేయాలో తెలియదు. అందుకే కుప్పలుతెప్పలుగా రెండు మూడురోజుల్లోనే నా పాత పేపర్ కటింగులన్నింటినీ ఇందులో నింపేశాను. నాకు సంబంధించిన ముఖ్యమైనవన్నీ ఒకేచోట ఉండాలి, అనుకుని అలా చేశాను.

బ్లాగు స్టార్టు చేసిన ఎప్పటికో నేను కూడా "కూడలి'లో చేరొచ్చని అనిపించింది(కొన్ని తెలిసినవి కూడా తెలియనట్టే ఉంటాయి. అంటే స్ట్రయిక్ అవడం అంటారే అలాంటిది). అప్పుడు నేను దాని ఎడిటర్ గారికి ఈమెయిల్ రాస్తే, మీవన్నీ పిక్చర్ మెసేజెస్, పైగా ఇంగ్లీషు టైటిల్స్ ఉన్నాయి, కనీసం శీర్షికలనైనా తెలుగులోకి మార్చండి, కనీసం ఇకనుంచి పెట్టేవైనా అన్నారు. అలాగేనన్నాను.
లేఖినితో తిప్పలు పడుతూ చాలావరకు శీర్షికలు మార్చాను(ఇంకా ఈజీగా తెలుగులో రాయువిధము ఈమధ్యే తెలుసుకున్నాను).

మళ్లీ-
నేను అరుదుగా వేరే వాళ్ల బ్లాగులు చూస్తుంటాను. ఎప్పుడైనా చూస్తే వాళ్లు ఈ మధ్యే స్టార్ట్ చేసినట్టు ఆర్కైవ్స్-ను బట్టి అర్థమవుతూ ఉంటుంది. కాని ఒక్కొక్కరికి ఇరవై ముప్పయి మంది ఫాలోవర్సు ఉంటారు. అరే, నిజానికి నేను చాలా సీనియర్నే వీళ్లతో పోల్చితే అనుకుంటాను. తర్వాత్తర్వాత అర్థమైంది ఏమిటంటే, నేనేదే ఇందులో పోస్టు పడేసి వదిలేశాను తప్ప, ఈ నెట్వర్స్క్-లో చేరలేదు. మరి మన బ్లాగు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? అప్పటికి మేల్కొని ఆ మధ్య హారంలో, నిన్న మొన్న జల్లెడలో సభ్యుడనైతి.

ఇందుమూలంగా చెప్పబోయేదేమిటంటే, నా లొల్లిని వీలైనంత ఎక్కుమంది దగ్గరకు చేర్చే మార్గాలను నేను చాలా చాలా ఆలస్యంగా తెలుసుకున్నానూ, అని. నాకంటే ఆలస్యంగా బ్లాగింగ్ స్టార్ట్ చేసినవాళ్లు నాకంటే ముందే ఇవన్నీ తెలుసుకునేశారని కుల్లుగా ఉందీ, అని.
ఇంకా ఇంకా చెప్పబోయేదేమిటంటే- నాకు ఇప్పటికీ బ్లాగు గురించిన పూర్తి అవగాహన రాలేదూ, అని. బ్లాగు గురువుల సహకారంతో కొద్దికొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానూ, అని.

చివరిమాట.
2009 గాంధీజయంతి రోజు గణాంక కౌంటర్ పెట్టాను. ఈ పదివేల హిట్స్ ఎప్పుడయితే అప్పడు ఈ కడుపుబ్బు తీర్చుకోవచ్చు కదాని ఎదురుచూస్తున్నాను. ఇవ్వాళ వచ్చి ఓపెన్ చేయగానే పదివేల ఒకటి కనబడింది. పదివేల హిట్ మరి ఎవరిదో! వారి కీబోర్డుకు నా ముద్దులు.

-పూడూరి రాజిరెడ్డి.