కొన్ని రోజుల క్రితం దాకా, బ్లాగ్-కు సంబంధించిన స్టాట్స్ చూసుకోవడం గురించి నాకు అవగాహన లేదు.
ఓహో... ఈ కౌంటింగ్ ఫెసిలిటీ ఉందని నేను గుర్తించాక, నా రీడర్స్ కౌంటర్ తీసేశాను. ఇంకెందుకు?
అయితే, ఇక్కడో నాకో పిచ్చిలాంటిది తగులుకుంది. ఏయే దేశాలవాళ్లు నా బ్లాగు చదువుతున్నారని?
సహజంగా అందులో ఇండియావాళ్లు ఉంటారు. అమెరికా వాళ్లు కూడా ఉంటారు. ఆస్ట్రేలియా వరకు ఓకే అనుకుందాం. ఏ యూకేలోనో, సౌదీ అరేబియాలోనో కూడా మన తెలుగువాళ్లు ఉంటారంటే నమ్ముదాం
ఇప్పుడు ఈ కింది దేశాల జాబితా చూడండి.
ఇవి నేను కొన్ని వారాలుగా సేకరిస్తున్న పేర్లు. నిజంగా ఇన్ని దేశాల్లో మన తెలుగువాళ్లున్నారా? లేకపోతే ఈ క్లిక్స్ నమోదు కావడానికి ఇంకేమైనా మార్గాలుంటాయా?
లేకపోతే ఏమిటి? అర్జెంటినానుంచి చదవడమా? స్వీడన్ నుంచి చదవడమా?
గ్రీస్, నైజీరియా, కొలంబియా, స్విట్జర్లాండ్, ఖతార్, డెన్మార్క్... ఈయా దేశాల్లో తెలుగువాళ్లు ఉండటమే ఒకెత్తయితే, అందరూ మన బ్లాగు చూడాలని లేదుకదా. ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది.
Argentina
Australia
Bahrain
Belgium
Brazil
Canada
Colombia
Denmark
Finland
France
Germany
Greece
Hongkong
India
Ireland
Japan
Kuwait
Latvia
Malaysia
Mexico
Netherlands
Nigeria
Norway
New zealand
Oman
Poland
Qatar
Russia
Saudi Arabia
Singapore
South Korea
Sweden
Switzerland
Thailand
Ukraine
United Arab Emirates
United Kingdom
United States of America




8 comments:
Your list seems to be very normal :)
Norway entry is mine.
I read all your posts published in 2011.
దీనిలో అసాధారణమేమీ లేదు. ఎందెందు వెదికిన అందందు కలరు మన తెలుగు సోదరులు.
@రామిరెడ్డి గారు:
అంతేనంటారా! మీ సమాధానాన్ని బట్టి ఇంకా చాలా దేశాల్లో మనవాళ్లు ఉన్నట్టు, ఉండటమే కాదు బ్లాగులు చదువుతున్నట్టు అనిపిస్తోంది.
@ప్రబంధ్ గారు:
ఓహో.ఇలా తెలుసుకోవడం బాగుంది. మీ పేరు, ఇంటిపేరు రెండూ బాగున్నాయి.
@చె.దె.పూ.దం.:
కేవలం హిట్స్ అనబడే అంకెల రూపంలో కాకుండా వాళ్ల పేర్లుగా వాళ్లను తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుందేమోనని చిన్న ఆశ.
రాజి రెడ్డి గారు...ఫీడ్జి జిత్ పెట్టుకొండి....యె యె దెశాల నుండి
చూస్తున్నారొ మీకె తెలుస్తుంది.మీ బ్లాగ్ యెవరు చూస్తున్నారొ నాకె బాగ తెలుసు.మరి అంత జ్ఞానం ఇక్కడ ఉంది మరి.....
రాజిరెడ్డిగారు..
ఇందులో ఆశ్చర్యమేముంది?
ప్రవాసాంధ్రులకి అంతర్జాలమే కదా అంబెలికల్ కార్డ్.
నేనయితే ట్రాకింగులకి వ్యతిరేకం.
ఏ దేశం, ఏ ప్రాంతం నుండి ఎందరు ఎంతసేపు చూస్తున్నారో తెలుసుకుని మనం పొందే ఆనందమేమి!
అదో టైం వేస్ట్.
మన తెలుగు వాళ్ళు ఇన్ని దేశాలలో ఉద్యోగాలు దోచేస్తున్నారన్నమాట....!
( వేరే చోట ఉద్యోగం చేయడమంటే.. దోచేయడమేనటగా....)
@శశికళ:
మీరు చెప్పిందేమిటో నాకు తెలియదుగానీ, ఇప్పుడు కూడా తెలుస్తోంది.
@రమణ:
రమణ గారు, బొడ్డుతాడు గురించి బాగా చెప్పారు.
కొన్ని సార్లు టైమ్ వేస్ట్ చేయడంలో కూడా ఆనందం దొరుకుతుందనుకుంటా. లేదూ, ఆనందం దొరుకుతుంది కాబట్టే టైమ్ వేస్ట్ చేస్తామేమో:-)
@జాన్:
థాంక్స్ ఫర్ ద కామెంట్.
Post a Comment