పది నెలల కింద,
అంటే 5 డిసెంబరు 2017 నుంచి, ఆకాశవాణి హైదరాబాద్ 'ఎ' కేంద్రం నుంచి ‘రియాలిటీ చెక్’ 13+4 వారాల పాటు ధారావాహికగా ప్రసారం అయింది. ప్రతి మంగళవారం రాత్రి 8:30కు రియాలిటీ చెక్: హైదరాబాద్ గాథలు పేరిట ఇది వచ్చింది. నిడివి సుమారు పన్నెండు నిమిషాలు.
పుస్తకాన్ని, పాఠకులుగా చదువుకోవడం
వేరు; అవసరమైతే ఓసారి వెనక్కి వెళ్లి చూసుకోవచ్చు; కానీ వింటున్నప్పుడే వేరే; అక్కడ
దృష్టి(చెవి) పెట్టకపోతే మళ్లీ వినే వీలుండదు. అందుకే, అరవై అంశాలున్న రియాలిటీ చెక్ పుస్తకంలోంచి మళ్లీ వెనక్కి వెళ్లి ఏం రాసివుంటాడో
చూడనక్కర్లేనంత సరళంగా ఉన్నవే చదవడానికి ఎంచుకోవడానికి ప్రయత్నించాను.
ఇది వచ్చిన నాలుగు నెలల పాటూ
మా ఇంటివరకూ పండగలా ఉండేది. నా గొంతు నాకే ఇంకెవరిదో వింటున్నట్టుగా కూడా అనిపించేది.
ఇంకో విషయం: నాది ప్రొఫెషనల్ గొంతు కాదు కాబట్టి, ఆ తేడా తెలిసిపోతుంది. ఆ ప్రొఫెషనల్
గొంతు కాకపోవడమే ఇవి చదవడానికి మరీ నప్పింది, అన్నవాళ్లున్నారు.
13+4 ఎందుకూ అంటే, ముందు పదమూడింటికే
అనుకొని, మళ్లీ నాలుగు అదనంగా చదవమన్నారు. అప్పుడు వాటిని నేను కాకుండా దక్షిణామూర్తి
గారు చదివేశారు.
ఇక ఆ చదివిన భాగాల్లో తొమ్మిదింటిని “రియాలిటీ చెక్: హైదరాబాద్ గాధలు’ పేరిట యూట్యూబ్ లో ఉంచారు ఆకాశవాణి వాళ్లు. వాటిని
వినే ఆసక్తి ఉన్నవాళ్లకోసం ఆ లింకు కింద ఇస్తున్నాను.
No comments:
Post a Comment