Saturday, January 28, 2012

శేఖర్ ఇలా అన్నారు

నేను సాధారణంగా బ్లాగులు ఎలా చదువుతానంటే,
నాదాంట్లో ఎవరో కామెంటు రాస్తారు, లేదంటే మిత్రులుగా చేరుతారు. వీళ్లెవరు?
నా మీద ఆసక్తి చూపించిన వీళ్లమీద ఇక నాకు ఆసక్తి మొదలవుతుంది.
అలా, వాళ్ల (ఉంటే) బ్లాగు, అందులో కామెంట్లు రాసినవాళ్లు, వాళ్లు మిత్రులుగా ఉన్న ఇతర బ్లాగులు... ఇలా పోతూ పోతూ ఎక్కడికో తేలుతాను. అలా నాకు కొన్ని చాలా చక్కటి బ్లాగులు పరిచయమయ్యాయి.
ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నానంటే... మొన్న ఇలా ఒక తోక వెంబడి, ఆ తోకతో మరో తోకలోకి ఇలా పోతూ పోతూ పోతే... ఒకచోట శేఖర్ కపూర్ బ్లాగు తగిలింది. ఆయన తన బ్లాగుకు రాసుకున్న పరిచయం వాక్యాలు అద్భుతంగా తోచాయి. వాటిని దిగువన ఇస్తున్నాను.
I exist because you imagine I do.

ఈ తర్వాతిది ఇంకా బాగుందనిపించింది.

Neither prejudiced by the past, nor in fear of the future.
The moment, only the moment.