Wednesday, September 5, 2012

మిత్రుడి మొదటి పుస్తకం

"అచ్చు వేస్తే బానేవుంటుంది కదా,'' అన్న ఆలోచన నుంచి-
"అచ్చు వేయకపోతేనేం?'' అన్న సంశయాన్ని దాటుకొని-
ఎట్టకేలకు తొలిసారిగా 'అచ్చు'లోకి వచ్చాడు ఆత్మీయుడు మాధవ్ శింగరాజు , 'అభౌతిక స్వరం' పుస్తకం ద్వారా.

ప్రచురించదగిన 'రాశీనక్షత్రాలు' ఉన్నప్పటికీ, 'నా గొప్పలకేంగానీ,'లే అన్నట్టుగా వాటిని అలా మౌనంగా వదిలేసి,  ఇదిగో, గొప్పవాళ్ల గొంతును అంతే గొప్పగా వినిపిస్తున్నాడు. అలెన్కర్ నుంచి యూరీ గగారిన్ వరకు యాభై 'గ్రేట్ సోల్స్' ఆత్మను ఎంతో ఆత్మీయంగా, మంద్ర స్వరంలో గానం చేస్తున్నాడు. వచనం కవిత్వమైనప్పుడు పాడితేనే బాగుంటుంది కదా!

అభౌతిక స్వరం ఆవిష్కరణ మొన్నటి శుక్రవారం జరిగినప్పటి ఫొటో ఇది. ఇందులో వరుసగా (ఫొటోకు ఎడమ నుంచి) యాసీన్ గారు, మాధవన్న, రామకృష్ణారెడ్డి గారు, మురళి గారు, వేణు గారు, నేను.

పుస్తకం 'విశాలాంధ్ర'లో లభ్యం. లేదా, ఎస్.ఎల్.వసుంధర గారిని ఈ నంబరులో సంప్రదించవచ్చు. 98486 18166.