సాధారణంగా నా బ్లాగులో కామెంట్లు తక్కువగానే వస్తాయి. ఆ వచ్చే కొన్నింటికైనా ఒక బ్లాగర్ ఎలా రెస్పాండ్ కావాలి? ఉత్తినే వరుసగా థాంక్యూలు చెప్పుకుంటూ వెళ్లిపోతే సరా! ఎందుకో, అది సరైన స్పందనగా నాకు అనిపించడం లేదు. అలాగని వదిలేస్తే, పట్టనట్టుగా ఉన్న భావాన్ని కలిగిస్తున్నానేమో, అని మరొకవైపు పీకుతుంటుంది. చెప్పాలంటే, ఒక్కోసారి థాంక్యూ కూడా సరైన రెస్పాన్సు కాబోదు. దానివల్ల కూడా మౌనం వహించాల్సి వస్తుంది. అందుకే ఇక నేను ఈ కంక్లూజన్-కు వచ్చాను.
అసలు, ఒక పోస్టు పెడుతున్నానంటే అది నేను నావైపు నుంచి జరుపుతున్న సంభాషణ కదా! ఎవరైనా ఒక కామెంటు రూపంలో రెస్పాండు అవుతున్నారంటే, అది నా సంభాషణకు జవాబు. దానికి కచ్చితమైన విలువ ఉంది. మరలాంటప్పుడు నేను ఉత్తినే ఏ విలువా చెయ్యని అదనపు మాట ఎందుకు మాట్లాడాలి!