Monday, August 23, 2010

వర్తమాన తెలుగు కథ-2009



2009లో వచ్చిన ఉత్తమ కథలను తిరుపతికి చెందిన అభినవ ప్రచురణలు సంపాదకుడు సాకం నాగరాజ సంకలనం చేశారు. ఈ తరహాలో వారి నుంచి ఇది తొలి ప్రయత్నం. ఇందులో నా కథ చింతకింది మల్లయ్య ముచ్చట కూడా చోటు చేసుకుంది. దీనికోసం నేను మొట్టమొదటిసారిగా తిరుపతికి వెళ్లాల్సివచ్చింది. రెండ్రోజులు జీవితాన్ని మరింతగా విస్తరించుకున్నట్టు అనిపించింది. ఒకట్రెండు క్వాలిటీ పరిచయాలు జరిగాయి.
ఫొటో రైటప్... ఎడమనుంచి వరుసగా: మహమ్మద్ ఖదీర్ బాబు, దగ్గుమాటి పద్మాకర్, బి.చంద్రశేఖర్, వేంపల్లి షరీఫ్, పూడూరి రాజిరెడ్డి, సాకం నాగరాజ, తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి, బి.వినోదిని.

2 comments:

  1. Anonymous23.8.10

    ఈ సభలో ఎవరు ఏమేం మాట్లాడారూ, ఏది ఆసక్తి కరంగా సాగిందీ వంటి వివరాలిస్తే బావుండేది. ఇటువంటి సభావార్తల్ని పత్రికల్లో ఏ మూలో కూర్చోబెడతారు. అందులో సగానికి పైగా వక్తల ప్రవరా, వచ్చిన వారి జాబితాతో ఇచ్చిన ఖాళీ కాస్తా కిక్కిరిసి పోతుంది.

    ఎందుకంటే పదిమందీ ఏం చెప్పారో తెలిస్తే రచయితల మనో దృక్పథం తెలిసే అవకాశముంటుంది.

    మీరూ వెళ్ళారు కనుక తీరిక చేసుకొని మాలాంటి వాళ్ళ కోసం ( అంటే దూరంగా వుంటూ అక్షరాల్లోనే మనుష్యుల్ని వెతుక్కునే నాబోటి వాళ్ళకి ) రాయండి.

    -సాయి బ్రహ్మానందం గొర్తి

    ReplyDelete
  2. చూశాను. అందులో మీ కథ కూడా ఉంది. సహజంగానే మీరు రాలేరని తెలుసు.
    అక్కడ మాట్లాడింది ఒక్కరే, బి.చంద్రశేఖర్ గారు. టూరు విశేషాలు రాయడానికి మూడ్ వస్తే తప్పకుండా రాస్తాను. ఈమధ్య రాయడానికి బద్దకం బాగా పెరిగిపోతోంది, అందుకని.

    ReplyDelete