-యండమూరి వీరేంద్రనాథ్
యండమూరితోనే నాకు సాహిత్యం పరిచయం. కానీ "అనూహ్య' పరిచయం. అట్టలూడిపోయిన పుస్తకమొకటి మామయ్య వాళ్లింట్లో పడివుంది. అలా అంతకుముందు కూడా కొన్ని పడివున్నవి తిప్పిచూశానుగానీ అవి రాసినవాళ్ల పేర్లుగానీ, వాళ్లను మళ్లీ చదవాలన్న కోరికగానీ కలగలేదు. ఈ చీకట్లో సూర్యుడు అందుకు విరుద్ధం. నన్ను అంతరిక్షంలో గిరికీలు కొట్టించాడు. కొన్ని రోజులు యశ్వంత్ లాగా మౌన గంభీరంగా ఉండటం గొప్పనుకునేవాణ్ని. కాదు, వాయుపుత్రలాగా అల్లరిగా ఉండటమే గొప్ప కాబోలనుకునేవాణ్ని. చివరకు ఇద్దరిగానూ ఉండలేక, నాలా నేను ఉండటానికి ఇప్పటికీ విఫల యత్నం చేస్తున్నాను.
మళ్లీ ఈ మధ్యలో ప్రకాశం జొరబడ్డాడు. మాసిన దిండులాంటివాడు. ఇంకెప్పుడో గాంధీ వచ్చిచేరాడు. రెపరెపలాడే కొత్తనోటులాంటివాడు. అయితే, అటు ప్రకాశంలా ఉండిపోనూలేము. ఇటు గాంధీలాగా పచ్చనోట్లు తగలబెడుతూ చిర్నవ్వుతో చూడనూలేము. కాకపోతే, మన ప్రియురాలు ఎప్పుడు పిలుస్తుందా? తలవాల్చేందుకు పల్చటి పొత్తి కడుపు ఎప్పుడు లభిస్తుందా? అని కలలు కనడం మాత్రం చేయగలిగాము.
ఇంకా, చెంగల్వపూదండలూ వెన్నెల్లో ఆడపిల్లలూ గోదారులూ ప్రేమలూ పర్ణశాలలూ అభిలాషలూ అనైతికాలూ ప్రార్థనలూ యుగాంతాలూ...
ఈయనెవరో నాకోసమే రాస్తున్నాడా?
మందాకిని స్నానించినప్పుడు ప్రవహించే సబ్బు నురుగు పుట్టించే కొన్ని ఉత్తేజిత క్షణాలు... యండమూరిని చదవడం.
పైనెక్కడో సాహిత్యంతో పరిచయం అన్నానా!
కొంత పెద్దయ్యాక, పెద్దాళ్లు రాసింది చదివితే, యండమూరి రాసింది క్షుద్ర సాహిత్యం అని తెలిసింది. కానీ, దాన్ని క్షుద్ర సాహిత్యం అని అంగీకరించడానికి నాలో దాగివున్న క్షుద్రుడు అడ్డుపడ్డాడు.
ఇంకా యండమూరి దురదృష్టం ఏమిటంటే, "కామూ'ను చదివి ఆయన అంతర్ముఖం రాస్తే, కాపీ కాపీ అన్నవాళ్లు... అదే కామూలాంటివాళ్లను తెలుగులోకి తెచ్చినవాళ్లను సృజనశీలురుగా ముద్రవేయడం. బహుశా పేరొచ్చినవాడిని మనం సహించం. డబ్బు కూడా వచ్చినవాడంటే అసలు భరించం. సాహిత్యం సంపద ఇవ్వడమేమిటి మరి? చర్చలకూ, వాదోపవాదాలకూ పనికిరావాలిగానీ!
యండమూరి డబ్బు కోసం మాత్రమే రాసినవాడా?
ఒక మామూలు యువ ఉద్యోగి. మొదటిసారి స్లీపరు క్లాసులో ప్రయాణిస్తున్నాడు. అంగీ విడిచి, బనీన్ మీద పడుకోవాలి! సహ ప్రయాణీకులు ఖరీదుగా కనిపించారు. వాళ్ల మధ్య అలా చేస్తే తన పల్లెటూరితనం బయటపడుతుంది. ఎలా? ఇంతలో ఓ కాఫీ అమ్ముకునే కుర్రాడు వచ్చాడు. అతడికివ్వాల్సిన చిల్లర కోసం ఆ ఖరీదు మనుషులు ఎంత చిల్లరగా ప్రవర్తించారని! డబ్బులివ్వలేదు. రైలు కదిలింది. కుర్రాడు పరుగెత్తుకుంటూ వచ్చి కిందపడ్డాడు. మట్టిలో దొర్లాడు. యువకుడు చలించాడు. జేబులో ఉన్న డబ్బులో గుప్పిడితో తీసి పిల్లాడివైపు విసిరికొట్టాడు. ఖరీదైన వ్యక్తిత్వాల మీద తనకు ఉన్న భ్రమ అనే "మిస్ట్" ఇట్టే కరిగిపోయింది. ఇక వాళ్లను ఖాతరు చేయకుండా, లుంగీ బనీన్ మీదే కాళ్లు జాపుకుని హాయిగా పడుకున్నాడు.
బహుశా, యండమూరి కూడా తన విమర్శకుల విషయంలో ఇదే చేసివుంటాడు.
అయితే, నాటకాలు, నవలలు, వ్యక్తిత్వ వికాసాలు అనబడే మూడు దశలుగా ఉన్న తన సాహితీ జీవితంలో... యండమూరి మొదట్లో ఉన్నట్టు మధ్యలో లేడు. మధ్యలో ఉన్నట్టు ఇప్పుడు కనబడడు. అది మార్పుగా కాకుండా, తనను తాను ఏమార్చుకుంటూ వెళ్లాడేమోననిపిస్తుంది. సమాజపు కన్నీళ్లు తుడవడం కంటే, అందుకోసం టిష్యూ పేపర్స్ అమ్మితే బాగుంటుందన్న ఆలోచనాధోరణిలో పడిపోయాడు. పోరాటమే తప్ప జీవితంలో జయాపజయాలు ఉండవని తెలిసినా విజయసూత్రాలు లిఖించడం మొదలుపెట్టాడు.
ఇక ఇది నాకు సరిపోదని బీరువా అడుగున మడతపెట్టి దాచిన పొట్టి చొక్కా యండమూరి సాహిత్యం. వేసుకోవడానికి కుదరకపోయినా, తడిమి చూసుకుంటే అపురూపంగా ఉంటుంది.
(నవంబర్ పద్నాలుగున యండమూరి పుట్టినరోజు)

చాలా బాగా రాశారండీ...
ReplyDeleteavunu meeru cheppindi akshara sathyam
ReplyDeletei was grownup reading yandamuri
ReplyDeletei still remember the days -
waiting for andhrabhoomi for his serial on every thursday,
fighting to get the first opportunity to read his released novel from the lending library man,
underlining the important paragraphs with pencil (i never forget an incident= one person searched for the man who underlined those lines for nearly three months and found me which gave me thrill/emberrasment)
what not my youth hood was dissolved in the stream of yandamuri
as you said i too moved away from him after he turned towards personality devt
but he is still my icon
few years back, when he attended a meeting at kakinada, i arranged a photographer and requestem him to give pose with me. and that photo graph hangs in my hall. (since then i stopped rediculing those fans who take photographs with their favourite matinee idols)
yeah he is still my old shirt for me too
bollojubaba
యండమూరి తన ముఖాముఖి లలో ఎప్పుడు భేషజానికి పోయినట్టు అనిపించడు. నిఖార్సు గా జీవితం లో డబ్బు ప్రాధాన్యత గురించి చెబుతాడు. తానూ డబ్బుకోసం, తన కోసం, పాటకుల కోసం ఇలా అన్ని విధాలా ప్రయత్నించా నంటాడు. ఇకట టిష్యూ పేపర్ అంటారా, అమ్మిన దాంతో సరస్వతీ పీటం టిష్యూ పేపర్ అమ్మకం తో చెయ్యొచ్చని ప్రూవ్ చేసిన వాడు.
ReplyDeleteకాలం తో బాటు మారిన మనిషనుకుంటాను నా వరకతైతే తను. ఇప్పుడు వస్తున్న Indian writers in English ల తో బాటూ తను కూడా ప్రయత్నించ బోతున్నానని తన ఇంగ్లీష్ నవల వస్తుందని ఆతను ఒక ముఖా ముఖీ లో చెప్పాడు.
బొల్లోజు బాబా గారు చెప్పినట్టు, ఒక జనరేషన్ చదువరులకి యండమూరి ట్రెండ్ సెట్టర్.
చాలా బాగా రాశారు.
ReplyDelete>>>ఈయనెవరో నాకోసమే రాస్తున్నాడా?
ఆయన రచనల్లో కొన్ని విలువైన వాక్యాలు చదివినప్పుడు ఇలాగే అనిపిస్తుంది.
@ వేణూశ్రీకాంత్, శశికళ, శిశిర:
ReplyDeleteథాంక్యూ.
@ బొల్లోజు బాబా:
మ్యాగజైన్స్ లో సీరియళ్ల హవా తగ్గిపోయాక నేను చదవడం ప్రారంభించాను. కాబట్టి వారం వారం ఎదురుచూసే రోజులు నాకు లేవు.
యండమూరి మీద నాకూ ఇప్పటికీ అభిమానం ఉంది. అయితే, ఫొటో తీయించుకోవడం? నేనింకా తీసుకునేవాళ్లను వెటకారం చేసే దశలోనే ఉన్నాననుకుంటా!
@ జిలేబి:
అవును, యండమూరి నిజాయితీ మీద నాకూ అనుమానం ఏమీ లేదు. నాకు తెలిసినంతవరకూ ఆయన చేసేదే రాశాడు, రాసిందే చేశాడు. ఆయనతో కొన్ని అంశాల్లో విభేదించినా, నేను చలం తర్వాత అంత ఎక్కువ చదివింది యండమూరినే.
ఇంగ్లీష్ రైటర్స్-తో పోటీగానా? మొన్న చేతన్ భగత్ three mistakes of my life చదవడం మొదలుపెట్టాక... ఆ ఎత్తుగడ, పాఠకుల్ని లోపలికి లాక్కుపోయే తీరు... ఇలాంటి ప్రయోగాలు యండమూరి ఎప్పుడో చేశాడు కదా... అనిపించింది.
రాజా రెడ్డి గారు,
ReplyDeleteమీరు నిజం గానే పాత చొక్కాని తడిమి ఆనంద పడే వారే సుమా !!
(ఎప్పుడో నవంబెరు రెండువేల పదకొండులో రాసినదానికి ఇప్పుడు పాత కామెంటుని మీరు తడిమి చూడడం గురించి చెబ్తున్నా- !!)
చీర్స్
జిలేబి.
సమస్యేమిటంటే...
ReplyDeleteచాలాసార్లు కామెంట్సు రాసినవాళ్లకు ప్రతిస్పందనగా థాంక్యూకు మించి ఏమీ చెప్పలేం! ఒక్కోసారి అది నాకే నచ్చదు. ఆ ఒకే ఒక్కమాట అలా కొట్టి వదిలేయడం మొక్కుబడి అవుతుందేమో, అది వాళ్లను చిన్నబుచ్చినట్టు అవుతుందేమో, అనిపిస్తుంది. అందుకని ఏమీ జవాబు ఇవ్వకుండా వదిలేస్తాను. మళ్లీ ఇగ్నోర్ చేసినట్టు అవుతుందేమో, అని ఒకవైపు పీకుతుంటుంది. అందుకే ఆలస్యంగానైనా ఈ రిప్లై సమాధానాలు. (పైగా నా శ్రేయోభిలాషి ఒకరు ఇలా రిప్లై ఇవ్వకపోవడం పొగరు కిందికి వస్తుందన్నారు.)
చిన్న చిన్న విషయాలకు కూడా బుర్ర పాడుచేసుకోవడంలో నా తర్వాతే ఎవరైనా. అయినా ఇది చిన్న విషయమే అయితే నేనెందుకు పట్టించుకున్నాను. కాబట్టి కచ్చితంగా ఇది పెద్ద విషయమే అయ్యుండాలి.
"చిన్న చిన్న విషయాలకు కూడా బుర్ర పాడుచేసుకోవడంలో నా తర్వాతే ఎవరైనా"
ReplyDeleteహ హ LOL. You have my company there Mr RariReddy.
BTW, I finally read your "Madhupam".
AWESOME! is the word.
I am asking all my friends to read it.
కుమార్ గారూ,
ReplyDeleteథాంక్యూ+థాంక్యూ+థాంక్యూ= 3 థాంక్యూలు.
మనం అంతే... యండమూరినో చలంనో చదివేస్తాం.. ఆ చదవడం వల్ల ఒక మెట్టు పైకి ఎక్కుతాం... వెనక్కి తిరిగి చూసి ఛీ ఛీ అదంతా క్షుద్రసాహిత్యమనో, బరితెగింపు సాహిత్యమనో చేతులు దులిపేసుకోని ఇంకో పాపాత్ముడి పుస్తకం పట్టుకుంటాం... మనం ఎక్కిన మెట్లు వాళ్ళవల్లేనని మనకి గుర్తురాదు..
ReplyDeleteయండమూరి గారు నా అభిమాన రచయిత. ఆయన రాసింది క్షుద్ర సాహిత్యం అంటే ఒప్పుకోను. ఆరోజులలో (1970-80 దశాబ్దంlalO) చాలా మంది రచయితల పైన మార్క్సిజం ప్రభావం ఎక్కువగా ఉండేది. సమాజంలో ఏ విలువలను కాపాడడానికి రాముడు రాజధర్మం పేరు తో ఒక రాజుగా ప్రయత్నించాడో, అప్పటి రచయితలు మార్క్సిజం అడ్డుపెట్టుకొని రామాయణం లోని విలువలను విమర్శిస్తూ(ప్రజల తరపున) రచనలు చేసేవారు. మొత్తానికి అందరు వాస్తవికత కన్నా "విలువల" తో ఎక్కువ రోమాన్స్ చేసేవారు. అప్పట్లో చదువుకొన్న ప్రజలను ఎవరిని కదిలించినా ప్రభుత్వం ఉద్యోగాలు చూపించటం లేదని ఫిర్యాదులు చేసే ఆరోజులలో, యండమూరిగారొక్కరే మధ్యతరగతి ప్రజలు సవాళ్లు తీసుకొని, జీవితంలో డబ్బులు సంపాదించి పైకి పోవలసిన అవసరమున్నదని గుర్తించిన రచయిత. అప్పటి నిరుత్సాహా పూరిత సోషలిస్ట్ భావాల సమాజానికి కలలు ఇచ్చిన "ఉత్తమ" రచయిత. మంచి లిబరల్. ఆయన పుస్తకాలు సమాజం అర్థం చేసుకోవటానికి, నా అవగాహాన పరిధిని ఎంతో పెంచాయి. తెలుగు భాష లో అటువంటి రచయిత ఉండటం నాకు గర్వకారణం. ఆయన పుస్తకాలు కన్నడలో తర్జుమా అవుతాయి. నా కన్నడ మిత్రులు వాటిని చర్చించుకొంటే మొదటిసారి విన్నపుడు చాలా ఆశ్చర్యము, ఆనందం వేసింది. ఒక ఇంటర్వ్యులో సుధా నారయణముర్తి గారు కూడా యండమురిగారు రాసిన పుస్తకాలను చదువుతామని చెప్పారు. ఆయన ప్రభావం ఇతర భాషల వారిపై కూడ ఎంతో ఉందని అర్థమైంది.
ReplyDeleteSrIRam