Pages

నేను ఈ ప్రపంచాన్ని రెండు రకాలుగా విభజిస్తున్నా. నాలా ఉండగలిగేవాళ్లు, నాలా ఉండలేనివాళ్లు.

Monday 17 October 2011

వాస్తు

అటెల్ సాహెబ్ ఇంటి ప్రహారీ
ఆదుర్రు మల్లారెడ్డి క్యాష్ కౌంటరు
సరోజనమ్మ వంటగది
నిరంజనయ్య పూజగది
రంగారావుగారి చేదబావి
రాజాసుందరంగారి ఆఫీసుతావు
ఏవీ వాస్తుకు లేవంట.
అందుకే వాళ్లెవరికీ బాగాలేదంట.
అదిగందుకే వాటిని కూల్చేస్తున్నారంట.

నిజానికి-
ఈ ప్రపంచమే నాకు వాస్తుకు లేదనిపిస్తోంది.
దీన్ని కూడా చాలా చోట్ల కూల్చెయ్యాలి.
చాలా చాలా చోట్ల తిరిగి నిర్మించాలి.

3 comments:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

శెభాష్! ఏం చెప్పారు రెడ్డి గారూ!

bondalapati said...

"ఈ ప్రపంచమే నాకు వాస్తుకు లేదనిపిస్తోంది.
దీన్ని కూడా చాలా చోట్ల కూల్చెయ్యాలి.
చాలా చాలా చోట్ల తిరిగి నిర్మించాలి."
Golden words indeed!Punch dialogues.

Poodoori Raji Reddy said...

@చె.దె.పూ.దం.& బొందలపాటి:
థాంక్యూ వెరీ మచ్.

Post a Comment

Get Flower Effect