Tuesday, July 20, 2010

దొంగలు పడిన ఏడున్నర నెలలకు (రెండో ఆర్య గురించి... )అప్పుడెప్పుడో(అంటే పైన చెప్పినట్టు ఏడున్నర నెలల కింద)రాసిందిది. తవ్వకాల్లో ఈరోజే బయటపడింది.
ఆర్య-2 గురించి ఇప్పుడు మాట్లాడటం అసందర్భమే కావొచ్చు. కానీ నేను రాసిన ప్రతిదాన్ని ఒక రికార్డుగా పెట్టడానికి కూడా ఇక్కడ పోస్టు చేస్తున్నా.
మై లవ్ ఈజ్ గాన్... రంజీత్ గొంతు ఇంకా చెవుల్లో ఉందబ్బా!

21 comments:

 1. కావొచ్చు, కావొచ్చు, కావొచ్చు.
  కానీ కాదు, కాదు మరియూ కాదు :)

  ReplyDelete
 2. ఏది మూడుసార్లు కావొచ్చు?
  ఏది మరో మూడుసార్లు కాకపోవచ్చు?

  ReplyDelete
 3. అబ్బ, అవన్నీ నేను లెక్క పెట్టుకుంటూ కూర్చున్నానా ఏంటి? మీరే ఏదో అది కావొచ్చు, ఇది కావొచ్చు, ఇంకోటి కావొచ్చు అన్నారు కదా, వ్యాసంలో! అవే (మూడో, ముప్ఫై మూడో) కావొచ్చు, కానీ కాదు అని నా కవిహృదయం!! :)

  ReplyDelete
 4. బ్లాగ్ హెడర్ లో ఫొటో చూడ్డానికైనా మీ బ్లాగుకు రోజుకోసారి రావాల్సి వచ్చేట్టుంది.

  ఆర్య 2 కాన్సెప్ట్ గురించి ఇంత చక్కగా రాసింది మీరేనేమో! కానీ ఇంత చక్కని కాన్సెప్ట్ ని మామూలు ప్రేక్షకుడికి అందేలా ప్రెజెంట్ చేయలేకపొవడమే సినిమా పోవడానికి కారణం అనుకుంటాను!

  ReplyDelete
 5. మీరన్ని చెబుతున్నారుగానీ ఆ సినిమా కి అంత సీను లేదేమోనండీ.

  ఆ సినిమా చూసాక నాకెలా అనిపించిందంటే ఇంతటి అవకతవక అస్థవ్యస్థ సినిమా నేనెప్పుడూ చూడలేదు అని.

  సుజాత గారు చెప్పినట్టు బహుశా సరిగ్గా ప్రజంట్ చెయ్యలేదేమో.

  మీరు చెప్పిన కాన్సెప్టు అయితే చాలా బావుంది.

  ReplyDelete
 6. @కొత్తపాళీ:
  ఓహో, ఇలా అంటున్నారా?
  కానీ ఇప్పటికీ కవి హ్రుదయం నాకు స్పష్టంగా అర్థంకాలేదు. అంటే మీరు నా కాన్సెప్టుని నిరాకరిస్తున్నారా? సినిమాను నిరాకరిస్తున్నారా? సినిమాను నిరాకరించడం వల్ల కాన్సెప్టును నిరాకరిస్తున్నారా? ఇంకా వేరే ఏదైనా?

  @ సుజాత:
  1.ఫొటో మీకు అంత నచ్చిందా? థాంక్యూ. వెల్-కమ్.
  2.మీ పొగడ్తకు ఉబ్బిపోతున్నా. ప్రెజెంట్ చేయలేకపోయాడు, అని నేనయితే అనుకోవట్లేదు. మనిషిలో ఉన్న గందరగోళం(కాన్సెప్టులో కాదు) అర్థం చేయించడం అంత సుళువు కాదనుకుంటాను.

  @ సౌమ్య:
  1. నాకు సీను ఉందనిపిస్తోంది. కానీ మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను.ఆ అవకతవక అనేది కూడా మానసిక సంచలనం తాలూకుదే. ఇది నేను చెయ్యను, అంటూనే కొన్నిపనుల్ని ఆర్య చేస్తుంటాడు.
  2. ప్రెజెంటేషన్....పైన చెప్పిందే.
  3. థాంక్యూ వెరీ మచ్.
  4. మీ పేరుకు ముందు ఆ. ఏంటి?

  ReplyDelete
 7. మీరు చెప్తుంటే చాలా బాగుంది...కానీ సినిమా చూస్తే అలా అనిపించలేదు.

  ఆ. అంటే ఆలమూరు మా ఇంటి పేరు.

  ReplyDelete
 8. థాంక్యూ థాంక్యూ.

  ReplyDelete
 9. ఓహ్.. రెండో ఆర్య అభిమానుల్లో నాతో పాటు ఇంకొకరున్నారన్నమాట. నిజానికి మొదటి అరగంట మినహాయిస్తే మిగతా సినిమా అంతా నాకు చాలా బాగా నచ్చింది. నచ్చడమంటే మామూలుగా కాదు ఒక నాలుగైదు రోజులు ఆర్య కేరెక్టరే వెంటాడింది. రెండు పరస్పర విరుద్దాలైన ఆలోచనల్ని అధిగమించలేక, అణచుకోలేక ఒకే సమయంలో రెండిటినీ వ్యక్తపరుస్తూ ఆర్య తో చేయించిన నటన, ఆ సందర్భాలని ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంటాయి. చాలా సంక్లిష్టమైన ఇలాంటి ఫీలింగ్స్ ని ఇంతకంటే బాగా చెప్పలేమేమో అనిపించింది.

  ఇక "మై లవ్ ఈజ్ గాన్" సాంగ్, ఎప్పుడు గుర్తొచ్చినా ఆ గొంతులో ఉన్న తడి తగులుతూనే ఉంటుంది. కాని పాట సాహిత్యమే సిరివెన్నెల అయితే ఇంకాబాగా రాసుండేవారనిపిస్తుంది నాకు విన్నప్పుడల్లా, అది చంద్రబోస్ రాసారనుకుంట.

  ReplyDelete
 10. ఇందు మూలంగా అందరికీ తెలియజేయడమేమనగా... ఆర్య2 నాకు పిచ్చపిచ్చగా నచ్చిన సినిమా. మొదటిసారి చూసినప్పుడు ఇదేంట్రా బాబూ ఇలా ఉందనిపించింది. రెండోసారి మా ఆవిడతో కలిసి తప్పక చూడాల్సొచ్చింది. ఇస్టోరీ తెలిసిపోయింది కాబట్టి సీన్ల మీద కాన్సంట్రషను జేశాను. ‘అరే, భలే ఉందే’ అనిపించింది. సినిమాలో అల్లుఅర్జున్ కంగాళీగా ప్రవర్తించిన ప్రతిసీన్ తర్వాతా ‘ఎందుకలా’ అనే విషయాన్ని చెప్పేలా తర్వాత సీన్ ఉంటుంది. బలే ఇంటిలిజెంటు స్క్రీన్ ప్లే.

  మొత్తానికి ఏతావాతా నేన్జెప్పొచ్చేదేంటంటే సుకుమార్ బలే ఇంటిలిజెంటు డైరెక్టరు. కాకపోతే ఆర్యలో లేని శాడిజం కొంత రెండో ఆర్యుడిలో కనపడుతుంది(బలవంతంగా పచ్చబొట్టు వేయించే సీను, కారుకి యాక్సిడెంటు జరిగి బ్రిడ్జి మీద నుంచి నవదీప్ కిందపడిపోతుంటే పట్టుకుని కాసేపు ఏడిపించి పైకిలాగే సీను తదితరాల్లో).

  జనానికి నచ్చని ఇంకో పాయింటు ఏంటంటే... ఆర్యలో శివబాలాజీ అల్లుఅర్జున్ ఫ్రెండు గాదు. ఎవడో గొట్టంగాడు. పైగా వాడి ఫ్యామిలీ బ్యాగ్రౌండు శానావీసెడు దరిద్రం. అక్కడ ఆణ్ని బోల్తా కొట్టించి హీరోయిన్ను దక్కించుకుంటే ఆ హీరోయినేదో మనకే దక్కినంత ఆనందం.

  ఆర్య2లో నవదీప్ స్వయానా ఫ్రెండు. వాడి ప్రేమ నిజమా కాదా అన్నది పక్కన పెడితే... ఫ్రెండు ప్రేమించిన అమ్మాయిని పటాయించాలనుకోవడం యాంటీ సెంటిమెంటు. అక్కడే సినిమా దెబ్బ కొట్టేసింది.

  యాంటీ సెంటుమెంటు విషయాన్ని పక్కనపెట్టి చూడగలిగితే......

  యావండోయ్ మళ్లీ జెప్తున్నా, ఇది బలే ఇంటిలిజెంటు స్క్రీన్ ప్లే.
  సుకుమార్ బలే ఇంటిలిజెంటు డైరెక్టరు.

  ReplyDelete
 11. ఏందో, కామెంటు రాయబోయి పెద్ద టపానే రాసేసినట్టున్నా :)

  ReplyDelete
 12. ఆ "అర్థం చేయించడాన్నే" నేను ప్రెజెంట్ చేయడం అన్నాననుకుంటాను! మొదటిసారి ఒక వోల్వోబస్సు ప్రయాణంలో పరసీ సీడీ సగం సగం చూశాక, ఇదేదో మళ్ళీ చూడాల్సిన సినిమాయే అనుకుని తర్వాత మళ్ళీ చూశాను. మొదటి సారికంటే క్లారిటీ వచ్చింది.

  ప్రేక్షకుల అదృష్టమేమిటంటే ఈ పాత్రకి ( సీక్వెల్ అంటే అర్జునే ఉంటాడనుకోండి)ఏ నితిన్ నో తీసుకోకుండా,అర్జున్ ని తీసుకోవడం. చాలా ఈజ్ తో చేస్తాడు అర్జున్.

  నిజంగా చాలా ఇంటలిజెంట్ స్క్రీన్ ప్లే!

  ఇంతకీ రాజిరెడ్డి పేరు వెనక కారణమేమిటో చెప్పారు కాదు. సుకుమార్ మీ చుట్టం కాదు కదా! :-))

  ReplyDelete
 13. @3జి:
  మీ కామెంటుకు థాంక్యూ.
  ఆ పాట రాసింది చంద్రబోసే. కాని ఇది బాగాలేదనడానికి లేదు. ముఖ్యంగా, ఓటమి, చీకటి లాంటి నెగెటివ్ ప్రతీకలను పాజిటివ్-గా స్వీకరించడం, మౌనం బాగుందనడం... బాగుంది.

  @బాలు:
  కామెంటు పెట్టబోయి, పెద్ద టపా పెట్టినా, మంచి టపా పెట్టారు.
  మీరు చెప్పిన యాంటీ సెంటిమెంటు కోణం కూడా ఆలోచించదగిందే.

  కాకపోతే ఒకటే సమస్య. అందరికీ మీలా రెండోసారి బలవంతంగా చూడాల్సిన అవకాశం రాదే!

  @ సుజాత:
  మీరన్నదీ కరెక్టే. అయితే నేనన్నది ఏమిటంటే, ఇలాంటి సబ్జెక్టుల్ని ఇంతకంటే ఇంకా ప్రెజెంట్ చేయడం (ఇంకోలా చెప్పాలంటే, అరటిపండు ఒలిచి...) సాధ్యం కాదనుకుంటాను.

  ఆ పేరు ఎందుకు పెట్టారో నాకు మాత్రం ఏం తెలుసు? సుకుమార్ గారినే అడగాలి.

  ReplyDelete
 14. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ప్రతీ ఫ్రేములోనూ, సీనులోనూ సుకుమారే కనిపించాడు నాకు. అర్జున్ ఇంత బాగా నటించగలడా అని కూడా నిపించింది. ;-) సినిమాలో ఉన్న ప్రతీ సీనూ, ఒక్కో క్యారెక్టర్ ప్రవర్తన వెనక చాలా ఆలోచన ఉందనిపించింది. అసలు ఇన్ని తెలుగు సినిమాలు చూసాక ఇంకా, రాయలసీమ ఫ్యాక్షన్ ఇష్యూ ని ఇంతందంగా కథకి వాడుకోవచ్చని ఈ సినిమా చూసాకే తెలిసింది. I completely agree with your view on this film. ఇప్పటిదాకా ఈ సినిమా గురించి అచ్చం నాకు అనిపించినట్టే చెప్పింది మీరొక్కరే! It feels nice :-)

  ReplyDelete
 15. థాంక్యూ.
  మీ కాంప్లిమెంటు కూడా నైస్.

  ReplyDelete
 16. Ragi reddy garu... ఆర్య 2 కాన్సెప్ట్ బాగా రాసారు, సుకుమార్ కదా ఒక్కటే కాక సాహిత్యన్ని కూడా విలువిచ్చారు "అడిగినవన్నీ కాదనకుండా పంచేస్తూనే... మరు నిముషములో అలిగే పసివాదివిలె" this single line present his character over entire movie... I love the film.

  Good review (or your views on cinema).

  - Ramesh

  ReplyDelete
 17. రమేష్ గారు,
  థాంక్యూ వెరీ మచ్.

  ReplyDelete
 18. Cinema nachhindi annanduku chala mandi nannu tittaru. Naaku cinme baaga nachindi, Evo konni scens tappinchi.

  Raji Reddy garu, meeru chala baaga rasaru.

  ReplyDelete
 19. Arya movie lo vunna feel arya2 lo miss ayyindi emo anipistundi movie first time chustunte..

  Konni scenes matram superb..Guppedanta prema song picturization..second half lo arya character ni postive ga chupiyyatam kosam konni scenes compromise ayyademo anipistundi..anways..as mentioned by most of us here..my love is gone also superb...

  ReplyDelete
 20. Thnx for ur posts Kumar garu.
  నాకు ఆర్య కంటే రెండో ఆర్యనే మంచి సినిమా అనిపిస్తోంది. పాతదాన్లోని క్యారెక్టర్ లాంటిది భూమ్మీద ఉండదు. పైగా ఆ ఇద్దరి మధ్యలోకి వెళ్లి, మీరు ప్రేమించుకోండి, నేనిక్కడ ఉంటే ఏమవుతుంది? తరహా శాడిజం కూడా అందులో ఉంటుంది.

  ReplyDelete
 21. ఆహ..! ఈ సినిమా నచ్చిన వాళ్ళు ఇంత మంది ఉన్నారా..

  ReplyDelete