2017 ఫిబ్రవరిలో
జరిగిన కేంద్ర సాహిత్య అకాడమీ సమావేశాల్లో, యంగ్ హార్వెస్ట్ పేరుతో జరిగిన కార్యక్రమానికి
తెలుగు తరఫున నేను హాజరయ్యానని మీలో కొందరికి తెలిసేవుంటుంది. అక్కడ చింతకింది మల్లయ్య
ముచ్చట కథను ఇంగ్లీషులో చదివాను. దీన్నిThe Hero of a Non Story పేరుతో చింతపట్ల సుదర్శన్
గారు అనువదించి ఇచ్చారు.
అయితే అకాడమీ
వాళ్లు తమ అన్ని సమావేశాల వీడియోలను యూట్యూబులో ఉంచారని విన్నాను గానీ పట్టించుకోలేదు.
ఆ రోజు సమావేశాల అనంతరం మణిపురి వాళ్లు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనల వీడియో కోసం మొన్నెందుకో
గుర్తొచ్చి వెతికితే, సహజంగానే మా వీడియో కూడా తగిలింది. అరే, నన్ను నేనే పట్టించుకోవడం
మానేసినంత బాధేసి, దాన్ని ఇక్కడ షేర్ చేస్తున్నా.
మొత్తం యంగ్
హార్వెస్ట్ ప్రోగ్రాములో 22 భాషల వాళ్లు పాల్గొన్నారు. అందులో నలుగురు ఉపన్యాసాలు ఇచ్చారు,
నలుగురం కథలు చదివాము, మిగిలినవాళ్లందరూ కవితలు వినిపించారు.
మా సెషన్లో నాతోపాటు
కథలు చదివినవాళ్లు బెంగాలీ(Sayantani Putatunda), సింధీ(Komal Dayalani) అమ్మాయిలు
ఇద్దరూ, ఒక పంజాబీ(Pargat Singh Satauj) అతనూ. నా నంబరు మూడు. ఈ
సతౌజ్, నేనూ ఆ రెండ్రోజులూ రూమ్ కూడా పంచుకున్నాం. రెండో రోజు ఈ కోమల్, సతౌజ్ తో పాటు
మరికొందరం కలిసి ఢిల్లీ తిరిగాం.
ఈ వీడియో సుమారు
మూడు గంటలుంది. మా సెషన్ మొదటి గంటన్నర. మా తర్వాతి కవితా పఠన సెషన్ కూడా ఇందులోనే
కలిపారు. మొదటి నాలుగు నిమిషాలు ఉమ్మడి
పరిచయ కార్యక్రమం. 40:00 నుంచి 1:05:00 మధ్య నాది ఉంది.
ఇక నా కథా పఠనం
నవ్వు తెప్పిస్తే దానికి మీరు కూడా బాధ్యులే.
No comments:
Post a Comment