Our Film, Vellipovaali (WANT TO GO) is available with English Subtitles now.
‘వెళ్లిపోవాలి’కి సబ్‌టైటిల్స్ చేయడం అయ్యాక, సినిమా ఎలాంటి భావం కలిగిస్తుందా అని మ్యూట్‌లో పెట్టుకుని చూశాను. కొన్నిసార్లు మేము మరీ ఇంత లోతుగా మాట్లాడేశామా అనిపించింది. తెలుగులో మామూలు మాటలు కూడా ఆంగ్లంలో గంభీరంగా ధ్వనిస్తాయి. కొన్నిసార్లు సరదాగా ఉంది. కొన్నిసార్లు కండపోయిన ఎముకలా కూడా ఉంది. ఆ మాటల వేగానికి ఆ రాజీ తప్పదేమో. కానీ ఓ పది పన్నెండేళ్లుగా సబ్ టైటిల్స్ ఉన్నవే ఎక్కువ చూడటం అలవాటయ్యాక, మా సినిమాకు కూడా ఇవి పడటం ఆ చిట్టచివరి అలంకరణేదో పూర్తయినట్టుగా అనిపించింది. సబ్ టైటిల్స్ చేసిన మిత్రులందరూ ఎంత దగ్గరగా మా మాటలను తీసుకునివుంటారా అని తలుచుకుని సంతోషం కలిగింది.
మాటల్లో అంతగా తెలియదుగానీ నిశ్శబ్దంగా చూస్తే– టాల్‌స్టాయ్ కనబడ్డాడు. రష్యన్ అనువాద ప్రస్తావన వచ్చింది. ఫుకుఓకా వస్తాడు. లారీ బేకర్ వస్తాడు. నొరోవ్‌బాంజాద్ కనబడుతుంది. టాగూర్ ఉన్నాడు. రమణ మహర్షి ఉన్నాడు. ఇంక చలంను ఇంతగా తలుచుకున్నామా అనిపించింది. ఇప్పుడు ఇది పాన్ ఇండియా ఏం ఖర్మ, రియల్ వరల్డ్ సినిమా అయిపోయింది.
No comments:
Post a Comment