Friday, November 27, 2026

కొజ్జిప్ప

 


చెట్లు ఎప్పుడూ నా సంతోషంలో భాగమేగానీ, ఈమధ్య దాన్ని మరింత స్పష్టంగా గమనిస్తున్నాను. ఎక్కడ ఏ మహావృక్షాన్ని చూసినా నా మనసు ఉప్పొంగుతుంది. ఏ చిన్న గుడికి వెళ్లినా అక్కడో పాతచెట్టు ఉంటుంది. ఆ చెట్టును ఆనందంగా తడిమితేగానీ నా దర్శనం పూర్తవదు. మా ఇంటివెనకాలి కళమామిడి చెట్టు, జామచెట్టు, మా పొలంకాడి చింతచెట్లు నా బాల్యంలో భాగం. మా పొలం అంటే మా కొజ్జిప్పకాడి పొలమే. ఆ విప్పే మా పొలానికి చిరునామా. దానిగురించిన తలంపే ఈ పుస్తకంలో ఉంది.

(Posted on FB on 5th November 2026)


No comments:

Post a Comment