Friday, May 5, 2017

ఒకటీ రెండూ ఐదూ పదీ ఇరవై

ఒక రోడ్డు, పార్కు, గుడి, హాస్పిటల్, ఆఫీస్, బాంక్, పబ్, చివరికి స్మశానం…
ఒక రచయితకి ముడిసరుకు దొరకని చోటేదైనా ఉంటుందా? అలాంటి చాలా చోట్లకి తిరిగారు రాజిరెడ్డి. రచయితగా కాదు, జనంలో ఒకడిగా. ముడిసరుకుని పోగుచేసుకుని వాటిని కథలుగా మలుచుకునేందుకు కాదు. రచయిత తాలూకూ లోలోపలి వ్యాఖ్యానాన్ని అదిమిపెట్టి ఒక కెమెరాలాగా, ఒక టేప్ రికార్డర్ లాగా తనకి ఎదురైన అనుభవాల్ని నమోదు చేసుకునేందుకు. ఆయా చోట్లలో తారసపడ్డ విషయాల్ని ఉన్నదివున్నట్టు పాఠకుల ముందు ఉంచేందుకు. ఇదొక సెల్ఫ్ చెక్, సోషల్ చెక్, రియాలిటీ చెక్. మనకి సీదా సాదాగా ఒకే డైమెన్షన్ లో కనిపించేదే రాజిరెడ్డికళ్ళతో చూసినపుడు బహుమితీయంగా, ఫిలాసాఫికల్ లోతులు తొడుక్కుని కనిపిస్తుంది. 



(వాకిలి; డిసెంబర్ 2016)


దేవుడు ఆడే ఫుట్ బాల్

యితే నేను ఫిల్టర్ ఎత్తేయడం మంచిదే అయింది. అందుకేగదా కొత్త క్యాండిల్స్ కోసం వెతుక్కుంటూ బజార్‌కు వెళ్లాల్సివచ్చింది; అప్పుడే కదా అక్కడ ‘చోటు’ ఫుట్‌బాల్ చూశాడు. పిల్లలు మాత్రమే దాన్ని ఫుట్‌బాల్ అని నమ్మగలరు! ఫుట్‌బాల్ కాని ఫుట్‌బాల్ లాంటి ఫుట్‌బాల్ అది. లేతాకుపచ్చ రంగులో ఉంది. నాలుగుసార్లు గట్టిగా తంతే నలభై సొట్టలు పడిపోతుంది! అయినాగూడా పొద్దున పార్కులో ఆడుకోవడానికి బాగానే పనికొస్తుంది! ఓ, ఇదొక పెద్ద పార్కు! పార్కు కాని పార్కు లాంటి పార్కు! కానీ పొద్దున మేము ముగ్గురమే వెళ్తాం కాబట్టి, మేము ముగ్గురం వెళ్లడం వల్లే బాగుంటుంది!

http://vaakili.com/patrika/?p=11691

(వాకిలి; ఆగస్ట్ 2016)

బాడ్ ఇమేజ్

ఇలాంటిదొకటి జరిగే అవకాశం ఉందని మీరు నమ్ముతారా?
మనం ప్రయాణిస్తున్న ఆటో ఏ బైకునో అలా తగులుతూ వెళ్లిందనుకోండి; ఆ బైకువాలా ఆటోడ్రైవర్‌ను ఉద్దేశించి- ‘నీ యమ్మ’ అంటూ కోపంగా చూడబోతాడు; కానీ ఈలోపు ఆటో ఎటూ దాటిపోతుంది; కానీ బైకు అతనికి ఏమైందోనన్న కన్సెర్న్‌తో కూడిన కుతూహలంతో మనంగానీ ముఖాన్ని అతడి వైపు పెట్టామా– ఆ ఆటోడ్రైవర్ స్థానంలో మన ప్రతిరూపాన్ని కూర్చోబెట్టుకుంటాడు.


(వాకిలి; మే 2016)