ప్రతి వ్యక్తి జీవన గమనంలో నాటకీయ మలుపులు ఉండవు. ఎదురొచ్చిన
జీవితాన్ని యథాతథంగా స్వీకరించి, తృప్తిగా కాలం గడపడమూ చెప్పుకోదగిన అంశమే! పూడూరి
రాజిరెడ్డి రాసిన 12 కథల సంకలనంలోని ఖచింతకింది మల్లయ్య ముచ్చట’ అటువంటి
జీవితాన్నే పరిచయం చేస్తుంది. అంతర్లీనంగా కుటుంబ బాధ్యతలను నెరవేర్చి, ఆర్థిక
భరోసా అందించిన మల్లయ్య తీరుని వివరిస్తుంది. కథల్లో విభిన్న ఆలోచనలూ, సమాజ
పరిశీలనా కళ్లకు కడతాయి. కొన్నింటిలోనైతే ఆలోచనలు ప్రవాహంలా సాగుతాయి. ఓ కథలో
రియల్ క్లైమాక్స్ రాయడం కొత్తగా ఉంది. మరణ లేఖలు, తమ్ముడి మరణంఖ1’ లోని భావాలూ
ఉద్వేగాలూ మనసుల్ని కదిలిస్తాయి. భాష, కథనశైలి ఆద్యంతం చదివింపజేస్తాయి.
చింతకింది మల్లయ్య ముచ్చట -
ఇతర కథలు
రచన:
పూడూరి రాజిరెడ్డి
పేజీలు: 154;
వెల: రూ.144/
ప్రతులకు:
ప్రధాన పుస్తక కేంద్రాలు
-భద్రగాయత్రి
(ఈనాడు ఆదివారం అనుబంధంలో 19 నవంబర్ 2017 నాడు వచ్చిన పుస్తక పరిచయం.)
No comments:
Post a Comment