Tuesday, November 24, 2026

రియాలిటీ చెక్‌ రీప్రింట్‌



 

కథలు మినహా నేను రాసినవన్నీ కాలమ్స్‌గానే రాశాను. బహుశా నన్ను ఎక్కువ మందికి చేరువ చేసిన కాలమ్‌ రియాలిటీ చెక్‌. దీనికోసమే ఒక అభిమాన పాఠకురాలు పబ్లిషర్‌ అవతారం ఎత్తింది. చాలామంది సహృదయులు సమీక్షలు, స్పందనలు రాశారు. పుస్తకం మీద బెంగళూరులో ఒక రోజు చర్చ జరిగింది. ఆకాశవాణిలో కొన్ని వారాలపాటు చదవమని ఆహ్వానించారు. అట్లా నా పుస్తకాల్లో ఎక్కువ సెలబ్రేట్‌ అయింది రియాలిటీ చెక్‌. ఓ ఇరవై ఏళ్లుగా మీడియాలో ఉన్నాకూడా నన్ను నేను జర్నలిస్టు అనుకోవడానికి జంకుతాను. కానీ ఈ పుస్తకం జర్నలిస్టుగా నా ఐడెంటిటీ. హైదరాబాద్‌ కేంద్రంగా కొన్ని ప్రదేశాలు, సమూహాల జీవన గాథలు ఇవి. ఇప్పుడు దీన్ని అజూ పబ్లికేషన్స్‌ వాళ్లు రీప్రింట్‌ (2026 November) చేశారు. 


https://www.amazon.in/dp/9347114278



No comments:

Post a Comment