Friday, September 27, 2013

కామెంటుకు ఎలా స్పందించాలి?

సాధారణంగా నా బ్లాగులో కామెంట్లు తక్కువగానే వస్తాయి. ఆ వచ్చే కొన్నింటికైనా ఒక బ్లాగర్ ఎలా రెస్పాండ్ కావాలి? ఉత్తినే వరుసగా థాంక్యూలు చెప్పుకుంటూ వెళ్లిపోతే సరా! ఎందుకో, అది సరైన స్పందనగా నాకు అనిపించడం లేదు. అలాగని వదిలేస్తే, పట్టనట్టుగా ఉన్న భావాన్ని కలిగిస్తున్నానేమో, అని మరొకవైపు పీకుతుంటుంది. చెప్పాలంటే, ఒక్కోసారి థాంక్యూ కూడా సరైన రెస్పాన్సు కాబోదు. దానివల్ల కూడా మౌనం వహించాల్సి వస్తుంది. అందుకే ఇక నేను ఈ కంక్లూజన్-కు వచ్చాను.

అసలు, ఒక పోస్టు పెడుతున్నానంటే అది నేను నావైపు నుంచి జరుపుతున్న సంభాషణ కదా! ఎవరైనా ఒక కామెంటు రూపంలో రెస్పాండు అవుతున్నారంటే, అది నా సంభాషణకు జవాబు. దానికి కచ్చితమైన విలువ ఉంది. మరలాంటప్పుడు నేను ఉత్తినే ఏ విలువా చెయ్యని అదనపు మాట ఎందుకు మాట్లాడాలి!


9 comments:

 1. కామెంట్ ద్వారా మేం చదివాం అనే ఇండికేషన్ ఇస్తున్నారు. అలా కాకుండా, కేవలం చదివేసి వెళ్ళిపోవచ్చు. కామెంట్ చెయ్యడానికి కొంత సమయం వెచ్చించి, బ్లాగ్ రచయితని ప్రోత్సహిస్తున్నారు కనుక ధన్యవాదాలు తెలపడం మంచి సంప్రదాయం. థాంక్స్ చెప్పడం వాళ్ళు రాసినదానికి సమాదానం అనుకోకూడదు. నా వరకూ, వచ్చిన ప్రతీ కామెంటుకీ స్పందిస్తాను.

  ReplyDelete
 2. మీతో నేను ఏకీబవించను. ఒక కామెంటు ఇచ్చామంటే ఏంతో నచ్చినా , నచ్చక పోయినా ఇస్తాము. దీనికి ఆ రచయి త ఎలా రియాక్ట్ అవుతాడు లేదా ఎలా సమర్థించు కుంటాడు? అని ఎదురు చూస్తాము. ఒక్కోసారి ఇలాటి కామెంట్స్ రచయితకు కుడా ఉపయోగపడతాయి[మీ లాటి మంచి రచయితలకు కాకపోవచ్చు ] కానీ మాలాటి సామాన్యులు అభినందనను కానీ, విమర్స నకు కానీ మీరు ఏమి సమాధానం ఇస్తారు అని ఎదురు చుస్త్తాము. ఎవరో ఎందుకు నేనే మీ అభిమానిని , మీ బ్లాగు అని తెలిసాక ఏంతో ఇష్టంగా రాసాను ఎంత బాగా రాస్తారూ అని , అంతే కాదు అరవై ఐదు ఏళ్ల వయసు కలిగిన నేను చిన్నపిల్లలా మీ సమాదానం కోసం ఎదురు చూసాను...మీ రు కనీసం చూసారా అన్నది కుడా తెలియలేదు....ఇలా ఉంటుందండీ రియాక్షన్..ఇదీ నా కామెంటు!!

  ReplyDelete
 3. @ లక్ష్మీ రాఘవ:
  మేడమ్, ఇందులో వచ్చే ప్రతి కామెంటూ నాకు విలువైనదే; చూడకపోవడం అనే ప్రసక్తే ఉండదు. కాకపోతే ఉత్తి థాంక్స్ అని చెప్పడంలో ఉండే చప్పదనం నాకు రుచించదని మాత్రమే నా ఉద్దేశం. నా స్పందన కోసం ఎదురుచూసి చిన్నబుచ్చుకునేలా చేసినందుకు మాత్రం అయ్యో సారీలు!

  ReplyDelete
 4. లక్ష్మీ మేడం గారు, నిజంగా పసివారే, మనస్పూర్తిగా వారి ఇష్టాన్ని తెలుపుతారు. వారన్నట్లు రాజిరెడ్డిగారు సాహిత్యలోకానికి చిరపరిచితులే కనుక స్పందన ఉన్నతంగానే ఉంటుంది.

  ReplyDelete
 5. This comment has been removed by the author.

  ReplyDelete
 6. రాజి రెడ్డి అన్న గారికి నమస్తే!

  నేను మేకు వీరాభిమానిని. కేవలం మీరు రాసే ఆజన్మం కాలమ్ కోసం నేను పతి ఆదివారం సాక్షి పత్రిక కొంటాను అని చెబితే మీరు నమ్మరేమో. ఆన్‌లైన్ లో చదవచ్చు కదా అని అడగకండి. నాకు ఆన్‌లైన్ లో చదవడం కన్నా పుస్తకం లో చదవడమే ఇస్టం. పాత ఎడిషన్స్ దొరకకపోతే రెండు రోజులు కంప్యూటర్ ముందు కూర్చొని నేను చదవడం మిస్ ఐన ఆర్టికల్స్ ని మీ బ్లాగ్ ద్వారా చదివానని చెప్పిన మీరు నమ్మరేమో.

  ప్రతి మాట ని అంత అందం గా వార్ణించడం లో మీకు మీరే సాటి. కొన్ని కొన్ని సార్లు మీ మాటల్లో పురుష వాదం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ మాటలెప్పుడు మీ మీద అభిమానాన్ని కొంచం కూడా తగ్గించలేకపోయాయి. ఎవరి అభిప్రాయాలు వారివి అని నమ్ముతాను నేను. అందరు ఒకలా ఆలోచిస్తే ప్రపంచం చాలా బోర్ కొడుతుంది కదా. 2008 లో అరణ్య గారు మే ఆర్టికల్ ని విమర్శిస్తూ రాసిన ఆర్టికల్ ని కూడా చదివాను. ఆవిడ మాటల్లో కూడా నిజం లేకపోలేదు. కానీ మీ ఆర్టికల్ తప్పని నేను అనలేను. మీరు మదుపం పుస్తకం లో ఒక మాట చెప్పారు 'మీరు ప్రేమించినంతగా మేము మిమ్మల్ని ప్రేమించలేని మా బలహీనతకి మమ్మల్ని క్షమించండి' అని. ఈ మాటే కాకుండా ఇంకా చాలా మాటల్లో మీరు అమ్మాయిల వైపు నుంచి కూడా మాట్లాడతారనిపిస్తుంది. ఇంకొక ఆర్టికల్ లో మీరు రాశారు 'మన చుట్టూ ప్రపంచాన్ని నిర్మించుకునే వాళ్ళు కొందరూన్నారని తెలిశాక, వాళ్లే మనకు ప్రపంచామైపోతారు'. ఎంత అద్బుతము గా చెప్పరండి. కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది అబ్బాయీలు చేసే తప్పుల్ని కూడా మీరు మీ మాటల్లో అందంగా వెనకేసుకొస్తారేమో అని. మీరు రాసిన కొన్ని ఆర్టికల్స్ ని అమ్మాయి కోణం నుంచి ఎప్పుడైనా ఒక ఆర్టికల్ రాయాలనిపిస్తుంది. కానీ సరదాగానేనండి. సీరీయస్ గా మాత్రం కాదు. కానీ మీ అంత అద్బుతముగా మాత్రం రాయలేను.

  మీరు సాధారణ మనిషి జీవితాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించే విధానం నాకు చాలా నచ్చుతుంది. మీరు రాసిన ఆర్టికల్స్ చదువుతుంటే మీలా ఎవరూ రాయాలేరనిపిస్తుంది. మీ వాక్యాల్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఇంకా చాలా రాయాలనుకున్నాను కానీ మరీ ఎక్కువగా పొగిడేస్తే మీరు నమ్మరేమోనని రాయడం లేదు.

  నేను చెప్పిన దాంట్లో ఏదైన మీకు తప్పుగా అనిపిస్తే క్షమించగలరని మనవి.

  ReplyDelete
  Replies
  1. అపర్ణా,
   సో స్వీట్! ఈ పొగడ్తలన్నింటినీ నమ్మేస్తున్నా! గిటార్ ఏమీ ప్లే చేయనక్కర్లేకుండానే:-)
   (ref: I use my guitar to scare my mom.)

   "మీరు రాసిన కొన్ని ఆర్టికల్స్ ని అమ్మాయి కోణం నుంచి ఎప్పుడైనా ఒక ఆర్టికల్ రాయాలనిపిస్తుంది."
   మ్... తప్పకుండా. చదవబుద్ధేస్తోంది నాకు.

   Delete
  2. థ్యాంక్ యూ అన్న.... :)

   నా ఫేవరెట్ రచయిత నుంచి రిప్లై రావడం ఎంతో సంతోషం గా ఉంది. ఎంత సంతోషం గా ఉందో చెప్పలేను. నేను 29 ఆక్టోబర్ ని క్యాలండర్ లో రౌండ్ ఆఫ్ చేసుకుంటాను. :)

   Delete
 7. Sushma27.10.13

  I always read with interest your column in saakshi sunday magazine. They characterize the lost values and thoughts in today's modern world. I really liked your article on Oct 27...and liked the statement..on Veedu anaka poi vunte bagudu ani

  ReplyDelete