(ఇది సరిగ్గా గతేడాది మే నెలలో రాసుకున్నది. ఇందులోని చాలా పాయింట్స్ మీద చర్చ జరిగింది; ఇంక మళ్లీ పునరుక్తి అవసరమా అనిపించిందప్పుడు. కానీ నా ఆలోచనా ధారను ఒక కొలిక్కి తెచ్చుకున్న ప్రయత్నాన్ని చూపడం కోసం ఇట్లా.)
పిల్లలు–చదువులు: 2
కొన్ని ఇంగ్లీషు ఆలోచనలు
-----------------------------
దీన్ని రాస్తున్నానంటేనే, నేను ఏ మీడియంలో నా పిల్లల్ని చదివిస్తున్నాను అనే ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత నా మీద ఉంటుంది. దాన్నేమీ దాటేయను.
మొన్నమొన్నటిదాకా tiny అనే పదాన్ని టినీ అనుకున్నాను. అంతకుముందెప్పుడో ఓ స్టార్ హీరోను ఇంటర్వ్యూ చేయాలనిపోయి (precious) ప్రీసియస్ అని పలికి చిన్నబోయినంత పనైనాను. ఇంగ్లీషు భాషకు సంబంధించి ఇవి అత్యంత ‘టైనీ’ వివరాలు, కానీ నా వరకూ ‘ప్రెషస్’ వివరాలు. తెలుగులో మనకు రాయడం వస్తే చదవడం వచ్చేసినట్టే. కానీ ఇంగ్లీషులో రాయడం వస్తే చదవడం వచ్చినట్టు కాదు. దాన్ని ఎలా పలకాలో తెలిసినవాళ్ల దగ్గర వింటేనే మనకు ఇంగ్లీషు వచ్చినట్టు.
నా ఎఫ్బీ జాబితాలో ఉన్న ఓ బెంగాలీ రచయితను నువ్వెందుకు బెంగాలీలో రాయవూ అని అడిగాను. నేను ఇంగ్లీషులోనే ఆలోచిస్తాను, అన్నాడు. నాకు తెలిసి ‘మన’ చాలామంది ఇళ్లల్లో మన తల్లిదండ్రులకు ఇంగ్లీషు రాదు. ఇంగ్లీషులో ఆలోచించడం అటుండనీ, కనీసం రోజువారీ జీవితంలో సుమారు ఇంగ్లీషు కూడా మాట్లాడం. మాట్లాడలేం.
ఈ మనం అనే మాట కొంచెం ట్రిక్కీ. సమాజాన్ని ఎన్నో రకాలుగా విభజించగలిగే సందర్భంలో మనం అంటే ఎవరం? దీన్ని ఎట్లా నిర్వచించాలి? మనం అని చదువుతున్నప్పుడు దాన్ని ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్లందరూ ఈ మనంలో భాగమే.
ఇంగ్లీషు మాట్లాడగలిగినవాళ్లంతా జ్ఞానవంతులు అనే భ్రమ నాకు లేదు. ఇంగ్లీషు కూడానేమోగానీ, ఇంగ్లీషొక్కటే ఉపాధికి కీలకం అనీ నమ్మలేను. మన చుట్టూ ఎన్నో పనులు సమర్థంగా నిర్వహించగలిగిన ప్రతి ఒక్కరూ ఇంగ్లీషులో గడగడా మాట్లాడలేరు. జీవితంలో అపారమైన అనుభవం ఉన్న ఎందరో పెద్దవాళ్లు ఇంగ్లీషులో మాట్లాడబోయి భంగపడటం చూస్తుంటాను. సమస్య ఏమిటంటే, హిందీ నాకు రాదు అని సింపుల్‌గా చెప్పేయొచ్చు. మై ఆతీ హై అని వెటకారం చేసినా ఎదుటివాడు జోక్ అనుకుని నవ్వేస్తాడు. కానీ ఈ వెసులుబాటు ఇంగ్లీషుకు లేదు. అది మన ప్రయోజకత్వానికి చిహ్నం. అది మన ప్రగతికి చిహ్నం. రాదంటే న్యూనత. ఉపాధి కంటే ఈ న్యూనత బలమైనది. దీన్ని దాటడం కష్టం. దాదాపు అసాధ్యం.
పాత తెలుగులో వర్ధంతి అనే మాటకు జయంతి అనే అర్థం. కానీ ఇప్పుడు వర్ధంతి అంటే చనిపోయాక చేసేదే. ప్రస్తుతం తెలుగు భాషకు ఈ వర్ధంతి అనే మాట ఏకకాలంలో భిన్న అర్థాలిస్తూ బ్రహ్మాండంగా సరిపోతుంది. అలాగని భాషను బతికించడం ప్రత్యేకంగా ఎవరి బాధ్యతో కాదు. మన కోసం భాషగానీ భాషం కోసం మనం కాదు. కానీ తెలుగు మీద, మాతృభాష మీద అభిమానం చూపడం బ్రాహ్మణీకమో మరొకటో కాదు. మన శరీరం మీద మనకు ఉండవలసింది అభిమానం కాదు. అది వాస్తవమన్న గ్రహింపు. అట్లా తెలుగు మన భాష. మన వాస్తవం.
కానీ మన దగ్గర తెలుగు అనగానే రెండు ఎక్స్‌ట్రీమ్స్ ఉంటాయి. రోడ్డు, బస్సు పదాలు కూడా వాడొద్దనే తెలుగొకటి. సంస్కృత పదాళ మేళవింపు నాది కాదని ఈసడించుకునే తెలుగొకటి. బస్సులో పోతున్నాను, అన్నప్పుడు– లో అనే కనెక్టింగ్ మాట పడినంతకాలమూ అది తెలుగే. అట్లాగే ప్రతి మాటా మనకు ముందే తెలిసివుండటానికి మనమేమీ భాషను తయారు చేయలేదు. దానికి సమానార్థకాన్నిచ్చే ఇంగ్లీషు కూడా పరాయిభాషే కదా!
నాకు తిక్కన పద్యాలు అర్థం కావు, కానీ Catcher in the Rye అర్థమవుతుంది. ఇదొక వైరుధ్యం. కాలం గడిచేకొద్దీ ఒక తరపు భాష తరువాయి తరాలకే పరాయిది అవుతుంది. ఇది తెలుగుకే కాదు, ఇంగ్లీషుకూ వర్తిస్తుంది. మొన్నేదో లింకులో జూలియన్ ఆఫ్ నార్విచ్ గురించి రాశారు. ఆమె ‘మిడిల్ ఇంగ్లిష్’లో రాసిన వాక్యాలను ఇప్పటి ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసి పెట్టారు. కాబట్టి తెలుగు అంటున్నప్పుడు మనం ఇవ్వాళ ఎలా మాట్లాడుకుంటున్నామో ఆ సగటు తెలుగు. ఏ ఇబ్బంది లేకుండా అర్థం చేసుకుంటున్న తెలుగు. రైల్వే సిగ్నల్‌ను అనువాదం చేయనక్కర్లేని తెలుగు. మంచినీళ్లలా తాగగలిగే తెలుగు. ఒక్కోసారి పరగడుపున మంచినీళ్లు తాగడం కూడా కష్టమే. దానికీ కొంత ప్రయత్నం అవసరమే.
గాంధీజీ, సుందరయ్య, చిలుకూరి దేవపుత్ర లాంటి భిన్న భావజాలాలకు చెందిన వాళ్లందరూ మాతృభాషలోనే పిల్లల్ని చదివించడం మంచిదని అన్నారని చదివాను, విన్నాను. కానీ నాకు పిల్లలు పుట్టే కాలానికి లోకం ఒక రీతిలో సాగుతోంది. అందుకే చాలా గింజుకున్నాను, వేదన పడ్డాను, తలపోటు తెచ్చుకున్నాను, చివరికి ఒక స్థిరానికొచ్చాను. చాలాసార్లు మనం ప్రాక్టికల్‌గా ఉండవలసి వస్తుంది. లోకంతోపాటు నడిచి ఫెయిలైనా ఇబ్బంది ఉండదుగానీ లోకవిరుద్ధంగా పోయినప్పుడు విధిగా సక్సెస్ కావాల్సిన బరువు మన మీద పడుతుంది. అంత బరువు నేను మోయదలుచుకోలేదు. ఈ లోపల నా ఆలోచనల డోలాయమానం గానీ ఇంకే సంశయాలుగానీ లేకుండా ప్రభుత్వమే నా తరఫున నిర్ణయం తీసేసుకుంది. ఇంక నా పిల్లలు ఇంగ్లీషు మీడియంలోనే చదువుతున్నారు. మునిగితే అందరం కలిసే మునుగుదాం.
నా పిల్లలు గవర్నమెంట్ బడికి పోవడం లేదు. పోతున్న ప్రైవేటు స్కూలు ఘనంగా ఏమీ లేదు. అంటే టీచర్లు అందరూ మంచి డిగ్రీలు ఉన్నవాళ్లే. కానీ ఆ ఇంగ్లీషు వినగానే ఇది అయ్యేది కాదని మనకు అర్థమైపోతుంది. నాకిప్పుడు ఉద్యోగంలో ఎదగాలన్న లక్ష్యం లేదు. సొంతిల్లు కట్టుకోవాలన్న సంకల్పం లేదు. నా ఆరోగ్యం గురించిన చింత లేదు. ఈ చదువుల తీరు మాత్రం కలవరపెడుతోంది.
ఒక పది ఇరవై ఏళ్ల కిందట ఆ ఊరి సర్పంచ్ కొడుకూ, ఆ ఊరి సఫాయి కొడుకూ ఒకే బళ్లో చదివేవాళ్లు. ఏదో ఒక తలంలో రెండు భిన్న జీవితాలు సంపర్కం జరిగే అవకాశం ఉండింది. ఇప్పుడు ఇవి ఎప్పటికీ కలవనంత దూరం జరిగిపోతున్నాయి. ఒకే ప్రపంచంలో భిన్న ప్రపంచాలుగా మనుషులు బతికే ప్రమాదకరమైన వీలు ఏర్పడుతోంది. వాళ్లు పంపే స్కూళ్లు వేరు, మనం పంపే స్కూళ్లు వేరు. వాళ్లను కిందికి లాగాలని కాదు, కానీ మనం ఎప్పటికి వాళ్లదాకా ఎగబాకాలి? అందరికీ ఒకే రకమైన చదువు ఇవ్వగలిగే విద్యా వ్యవస్థ ఎందుకు లేకుండాపోయింది? అందుకే, నాలుగు లక్షల స్కూల్లో చదివినవాడు ‘మేనేజర్ ఇంగ్లిష్’ మాట్లాడితే, నలభై వేల వాడు ‘అటెండర్ ఇంగ్లిష్’ మాట్లాడేలా తయారవుతాడేమోనని నా భయం. అటు తెలుగూ రాక, ఇటు ఇంగ్లీషూ రాక కొత్తరకం నిరక్షరాస్యులుగా మన పిల్లలు తయారవుతారేమోనని నా దిగులు.
ఓసారి నేనూ, ఆనందూ ప్రెస్ క్లబ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైతే ఓ Biba నీళ్ల బాటిల్ చేతిలో పెట్టారు. అప్పుడు దీన్ని ఎలా పలకాలా అనే సందేహం వచ్చింది. బీబా, బైబా? అంటే దీన్ని ఎలా పలకాలో తెలిసినవాడిముందు మనం చిన్నబోయే సంభావ్యత యాభై శాతం. ఈ చిన్న చిన్న అవరోధాలనైనా దాటించగలిగే భాషాసామర్థ్యాలున్న ఉపాధ్యాయులు ఈ రెండు రాష్ట్రాల్లో ఎంతమంది ఉండింటారు?
వెయ్యేళ్ల వయసున్న తెలుగును, దానికన్నా మూడొందల యేళ్లు చిన్నదైన ఇంగ్లీషు ఆడించడం పలు రాజకీయాల పరిణామం. భాష, రాజకీయంతో ముడిపడిపోయింది కాబట్టి, ఇక వెనక్కి వెళ్లలేమని తెలుసు. ఇది ఇప్పుడు మొదలైందీ కాదు, ఇక్కడితో ఆగేదీ కాదు. ఆ ఆంగ్లేయులతో ఇంగ్లీషులో మాట్లాడగలిగే శక్తి వల్లే సమాజంలో పైకి ఎదిగినవాళ్ల నుంచే ఇది మొదలైంది. అదే ఇంగ్లీషుతో అమెరికాలకు విమానాల్లో ఎగిరిపోయినవాళ్ల వల్ల బలపడింది. వీళ్లందరినీ ఆయా తీరాలకు చేర్చిన శక్తిసామర్థ్యాలు నిజానికి వేరేవి కావొచ్చు. కానీ కొట్టొచ్చినట్టు కనబడేది ఇంగ్లీషు. ఇంక దాన్ని అందుకోవడానికి ఎవరు మాత్రం ఎందుకు ప్రయత్నించరు? ఇప్పుడు ఇంగ్లీషు అనేది కేవలం ఒక భాష కాదు, అదొక విలువ.
కానీ తెలుగంతే జనాభా ఉన్న జర్మనీ గానీ, తెలుగులో ఎనిమిదో వంతే జనాభా ఉన్న స్వీడన్ గానీ తమ భాషల్ని అంతర్జాతీయంగా ఎలా వెలిగేలా చేసుకుంటున్నాయో ఆలోచించగలిగే మేధావులు, మార్గదర్శకులు ఇన్నేళ్లుగా ఈ నేలమీద లేకుండా పోవడమే వ్యక్తిగతంగా నా దురదృష్టం. విలువలు అనేవి మనం ఇవ్వడం వల్లే వస్తాయి. ఆ విలువల్నే తారుమారు చేయగలిగే శక్తిమంతులు తెలుగువాళ్లలో ఎవరూ లేకపోవడమే ఆశ్చర్యం.
------------------------------------------------------------------------------
(బొమ్మ,
ఇంకా చిన్నగానే ఉన్న మా పెద్దోడు ఇంకా చిన్నప్పుడు వేసింది.)

ReplyDeleteSorry sir not related to this post.
ఈ రోజు సాక్షి లో ఏ బీ కే ప్రసాద్ అనే పనికిమాలిన మేతావి చైనాపై వ్రాసిన వ్యాసం చదివారా. ఇలాంటి దేశ హితం కోరని వాల్లు మేధావులా. చీ. చైనా దురాక్రమణ గురించి ఒక్క మాట వ్రాయకుండా పైగా పొగుడుతున్నా డు ప్రసాద్ సిగ్గులేకుండా.
ఏ దేశం లో ప్రజలకు మాట్లాడే ఓటు వేసే హక్కు లేదో ఆ దేశాన్ని మోయడానికి ఈ వామపక్ష పిశాచులను ఏమి చేసినా పాపం లేదు.
చైనా వైరస్ అమెరికా వల్ల వచ్చిందని పిచ్చి కూతలు వ్రాశాడు.
మన దేశానికి ఇలాంటి అంతర్గత శత్రువులు తోనే ఎక్కువ ప్రమాదం.