మీరు ఎప్పుడైనా ఒక రైతుబజార్‌కు వెళ్లారా? ఇరువైపులా రాశుల్లా పోసివున్న కూరగాయల్లో రత్నాలను దర్శించారా? కొత్తిమీర వాసన ముక్కుకు ఎలా తగులుతుంది? టమోటాలను చూస్తే ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా లేత ఆనిగెపుకాయను చూసినప్పుడు దాన్ని చేతుల్లోకి తీసుకోబుద్ధయిందా? దాన్ని గిచ్చకుండా ఉండటానికి వేళ్లను తమాయించుకున్నారా? రైతుబజార్ అంటే నగరానికి వచ్చిన పల్లెటూరు. కుప్పపోసిన వ్యవసాయ క్షేత్రం. గమనించండి, ఇంట్లో తాజా కూరగాయలు ఉన్నప్పుడు వంట కూడా ఉత్సాహంగా చేయాలనిపిస్తుంది. రైతుబజార్‌లో కూరగాయలు కొన్న, చూసిన అనుభవాలు ఈ రియాలిటీ చెక్‌లో. #RealityCheck #రియాలిటీచెక్ #పూడూరిరాజిరెడ్డి
No comments:
Post a Comment