Wednesday, July 27, 2022

లేడీ కండక్టర్ల బస్సుల్లో ఒక రోజు



అదే పదివేలు
–––––––––

ఎఫ్బీలో పెట్టే పోస్టులు పెడుతూనే, ఇందులో ఎంతో కొంత మళ్లీ చదువుకునేట్టుగా ఉండేవాటిని బ్లాగులో కూడా పోస్టు చేస్తున్నాను. బ్లాగులోనైతే పద్ధతిగా వెతుక్కోవచ్చు. ఏదో లోకార్పణం చేసినట్టుగా పెడుతున్నాం గానీ, వీటిని ఎవరైనా చదువుతున్నారా అనే అనుమానం ఒకటి ఉంటుందిగా; ‘స్టాట్స్‌’లోకి వెళ్లి చూస్తే అత్యధికం అటూయిటూగా వంద దగ్గర ఊయలూగుతుంటాయి. ఏవో కొన్ని రెండు, మూడు వందల్లోకి పోతాయి. అరుదుగా నాలుగు, ఐదు, ఎనిమిది వందల దాకా పోయినవి కూడా ఉన్నాయి. అసలు ఈ పోస్టు రాయడానికి, ఈ లెక్కల వల్ల ఒకింత కంగారు పడటం కారణం. ఒకదానికి ‘9.8కె’ అని చూపించింది. ఇది నేను పెట్టిన పోస్టేనా, నా బ్లాగు ఏమైనా హాక్‌ అయిందా అని అనుమానం వచ్చింది. మళ్లీ మళ్లీ మార్చి చూస్తే, అది నిజమే. ఆ పోస్టు ఏమిటంటే, ‘లేడీ కండక్టర్ల బస్సుల్లో ఒకరోజు’. ఇది పెట్టినట్టే మర్చిపోయాను. ఎందుకంటే, 2011–13 ప్రాంతంలో రియాలిటీ చెక్‌ సీరీస్‌ రాశాక, 2013 డిసెంబరులో వాటిని గంపగుత్తగా బ్లాగులో గుమ్మరించేశాను. ఆ వెంటనే పుస్తకం రావడంతో వాటన్నింటినీ ‘డ్రాఫ్టు’లుగా మార్చేశాను. అందువల్ల అవి ఉన్న విషయం కూడా గుర్తులేదు. 

అయితే ఇప్పుడేంటి? పదివేల మంది చదవడం గొప్పా? ఏమో, ఒక వెబ్‌ మ్యాగజీన్‌ ఎడిటర్‌ ఓసారి నాతో అన్నాడు. బాగా చదివిందీ అనుకున్నదానికి వెయ్యి, రెండు వేల వ్యూస్‌ వస్తాయి; కాబట్టి, ఎక్కువమందికి రీచ్‌ కావడమే మన టార్గెట్‌ అయితే గనక, అది ఎంత తక్కువ సర్క్యులేషన్‌ ఉన్నదైనా సరే, ప్రింటే బెస్ట్‌ ఆప్షన్‌. అదింకా వెబ్‌ మ్యాగజీన్ల గురించి కదా చెప్పింది. కనీసం నలుగురి నోళ్లల్లో నానుతూ ఉంటాయవి. అట్లాంటిది ఒక ఇండిపెండెంట్‌ బ్లాగులో ఒక పోస్టును పదివేల మంది చదవడం ఒకింత కంగారు పెట్టింది. రీచ్‌ అవడానికి ఇంత పొటెన్షియల్‌ ఉందా అని సంతోషం కూడా వేసింది. ఈ శుభ సందర్భంగా ఆ డ్రాఫ్టును రీ–పోస్ట్‌ చేస్తున్నా. 

(ఎఫ్బీ కోసం రాద్దామని మొదలుపెట్టింది, బ్లాగు కోసం రాసినట్టుగా ముగిసింది.)
 
 

 

9 comments:

  1. థాంక్సండీ.

    ReplyDelete
  2. Anonymous25.2.12

    లేడి కండక్టర్ల తో వారి డైలీ లైఫ్ గురించి చక్కగా విశ్లేషణ చేసారు, ఇలాంటి రియల్ లైఫ్ ఆర్టికల్స్ ఇంకా ఎన్నో రాయాలండి. చాల మంచి ప్రయత్నం

    ReplyDelete
  3. బొమ్మలు చిన్నగా ఉన్నాయి. ఎన్‌లార్జ్ చేసి చదవాల్సి వస్తోంది.

    ReplyDelete
  4. @పాండురంగా చారి:
    చారీ గారూ థాంక్యూ.

    @ప్రవీణ్:
    ఒక్క జూమ్ సరిపోతుందండీ. అది ఈజీయే అనుకుంటాను.

    ReplyDelete
  5. ur articles are too good..and reflecting real life..

    nadi kuda chinna salahaa andi.... from the first page, give a link to next page..everytime coming back and selecting the next page is a bit difficult!

    ReplyDelete
  6. Anonymous27.7.22

    చాలా బాగుంది. 2008 నుంచి 2011వరకు నేను మూడేళ్లపాటు వనస్థలిపురం to మెహదీపట్నం రోజూ పోయేవాణ్ణి. దాన్ని గుర్తుచేశారు. - శ్రీనివాస మూర్తి

    ReplyDelete
  7. కిషోర్28.7.22

    చాలా బాగా వ్రాసారు అండి..మాకోసం మళ్లీ పంచుకున్నందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  8. Anonymous31.7.22

    మరోసారి ఈ విధంగా చదివే అవకాశం కలిగింది రాజన్నా.థాంక్యూనే.

    ReplyDelete