ఈ పోస్టు పెట్టడమంటే ఓ విధంగా జాతినుద్దేశించి ప్రసంగించడం లాంటిది.
అయినా నాలుగు మాటలు పంచుకుంటాను.
అక్టోబర్ 13, 2007లో నేను తొలిసారిగా ఒక(అంటే ఇదే) బ్లాగు క్రియేట్ చేశాను. అయితే బ్లాగును క్రియేట్ చేయడం కోసం దాన్ని క్రియేట్ చేయలేదు. ఈనాడు ఆదివారం అనుబంధం కోసం బ్లాగుల గురించి ఒక కవర్ స్టోరీ రాయాల్సి వచ్చింది. అసలు బ్లాగు అంటే ఏమిటో, ఎలా చేయాలో తెలియకుండా రాయడమేంటని అనుకుని తెలుసుకోవడానికి మొదటిసారి బ్లాగు రాశాను. దాన్ని మసనోబు ఫుకుఓకాకు అంకితం చేస్తూ ఆయన గురించి రెండే మాటలు రాశాను, నాకు వచ్చీరాని ఇంగ్లీషులో. కవర్ స్టోరీ "బి అంటే బ్లాగు' రాసేశాక, ఇంకంతే! దాన్ని అలాగే వదిలేశాను.
మళ్లీ "సాక్షి'లోకి వచ్చాక, ఓహో, ఈ బ్లాగును నేను కంటిన్యూ చేయొచ్చు అనిపించింది. కాని అప్పటికి కూడా నాకు నిజంగా బ్లాగును ఎలా మెయింటెయిన్ చేయాలో తెలియదు. అందుకే కుప్పలుతెప్పలుగా రెండు మూడురోజుల్లోనే నా పాత పేపర్ కటింగులన్నింటినీ ఇందులో నింపేశాను. నాకు సంబంధించిన ముఖ్యమైనవన్నీ ఒకేచోట ఉండాలి, అనుకుని అలా చేశాను.
బ్లాగు స్టార్టు చేసిన ఎప్పటికో నేను కూడా "కూడలి'లో చేరొచ్చని అనిపించింది(కొన్ని తెలిసినవి కూడా తెలియనట్టే ఉంటాయి. అంటే స్ట్రయిక్ అవడం అంటారే అలాంటిది). అప్పుడు నేను దాని ఎడిటర్ గారికి ఈమెయిల్ రాస్తే, మీవన్నీ పిక్చర్ మెసేజెస్, పైగా ఇంగ్లీషు టైటిల్స్ ఉన్నాయి, కనీసం శీర్షికలనైనా తెలుగులోకి మార్చండి, కనీసం ఇకనుంచి పెట్టేవైనా అన్నారు. అలాగేనన్నాను.
లేఖినితో తిప్పలు పడుతూ చాలావరకు శీర్షికలు మార్చాను(ఇంకా ఈజీగా తెలుగులో రాయువిధము ఈమధ్యే తెలుసుకున్నాను).
మళ్లీ-
నేను అరుదుగా వేరే వాళ్ల బ్లాగులు చూస్తుంటాను. ఎప్పుడైనా చూస్తే వాళ్లు ఈ మధ్యే స్టార్ట్ చేసినట్టు ఆర్కైవ్స్-ను బట్టి అర్థమవుతూ ఉంటుంది. కాని ఒక్కొక్కరికి ఇరవై ముప్పయి మంది ఫాలోవర్సు ఉంటారు. అరే, నిజానికి నేను చాలా సీనియర్నే వీళ్లతో పోల్చితే అనుకుంటాను. తర్వాత్తర్వాత అర్థమైంది ఏమిటంటే, నేనేదే ఇందులో పోస్టు పడేసి వదిలేశాను తప్ప, ఈ నెట్వర్స్క్-లో చేరలేదు. మరి మన బ్లాగు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? అప్పటికి మేల్కొని ఆ మధ్య హారంలో, నిన్న మొన్న జల్లెడలో సభ్యుడనైతి.
ఇందుమూలంగా చెప్పబోయేదేమిటంటే, నా లొల్లిని వీలైనంత ఎక్కుమంది దగ్గరకు చేర్చే మార్గాలను నేను చాలా చాలా ఆలస్యంగా తెలుసుకున్నానూ, అని. నాకంటే ఆలస్యంగా బ్లాగింగ్ స్టార్ట్ చేసినవాళ్లు నాకంటే ముందే ఇవన్నీ తెలుసుకునేశారని కుల్లుగా ఉందీ, అని.
ఇంకా ఇంకా చెప్పబోయేదేమిటంటే- నాకు ఇప్పటికీ బ్లాగు గురించిన పూర్తి అవగాహన రాలేదూ, అని. బ్లాగు గురువుల సహకారంతో కొద్దికొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానూ, అని.
చివరిమాట.
2009 గాంధీజయంతి రోజు గణాంక కౌంటర్ పెట్టాను. ఈ పదివేల హిట్స్ ఎప్పుడయితే అప్పడు ఈ కడుపుబ్బు తీర్చుకోవచ్చు కదాని ఎదురుచూస్తున్నాను. ఇవ్వాళ వచ్చి ఓపెన్ చేయగానే పదివేల ఒకటి కనబడింది. పదివేల హిట్ మరి ఎవరిదో! వారి కీబోర్డుకు నా ముద్దులు.
-పూడూరి రాజిరెడ్డి.
:) అభినందనలు.
ReplyDeletecongrats
ReplyDeleteCongrats :)
ReplyDeleteఈ counter ఎలా పెట్టాలి?? చూసారా నేను మీ కన్నా వెనకున్నాను...
ReplyDeleteCongrats...and happy blogging :)
ReplyDeletehmmmmm. అలాగే మరో విషయం. మీ ఇంట్లోనే (అదేనండి బ్లాగు)రాసి కూర్చోకుండా అప్పుడప్పుడు టైమ్ తీసుకుని ఇరుగిల్లు పొరుగిల్లు రౌండేసి పలకరిస్తే ఇంకా ఎక్కువమంది ఇక్కడికి వస్తారు. వచ్చినవాళ్లే చాలనుకుంటే ఏమి చేయలేం. ప్చ్. మరి పార్టీ ఏది.. ఉత్తత్తి మాటలేనా?? :))
ReplyDeleteఅభినందనలు. పదివేల మైలు రాయి దాటేశాను కదా అని విశ్రాంతి తీసుకోకండి... వ్రాస్తూండండి...
ReplyDelete@శిశిర, ఎనానిమస్, వీకెండ్ పొలిటీషియన్, నాగార్జున:
ReplyDeleteఅందరికీ వందనములు, ధన్యవాదములు.
@ప్రమిద:
మీ ఆర్కైవ్స్ చూస్తుంటే మీరు నా సమకాలీనురాలు. సో, నేను కూడా కొందరికి బ్లాగు గురించి చెప్పే అవకాశం ఉంది.
అయితే కౌంటర్ మాత్రం నా ఫ్రెండు ఏర్పాటుచేశాడు, నియోవర్క్స్-సైట్ నుంచి. చాలా ఈజీనే అనిపించింది, అప్పుడు.
@జ్యోతి:
తప్పకుండా. ఇకనుంచీ ఇంట్లోనే కూర్చోకుండా, "బ్లాకింగ్'కెళ్తుంటా.
@గీతిక:
ఓకే ఓకే. థాంక్యూ.
బ్లాకింగ్... ఈ పదం భలే ఉందే.. వీవెన్ కి చెప్పి బ్లాగు పదకోశంలో చేర్చమనాలి..:)))
ReplyDeletecongrats :) :)
ReplyDeleteHi Rajireddy!
ReplyDeleteLet me say CONGRATS on this jubilant occasion.
Whenever time permits, I usually step into your farm to relax. You designed it very nicely. It shows your fine taste. So also, the beauty in the writing style which your pen possess, nowadays its a rare thing to find. Keep it alive and develop carefully. Expecting many more articles and stories with a social touch from your side in future.
And, sometime back I wanted to comment on your blog. But it didn't allowed. Don't know, why? Now, this time it worked. Happy. Thank you. Bye.
@పరిమళం:
ReplyDeleteథాంక్యూ.
@నాగ్:
హాయ్ నాగ్. అన్నింటికీ కలిపి ఒకటే- పే..ద్ద థాంక్యూ.
కామెంటు పడలేదని ఇంతకుముందు కూడా ఒకరిద్దరు అన్నారు. బహుశా మాడరేషన్లో పెట్టడం వల్లో ఏమో, ఇప్పడు దాన్ని తీసేశాను. నైస్ స్పీకింగ్ టు యు.
congrats. Thumbs up.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteme blog oka kothaga pellaina ammayilaga undi. anduke okasari vachina vallu malli malli vasthunnaru.
ReplyDeletecongrats for 10001
@ హెచ్చార్కె:
ReplyDeleteథాంక్యూ సర్.
@ప్రకాశ్:
మిత్రమా, నీ సొగసైన కామెంటుకు థాంక్యూ.