Tuesday, January 29, 2013
Wednesday, September 5, 2012
మిత్రుడి మొదటి పుస్తకం
"అచ్చు వేస్తే బానేవుంటుంది కదా,'' అన్న ఆలోచన నుంచి-
"అచ్చు వేయకపోతేనేం?'' అన్న సంశయాన్ని దాటుకొని-
ఎట్టకేలకు తొలిసారిగా 'అచ్చు'లోకి వచ్చాడు ఆత్మీయుడు మాధవ్ శింగరాజు , 'అభౌతిక స్వరం' పుస్తకం ద్వారా.
ప్రచురించదగిన 'రాశీనక్షత్రాలు' ఉన్నప్పటికీ, 'నా గొప్పలకేంగానీ,'లే అన్నట్టుగా వాటిని అలా మౌనంగా వదిలేసి, ఇదిగో, గొప్పవాళ్ల గొంతును అంతే గొప్పగా వినిపిస్తున్నాడు. అలెన్కర్ నుంచి యూరీ గగారిన్ వరకు యాభై 'గ్రేట్ సోల్స్' ఆత్మను ఎంతో ఆత్మీయంగా, మంద్ర స్వరంలో గానం చేస్తున్నాడు. వచనం కవిత్వమైనప్పుడు పాడితేనే బాగుంటుంది కదా!
అభౌతిక స్వరం ఆవిష్కరణ మొన్నటి శుక్రవారం జరిగినప్పటి ఫొటో ఇది. ఇందులో వరుసగా (ఫొటోకు ఎడమ నుంచి) యాసీన్ గారు, మాధవన్న, రామకృష్ణారెడ్డి గారు, మురళి గారు, వేణు గారు, నేను.
పుస్తకం 'విశాలాంధ్ర'లో లభ్యం. లేదా, ఎస్.ఎల్.వసుంధర గారిని ఈ నంబరులో సంప్రదించవచ్చు. 98486 18166.
Monday, April 16, 2012
Friday, February 17, 2012
మళ్లీ టైప్ చేసే పని తప్పింది!
నేను కంపోజ్ చేసిపెట్టే ఐటెమ్స్ కంటే, ఇమేజెస్-గా ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటాను.
అయితే, కొన్ని రోజులుగా బ్లాగులో లైట్ బాక్స్ అని వస్తోంది. ఇమేజెస్ థంబ్ నెయిల్స్ లాగా వరుసగా డిస్ ప్లే అవుతాయి. అక్షరాలు మసగ్గా ఉంటాయి.
దానికి కంట్రోల్ ప్లస్ ప్లస్ అని జూమ్ చేసుకోవడమో, లేకపోతే ఇమేజ్-ను డెస్క్ టాప్ మీద కాపీ చేసుకుని చూడాల్సి రావడమో పరిష్కారంగా ఉండింది. అది కొంత అసౌకర్యం. దానివల్ల మిత్రులు చాలామంది ఇబ్బంది పడేవుంటారు. దాన్ని తొలగించేందుకు, మళ్లీ ఇవన్నీ రీ కంపోజ్ చేసి ఎలా పెట్టాలి, అనుకున్నా.
అయితే, బ్లాగు మిత్రురాలి సలహా (తను ఇంకెవరినో సలహా అడిగిందట) మేరకు ఆ లైట్ బాక్స్ ఇమేజెస్-ను డిజేబుల్ చేసేశాను. ఇప్పుడు ఇమేజెస్ రూపంలో ఉన్నది ఈజీగా చదువుకోవచ్చు.
చాలా ఈజీ పరిష్కారం ఇన్ని రోజులు తెలియనందుకు బాధ పడుతూనే, ఇప్పటికైనా తెలిసినందుకు ఆనందపడుతూ, ఇంకెవరికైనా పనికొస్తుందేమోనని ఈ లింకు దిగువన ఇస్తున్నా.
http://googlesystem.blogspot.in/2011/10/how-to-disable-bloggers-lightbox.html

Monday, February 13, 2012
Subscribe to:
Posts (Atom)