Monday, August 23, 2010

యండమూరి వీరేంద్రనాథ్-తో స్పెషల్ ఇంటర్వ్యూ

యండమూరితో సంభాషించినదాన్లోంచి పేజీ పరిమితుల వల్ల పాతిక శాతమైనా ఎడిట్ చేయాల్సి వచ్చింది. అయినా క్రీమ్ ఏమీ మిస్ కాలేదు. ఈ ఐటెమ్-లో నేను ఈర్శ్య అని తప్పుగా రాశానని, దాన్ని ఈర్ష్య అని రాయాలని మిత్రుడు భాస్కర్ చెప్పాడు. అలాగే బాచి.

23 comments:

 1. ధన్యవాదాలండి. i felt happy to read this.

  మీరేమనుకోకపోతే ఒక ప్రశ్న మీకు. యండమూరి గారు దర్శకత్వంలో నేను ఓడిపోయానని చెప్పుకున్నారు. అలా కొద్దిమందే ఒప్పుకోగలరు. కానీ ఇదే విషయం గురించి ప్రతీ సారీ వార్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడుగుతూనే ఉంటారనిపిస్తుంది. ఎందుకో మరి?

  ReplyDelete
 2. మందాకిని గారూ,
  అనుకోవడానికి ఏమీలేదు. ఫెయిల్యూర్ అనేది అందరికీ సహజమే అని విజయం గురించి మాట్లాడే రచయిత నోటి నుంచి చెప్పించాలన్న దుగ్ధ దానికి ఓ కారణం కావొచ్చు. దర్శకత్వం అనేది ఆయన జీవితంలో ఒక విలువైన దశ కదా. జీవితంలోని అన్ని పార్శ్వాలనూ ఇంటర్వ్యూలో తడిమితే బాగుంటుందనుకోవడమూ మరో కారణం కావొచ్చు. నేనైతే ఈ రెండో కారణం కోసమే అడిగాననుకుంటున్నా.

  ReplyDelete
 3. agreed.
  ఇంటర్వ్యూ లో నాకు నచ్చిన ప్రశ్న కూడా చెప్తాను. తెలుగు సాహిత్యం లో వారి స్థానం, విమర్శకులు వారి రచనలకి ప్రాధాన్యత ఇవ్వకపోవటం గురించి.

  నా అభిప్రాయంలో కల్పనా సాహిత్యంలో రెండు రకాలు. ఒకటి మనసుకు ఆహ్లాదాన్ని, కళ్ళకు కలలని ఇచ్చేదయితే, మరొకటి స్ఫూర్తిని కలిగించగలిగేది. (ఓటమి నుంచి కలిగే దు:ఖాన్ని తొలగించగలిగేది.)
  యండమూరి రచనలు స్ఫూర్తిని కలిగించే సాహిత్యం అని వర్గీకరించవచ్చని అనుకుంటున్నాను.

  ReplyDelete
 4. నాకు ఈ మంత్రల రయిత తొనె మొదటి పరిచయం (అంతకుముందు చిన్నచిన్న కథలు మత్రమె పెద్ద నవనలు చదవటం ఈయనతొనె} ఈయన తులసిదళం అనె విషగులికను తయారు చెసి ప్రజలమీదికి వదిలాదు దాన్నినుంచి ఇంకా ప్రజలు తెరుకొవడం లెదు ఇంకాచానా గుళికలు తయారు చెశాడులెండి ఒక ప్రశ్నెకు భదులుగా వాస్తవాలు రాయటం ఏమిటి ప్రయొజనం అంటున్నాడు దాన్ని భట్టి అర్దం చెసుకొవచ్చు ఈయన ఏపాటివాడొ ఇలాంటివాడికి ఇంతపాపులర్ రావటం ఆశర్యమె

  ReplyDelete
 5. ఆయన గురించి మంచి రచైత అనో, సంచలన రచైతనో ఎవరెన్ని రకాలుగా నిర్వచించినా తెలుగు నవలా ప్రపంచంలో తిరుగు లేని స్థానం మాత్రం సంపాదించాడని మాత్రం ఒప్పుకోవలసిందే!

  ఈ ఇంటర్వ్యూలో నాకు ముఖ్యంగా నచ్చింది...ప్రశ్నలు! ఈ మధ్య ఒక పత్రికలో అనుకుంటాను గోరటి వెంకన్న లాంటి ప్రజా గాయకుడిని పట్టుకుని "ఇష్టమైన నటుడు ఎవరు, ఇష్టమైన పువ్వు? రంగు? అని సంఖ్యా శాస్త్రజ్ఞుల్లాగా ప్రశ్నలు అడిగారు. విసుగేసింది నిజంగా!

  చక్కని విషయాలు ఆయన చేత చెప్పించేలా ప్రశ్నలు ఫ్రేమ్ చేశారు.

  తన ఆలోచనలు నాకు చాలా నచ్చుతాయి. మనిషి మనస్థత్వాన్ని విశ్లేషిస్తున్నపుడు ఒక్కసారైనా భుజం తడుముకోక తప్పదు. ఆ లోపాలు తనలోనూ ఉన్నాయని ఆయన ఓపెన్ గా అంగీకరిస్తాడు చూడండి..అది కూడా నచ్చుతుంది.


  ఇన్ని మెట్లెక్కాక కూడా ఇంకా ఆత్మన్యూనత తనలో ఉందని ఎవరు ఒప్పుకుంటారు?(ఇదీ ప్రచారం కొసమేనని అనేవాళ్లతో ఆర్గ్యుమెంట్ లేదు)

  యండమూరి ఎప్పుడూ సంచలనమే!

  ReplyDelete
 6. @రామమోహన్:
  నాకు కూడా మీలాగే యండమూరే రచయితగా తొలి పరిచయం. నేను చదివిన మొదటినవల చీకట్లో సూర్యుడు'.
  తులసిదళం లాంటి నవలల వల్ల తెలుగు సాహిత్యానికి పెద్ద అపచారం జరిగిందని నేనేమీ అనుకోవట్లేదు.

  @ సుజాత:
  థాంక్యూ.
  ఇంటర్వ్యూ చేసేంతవరకూ నాకూ తెలియదు, ఆయన ఇలా ఒప్పుకోబోతున్నాడని. ఊహించనైనా లేదని.

  ReplyDelete
 7. మీ ప్రశ్నలు బావున్నాయి... కానీ వీరేంద్రనాథ్ పెద్ద Hypocrite అనిపిస్తుంది నాకు ఎప్పుడూ.

  నవలా ప్రపంచాన్నీ ఒక ఊపు ఊపేరేమొగానీ ఏ నవల్లోనూ భావపటిష్ఠత ఉండదు. రచయిత మనసు తెలియదు. కేవలం, డబ్బు కోసం, ప్రేక్షకులను ఒక ఎమోషన్లో నిర్భందించడం కోసం రాసినవి అయి ఉంటాయి. నవలల్లో కథ మాత్రమే కాకుండా రచయిత బుద్ది, మనసుని కూడా అంచనా వేసి ఆనందించే అలవాటున్న నాకు ఆతని రచనలు ఏరకంగానూ నచ్చవు.

  ReplyDelete
 8. తులసిదళం వ్రాసేటపుడు త్వరగా ఎదగాలని అలా వ్రాసి ఉండవచ్చు.ఆ తర్వాత ఎన్నో మంచి మంచి నవలలు వ్రాసారు.ఆయనలో ముఖ్యంగా నచ్చేది ఏమిటంటె తార్కికంగా, వాస్తవికంగా ఆలోచించటం. ఆయన రచనలు నన్ను చాలా ప్రభావితం చేసాయి.
  ఇంటర్వూ బాగుంది.

  ReplyDelete
 9. Anonymous23.8.10

  ఎలా రాసినా జుట్టు పట్టుకొని ఆఖరి వరకూ పాఠకుణ్ణి లాక్కెళ్ళ గల రచయిత యండమూరి. రాసింది గొప్పదా? లేక ఎన్నుకున్న వస్తువూ, పాత్రలూ గొప్పవా అన్నది వేరే విషయం. సాధారణంగా నవలల్లో సూడో కేరక్టర్స్ ఉంటాయి. రిక్షా నడిపేవాడు కూడా సైన్స్ లెక్చర్లు ఇప్పిస్తాడు. ఇలాంటివే కాస్త అసహజంగా అనిపిస్తాయి ఈయన రచనల్లో. రిక్షా వాళ్ళని తక్కువ చేయడం నా అభిమతం కాదు; వాళ్ళు సైన్స్ చదువుకునే అవకాశం తక్కువ. చదివినా లెక్చర్లిచ్చే స్థాయి ఉండదు.
  అంతర్ముఖం నవలల్లో ఇలాంటివి కనిపించవు. కాకపోతే దానికీ చివిరకి మిగిలేది వాసనలుంటాయి. ఇంటర్వ్యూ బావుంది. మంచి ప్రశ్నలడిగారు; ఆయన మీదొచ్చిన కాంట్రవర్సరీల గురించి కూడా ప్రస్తావిస్తే పరిపూర్ణంగా ఉండేది. ఆయన వైపు కూడా తెలిసేది.

  -సాయి బ్రహ్మానందం గొర్తి

  ReplyDelete
 10. యండమూరి రచనల్లో పాఠకులకు మంచీ చెడూ.. రెండూ కలిగించే లక్షణాలున్నాయి. అద్భుతమైన పఠనీయత ఆయన ప్రత్యేకత.

  ‘తులసిదళం లాంటి నవలల వల్ల తెలుగు సాహిత్యానికి పెద్ద అపచారం జరిగిందని నేనేమీ అనుకోవట్లేదు’ అన్నారు మీరు.

  సరే, చిన్నపాటి అపచారమైనా జరిగిందని మీరనుకుంటున్నట్టే కదా! అయితే... ఎందుకని? చెప్పండి!

  ReplyDelete
 11. Anonymous23.8.10

  ప్రేక్షకుల ఆదరణ ముఖ్యం, అంతే తప్ప, ప్రతి నవలా ఎదో హితభోద, లేక సమాజంలో ఉండే దురాచారాల మీదో అనుకుంటే కష్టం, చాలా కధలు ఇప్పటికీ విషాదాంతమే, ఎన్ని అని అవి చదువుతాం, తులుసీ దళం చేసిన పెద్ద హాని ఐతే నాకు తెలిసి ఏమీ లేదు..

  ReplyDelete
 12. బాగుంది ఇంటర్వ్యూ...
  సుజాత గారన్నట్టు, ఇంకా మిగిలిన వారు పైన చెప్పినట్టు యండమూరి రచన చదవటం మొదలు పెట్టాక ఆద్యంతం చదవకుండా విడిచి పెట్టలేం. కొన్ని సంఘటనలనీ, పాత్ర స్వభావాలనీ లేక థీం, వర్ణనలల్లో ఆంగ్ల సాహిత్యపు చాయలు కనిపించినా, నాకు ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే, వందలాది ఆంగ్ల నవలలు చదివే ఈ తరం పిల్లల దగ్గర్నించీ 60 యేళ్ళ మా అమ్మ/అత్తగారి జెనెరెషన్ దాకా అందరినీ ఒకే రకం గా అలరిస్తాయి ఆయన రచనలు.

  కానీ ఆయన కథా నాయకులూ, నాయికల స్వభావాలే విశిష్టమైనవీ, వారి పద్ధతే గొప్ప అన్నట్టు గా రాస్తారు. వారు (హీరో[యిన్లు] ) 100% పర్ఫెక్ట్ గా ఉంటారు. పైగా వారి ఆలోచనా ధోరణి ని గురించి రాస్తూ, 'ఇలా ఎంత మంది ఆలోచించగలరు? ' అని మనల్ని ప్రశ్నిస్తారు. ఒక స్టేజ్ దాటాక సినిమాల కోసమే రాసుకున్న కథల్లా కూడా అనిపించాయి కొన్ని రచనలు.

  ఏది ఏమైనా తెలుగు నవల గురించి 2-3 వాక్యాలు రాయాల్సి వచ్చినా రాసి తీరాల్సిన పేరు యందమూరి అన్నది కాదనలేని సత్యం!

  ReplyDelete
 13. @ ఆ.సౌమ్య:
  ఆయనే ఒప్పేసుకుంటున్నాడు కదా, డబ్బు కోసం రాశానని. ఇంకా ఆయన్ని హిపెక్రిట్ అంటే ఎలా?
  ఎమోషన్లో నిర్బంధించడం... ఇది కూడా తప్పేనంటారా?

  @సాయి బ్రహ్మానందం గొర్తి:
  వివాదాల గురించి కావాలనే అడగలేదు. ఆయన చెప్పిన జవాబుల్లో ఇంకెవరినో బాధపెట్టేవి ఉన్నా తొలగించాను. ఎందుకంటే ఇంటర్వ్యూ ప్రధాన ఉద్దేశం ఆయన్ని ఎక్స్ పోజ్ చేయడమో, ఇంకెవరినో బాధ పెట్టడమో కాదుకదా! సీరియల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్లీ ఓసారి ఆయన్ని కాస్త బలంగా గుర్తుకుతేవడం, అంతే!

  @క్రిటిక్:
  అయ్యో, పెద్ద అపచారం ఏమీ జరగలేదూ అంటే... ఏమాత్రం జరగలేదూ అనే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నేను దాన్ని ఓ పెద్ద విషయంగా పరిగణించట్లేదు అని.

  ReplyDelete
 14. intervivew bavundi,kani editing valla koncham veltiga undi

  ReplyDelete
 15. చెప్పడం మర్చిపోయాను. నిజంగా స్త్రీల మీద ఆయన అభిప్రాయం నాకు తెలీదు కానీ అతని కథానాయికలు మాత్రం నాకు భలే ఉంటారు. , తెలివి తేటలు,తర్క జ్ఞానంతో "హీరోని కూడా"(సినిమా సూత్రం ప్రకారం హీరో అజేయుడు కదా) బోల్తా కొట్టించే మేథస్సు తో అలరారుతుంటారు. లక్ష్మి, అనూష,రమ్య ..వీళ్ళంతా!

  అలాంటి స్త్రీలను హీరోలు కూడా సాటి మేథావులుగానే చూస్తారు తప్పించి "స్త్రీ" దృష్టితో చూడకపోవడం కూడా సహజంగా ఉంటుంది.

  వెన్నెల్లో ఆడపిల్ల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూసిన మా అక్కల తరం వాళ్ళని కదిలిస్తే ఇంకా ఎక్కువసంగతులు రాస్తారు.

  నాకు అంతర్ముఖం కంటే పర్ణశాల నచ్చుతుంది. మరో పక్క కొన్ని నవలలు ఇప్పుడు చదువుతుంటే "అప్పుడెలా చదివామా"అని ఆశ్చర్యపడే నవలలూ లేకపోలేదు.

  తన స్టడీ అంతా ఏదో ఒక పాత్ర చేత చెప్పించడం కూడా బాగానే ఉంటుంది. అది ఉపన్యాసధోరణిలో ఉండకపోవడం ఇంకా బావుంటుది.

  ReplyDelete
 16. రాజిరెడ్డి గారు, బాగుంది.
  యండమూరిని గురించి - ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఆయన రచనల ప్రభావాన్ని గురించి - కొన్నాళ్ళ కిందట నా బ్లాగులో అడిగాను. ఐతే అక్కడ ఇంకో ఇద్దరు మహానుభావుల్ని ప్రస్తావించడం వల్ల వచ్చిన వ్యాఖ్యలు ఎక్కువగా అటువేపు కొట్టుకు పోయినాయి. ఎవరూ యండమూరి రచనల ప్రభావాన్ని గురించి స్పష్టంగా రాయలేదు. కానీ బ్లాగ్లోకంలో ఆయన రచనల వలన తాము ప్రభావితులమయ్యాము అనుకునేవారు చాలామందే ఉన్నారు అని నా అంచనా. ఆ రచనల్లో ఏమి చదివి ప్రభావితులయ్యారో తెలుసుకోవాలని నాకు మహా కుతూహలం
  రాజిరెడ్డి - మీకో ప్రశ్న - ఆయనతో మాట్లాడినప్పుడు - నా రచనలు చాలామందిని ప్రభావితం చేశాయి - అన్నలాంటీ ఫీలింగ్ ఎక్కడన్నా కనబడిందా? Was he ware that he was having this kind of influence on his readers? Was that one of the purposes for hsi writing?

  ReplyDelete
 17. మధుబాబు,యండమూరి లేకపోతే ఒక తరం... నా తరంలో (ప్రస్తుతం 30-35 వయసు) చాలా మంది తెలుగు పుస్తకాలు చదవడం ఖచ్చితంగా మానేసుండేవాళ్ళేమో అనిపిస్తుంది. అలాగని యండమూరే ఆదిమధ్యాంతాలని కాదు. ఆది మధుబాబైతే మధ్యం యండమూరే ! అక్కడ్నించీ ఆయన చెయ్యి పట్టుకుని మిగతావారి దగ్గరికి.

  యండమూరిని in person కలిసిన వ్యక్తిగా, కలిసి కొన్ని రోజులు పనిచేసిన వ్యక్తిగా నాకు నచ్చింది ఆయనలోని భావవైరుధ్యం. ఒకే stand అన్ని విషయాల్లో ఉండదు. అందుకని కొందరు ఆయన్ను హిపోక్రెట్ అనొచ్చు. కానీ, అలా విషయాన్ని బట్టి ఒక possible objective stance తీసుకోవడం స్థితప్రజ్ఞత అని నాకు అనిపిస్తుంది. ఈ యుగంలో అది అవసరం కూడా. అందుకని ఆయన్ను అభిమానిస్తాను.

  ReplyDelete
 18. >> కానీ వీరేంద్రనాథ్ పెద్ద Hypocrite అనిపిస్తుంది

  I agree.

  But it is as a person -- in his appearances in media in the past decade or so..

  But Not as a writer.
  His writings are purely commercial. Including పర్ణశాల & ఋషి. And they rocked a couple of generations.

  His hypocrisy is seen in his talking, in his interviews, in his efforts to appear as different from crowd (of writers)

  btw, if you are a reader of English Sci-fi (robin cook) & philosophy (assimov etc), then you will not be so impressed with his writings anyways.

  and thus you find so many haters.

  ReplyDelete
 19. Anonymous28.8.10

  మీరు ఆయన్ని ప్రొజెక్ట్ చేద్దామని interview చేసాము అంటున్నారు కాబట్టి, ప్రశ్నలు బానె ఉన్నాయి,
  కాకపోతే బెజవాడ మనోరమ incident గురించి అడగని interview మాత్రం పూర్తి interview కాదని నా అభిప్రాయం.

  ReplyDelete
 20. >> బెజవాడ మనోరమ incident

  మరణమృదంగం లో రేప్ సీన్ గురించా?

  ReplyDelete
 21. Anonymous28.8.10

  "మరణమృదంగం లో రేప్ సీన్ గురించా?" ఎమో నాకు తెలియదు, కాని మనోరమ లో జరిగిన ఆత్మహత్య (కొందరు రేప్ అనికూడా అంటారు) అందులో యండమూరి ప్రధమ ముద్దాయి, జరిగింది కూడా తన రూం లోనో, లేక తను పిలుస్తేనో వచ్చిన తన అభిమానికి.

  జరిగి చాలా కాలం అయ్యింది కాబట్టి వివరాలు పూర్తిగా గుర్తుకు రావటం లేదు, గుర్తున్న/(మా పోలీసు బంధువు ద్వారా)తెలిసిన వివరాలు ఇంతకంటే బ్లాగ్లలో పెట్టకపోవటమే మంచిది అని నా అభిప్రాయం.

  (గుడిసెల) వెంకటసామి ని interview చేసి, గుడిసెల గురించి అడగకపోవటం ఎలా సమగ్రమం అవదో, ఇది కూడా సమగ్రమం అవదని నా ఉద్దేశ్యం.

  కాకపోతే, దాశిపెట్టకుండా, interview ఉద్దేశ్యం కేవలం "సీరియల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్లీ ఓసారి ఆయన్ని కాస్త బలంగా గుర్తుకుతేవడం, అంతే!" అని అంటున్నారు కాబట్టి(paid news లాగా), ఆ ప్రశ్నలు అడగకపోవటమే మంచిదేమో!!

  దీని గురించే బ్రహ్మానందం గారు కూడా , అడిగితే ఆయన వైపు నుండి ఏమి చెప్పేవారో తెలిసి ఉండేది కదా అని అన్నారని నా ఉద్దేశ్యం.

  ReplyDelete
 22. >> ఇంతకంటే బ్లాగ్లలో పెట్టకపోవటమే మంచిది అని నా అభిప్రాయం.

  I agree.
  I just heard, ఆ సీన్ కొంచెం బాగా ఫీల్ అయ్యి రాశారని అనుకునేటోల్లు.

  and then, there was that famous, much discussed statement: if it's inevitable, just relax and enjoy it.

  ReplyDelete
 23. @ కొత్తపాళీ:
  మీ ప్రశ్నకు జవాబు ఏం రాయాలో తెలియక ఇంత ఆలస్యం.
  రెండు రకాలుగా రాశాను, డబ్బులకోసం, త్రుప్తి కోసం అని ఆయన చెబుతున్నారు.
  రెండో రకంలోకి వచ్చేవి పాఠకులకు ఉపయోగపడతాయన్న భావన ఆయనకు ఉంది. ఎంతోమంది నావల్ల ప్రభావితం అయ్యారు- అన్న డాంబికపు ఫీలింగ్ అయితే నాకు కనబడలేదు. కానీ తను రాస్తున్నదే కరెక్టు, జీవితానికి ఇలాంటి రచనలే కదా డైరెక్షన్ ఇవ్వగలిగేవి అనే ధోరణి మాత్రం ఉంది. అది ఇంటర్వ్యూలో కూడా కనబడుతుంది.

  ReplyDelete