Monday, December 28, 2009

నేను లోకసంచారి


నాకు బాగా నచ్చిన కొందరు వ్యక్తుల్లో రాహుల్ సాంకృత్యాయన్ ఒకరు. ఈ ప్రథమ పురుష వ్యాసం సాక్షి ఫ్యామిలీ లోని నేను ఫీచర్ కోసం రాసింది. ఇవ్వాళ అంటే డిసెంబర్ ౨౮న అచ్చయింది.
రాహుల్= బుద్ధుడి కొడుకు రాహులుడి పేరు మీదుగా
సాంకృత్యాయన్= బౌద్ధాన్ని తనలోకి ఇంకిన్చుకున్నవాడు
(వ్యాసంలో ఈ అర్థం కొంచం అస్పష్టంగా ఉంది. అందుకూ ఇక్కడ మళ్ళీ ఇస్తున్నాను.)

Monday, December 7, 2009

ఓ రక్తమాంసాల వైద్యుడు


ఇది నేను సాక్షి ఫ్యామిలీ పేజీ 'నేను' కోసం రాసింది. ౭-౧౨-౦౯న అచ్చయింది.

Tuesday, December 1, 2009

ఒక మగవాడి ఫీలింగ్స్- రివ్యూiది నా తొలి పుస్తకం మధుపం (ఒక మగవాడి ఫీలింగ్స్) మీద వచ్చిన తొలి సమీక్ష.
మంచి రివ్యూ రాసిన బొల్లోజు బాబా గారికి థాంక్స్. కింది లింకులో...


Monday, August 24, 2009

కదిలించిన వీడియో


ఇది ఫండే లో ఆగస్ట్ ౨౩న అచ్చయింది.

Tuesday, July 28, 2009

Monday, June 29, 2009

శంకర్ కోసం!శంకరన్నను మెచ్చుకుంటూ నాలుగు మాటలు రాయాలని నా ప్రయత్నం. తను ఆనంద పడ్డాడు. కానీ, ప్చ్.. తంబురా అని రాయాల్సింది వీణ అనేశాను. అజ్ఞానం.

Wednesday, June 10, 2009

రైలుబడిలో చదువుదాం!
నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకటి రైలుబడి. బాల్యాన్ని ఎంత అందంగా రాయడానికి వీలుందో అంత అందంగా రాసింది కురోయనాగి. పిల్లలు, టీచర్స్ ఖచ్చితంగా చదవాలి దీన్ని.
ఇది జూన్ ౭ న ఫండే లో వచ్చింది.

Monday, April 6, 2009

ఓ లెజెండ్

నాకు బాగా నచ్చే వ్యక్తుల్లో రాహుల్జీ ఒకరు. ఆయన రాసిన వోల్గా నుంచి గంగకు నా అభిమాన పుస్తకాల్లో ఒకటి. ఆయన పుట్టిన రోజుకు నేను రాసిన నాలుగు మాటలు
.

Monday, March 30, 2009

ఫండే పుట్టిన రోజు ఇవ్వాళ!

మార్చ్ ౩౦ రోజు ఫండే తొలి సంచిక ఇచ్చాం. అప్పుడే ఏడాది గడిచిపోయింది. మొదటి దాన్లో తొలి అడుగు పేరిట ప్రారంభ వ్యాసం రాశాను. ఈ వార్షికోత్సవానికి దాని సీక్వెల్ ఇది.

Monday, March 23, 2009

'విరోధి'కి కూడా శుభాకాంక్షలు


పతంజలికి అంజలి!

'
కారణం తెలియదు, పతంజలిని నేను చాలా ఆలస్యంగా చదివాను.
మా ఎడిటర్ అయ్యాక కూడా చదవక పోవడం దారుణం అన్నట్టుగా చదివాను.
ఎంత నవ్వుకున్నానో నాకే తెలియదు.
గోపాత్రుడు తెలుగు సాహిత్యంలో క్లాసిక్. నా ఫేవరేట్ కూడా.
తెలుగులో టాప్-౨౫ నవలల్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటే ఇది కూడా అందులో ఉంటుంది. ఉండాలి.
ఈ విషయం నేను ఆయనకు మెసేజ్ కూడా ఇచ్చాను. ఏమనుకున్నారో తెలియదు.
'థాంక్స్' అని రిప్లై మాత్రం ఇచ్చారు.

Friday, February 13, 2009

పూలు... కొన్ని మాటల మాలలు


టీ పయ్ కోసం ఇదుగో ముగ్గురం కూర్చున్నాం. పూల మీద మాటల మాలలు కట్టే ప్రయత్నం చేశాం. ఇది ౧౩-౦౨-౦౯ రోజు సాక్షి ఫ్యామిలీ లో అచ్చయింది.

Monday, February 9, 2009

నేనంటే నేనే


ఐన్ ర్యాండ్ మీద రాసిన ఈ వ్యాసం సాక్షి 'నేను' పేజీలో వచ్చింది.

Monday, January 5, 2009

నన్ను రూమీ పూనిన క్షణం...

ఇదుగో ఇలాంటి ఆర్టికల్ తయారైంది. ఇందులో దీవి సుబ్బారావు గారి వాటా చాల ఉందని నాకు తెలుసు. రూమీని పరిచయం చేసింది నాకు ఆయనే గనక. ఆయన 'సూఫీ కవిత్వం' చదవకపోయి ఉంటే ఇది నేను రాయకపోయేవాన్ని గనక. సాక్షి 'నేను' శీర్షిక కోసం రాసిన ఈ వ్యాసం ౫-౧-౦౯ రోజు అచ్చయింది. ఇక్కడ పెట్టింది ఎడిట్ చేయని వెర్షన్.

శుభాకాంక్షలు


నన్ను చదివే వారికీ, చదవని వారికీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.