నేను సాధారణంగా బ్లాగులు ఎలా చదువుతానంటే,
నాదాంట్లో ఎవరో కామెంటు రాస్తారు, లేదంటే మిత్రులుగా చేరుతారు. వీళ్లెవరు?
నా మీద ఆసక్తి చూపించిన వీళ్లమీద ఇక నాకు ఆసక్తి మొదలవుతుంది.
అలా, వాళ్ల (ఉంటే) బ్లాగు, అందులో కామెంట్లు రాసినవాళ్లు, వాళ్లు మిత్రులుగా ఉన్న ఇతర బ్లాగులు... ఇలా పోతూ పోతూ ఎక్కడికో తేలుతాను. అలా నాకు కొన్ని చాలా చక్కటి బ్లాగులు పరిచయమయ్యాయి.
ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నానంటే... మొన్న ఇలా ఒక తోక వెంబడి, ఆ తోకతో మరో తోకలోకి ఇలా పోతూ పోతూ పోతే... ఒకచోట శేఖర్ కపూర్ బ్లాగు తగిలింది. ఆయన తన బ్లాగుకు రాసుకున్న పరిచయం వాక్యాలు అద్భుతంగా తోచాయి. వాటిని దిగువన ఇస్తున్నాను.
I exist because you imagine I do.
ఈ తర్వాతిది ఇంకా బాగుందనిపించింది.
Neither prejudiced by the past, nor in fear of the future.
The moment, only the moment.
@@Neither prejudiced by the past, nor in fear of the future.The moment, only the moment.
ReplyDeleteBeautiful and realistic. అసలు నాలాంటి చాలా మందికి "హర్ ఏక్ పల్ చాలా గయా,హర్ ఏక్ పల్ కో ధూండ్ తా" అన్నదే నిరంతర జీవనరాగం. అలాంటప్పుడు ప్రస్తుతం ఉన్న క్షణమే అపురూపం అని గుర్తించగలగడం నిజంగా గొప్ప లక్షణం.
థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.
ReplyDeleteమీరు చెప్పింది ఊహగా, విధానంగా చాలా బాగుంటుంది. కానీ ప్రాక్టికల్-గా సాధ్యమా అనిపిస్తుంటుంది నాకు.
రాజి రెడ్డి గారు, గతం ప్రిజుడిస్, భవిష్యత్ భయం... రెండూ లేకపోయినా, మనల్ని ‘ఈ’ క్షణంలో ఉండనీయనిది ఇంకేదో ఉంది, అదేమిటో తెలియడం లేదు. తెలుసుకోలేమెమో.
ReplyDelete@హెచ్చార్కె సర్:
ReplyDeleteగతం ప్రిజుడిస్, భవిష్యత్ భయం లేకుండా అని శేఖర్ కపూర్ వ్యాఖ్యానించింది ఈ క్షణంలో బతకడం గురించిన సందర్భం గురించి కాదనుకుంటాను. ఒక విషయాన్ని కామెంట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు, ఈ క్షణం నేననుకున్నది... అనుకున్నది అనుకున్నట్టుగా రాస్తాను. ఇందులో భూతకాలపు ప్రిజుడిస్ లేదు, ఇలా రాస్తే ఏమనుకుంటారో, నాకేమవుతుందోనన్న భవిష్యత్ భయం లేదు అన్న అర్థంలో చెప్పివుంటాడు.
అయితే దీన్ని పద్మవల్లి గారు ఈ క్షణంలో బతకడంగా అర్థం చేసుకుని, ఆమె అలాగే కామెంట్ రాశారు. నేను శేఖర్ చెప్పింది కన్వీనియెంట్గా వదిలేసి, ఆమె కామెంట్ వరకే స్పందించాను.
మళ్లీ మీరు రెంటినీ కలిపి మాట్లాడారు కాబట్టి, నేను ఇదంతా చెప్పాల్సివచ్చింది.
@హెచ్చార్కె, పద్మవల్లి:
ఈ క్షణంలో ఉండటం/ఉండలేకపోవడం గురించి:
అసలు ఈ క్షణంలో ఎవరైనా ఎలా బతుకుతారు? ఈ క్షణానికి మనల్ని తెచ్చింది కొన్ని గతపు క్షణాలే కదా. మళ్లీ మనం ప్రయాణించేది మరికొన్ని భవిష్యత్ క్షణాలవైపే కదా! ఈ క్షణం అనేది స్వల్పాతి స్వల్ప విరామమే. అలాంటప్పుడు మన మనోఫలకం నుంచి గత జీవితాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడిచేసుకుంటూ వెళ్లడం ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి మనమంటే మన గతమే.
కాబట్టే పద్మవల్లిగారు ఆశపడుతున్నట్టు ఈ క్షణంలో ఉండాలనుకోవడం అసాధ్యమేమో! కేవలం ఆ క్షణాన్ని సంపూర్ణంగా అనుభవించడం అన్న అర్థంలో తీసుకుంటే అది ఒక మంచి ఊహ.
రాజి రెడ్డి గారు
ReplyDeleteకాబట్టి మనమంటే మన గతమే. వెల్ సెడ్
అదే లైన్స్ లో ఒక చిన్న కవిత ఈ లింకులో
http://sahitheeyanam.blogspot.in/2008/04/blog-post_27.html
బొల్లోజు బాబా
Hello sir. Na peru vishnu.meru funday dwara naku parichayam. Me rathalu chusi chala aged anukunna. Kani ivale me photo chusa. Chusthe vayasu thakkuva lagundi . .entandi baabu aa vishleshanalu aa rachanalu. Actually nenu pusthaka samekshalu alantivem cheyalenu. . . . Kani i like ur way of writing. Ivala funday lo konchem madhuvu . . .konchem dharuvu . . .chudagane google lo search chesi maree me address pattukunnanandi.mee raasthe naa close fiernd pakkana koorchuni manasu vippi matladthunnatluga untundhi. Andhuke nachuthunnayemo. .edemaina mee anubhavalni mem anubhavinchela chesthunnaru. . . . . .adi ma IMAGINATION goppa kadhemo. . . .
ReplyDelete@ బాబా:
ReplyDeleteబాబా గారు, "గతం మాత్రమే నిజంగా నిజం". థాంక్యూ.
@ విష్ణు:
నేను మీకు ఆనందం కలిగించగలిగినందుకు మరోసారి ఆనందిస్తున్నాను. చీర్స్.
Facebook madiriga ikkada kooda Like ani vunte bagundemo.. :) konni sarlu comment cheyyalanipinchakapoyina.. happy ga anipisthuntundi ilaanti atricles inka fallowers tho discussion chusthunte
ReplyDelete