పోయిన్నెల మా కరెంట్ బిల్లు 51 రూపాయలు!
2025 ఏప్రిల్ నెలకుగానూ హైదరాబాద్‌లోని మా (అద్దె) ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు 51 రూపాయలు. మేము ఏసీ, ఫ్రిజ్ లాంటివి వాడం కాబట్టి మామూలుగా బిల్లులు తక్కువగానే వస్తుంటాయి. ఆ తక్కువల్లోనూ ఇది ఇంకా తక్కువ. అది కూడా నడి ఎండాకాలంలో. నేను ఒక్కడినే ఉంటే గనక ఎంత వేడిగా ఉన్నా ఫ్యాను కూడా వేయను. శరీరాన్ని అట్లా అలవాటు చేయడానికి సాధన చేస్తున్న. వేసవి సెలవులకు మావాళ్లు ఊరికి వెళ్లడంతో ఇంక రాత్రిపూట కాసేపు ఒకట్రెండు బల్బులు; ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, (వారానికోసారి) ట్రిమ్మర్ చార్జింగుల కోసం తప్ప ఇంక దేనికీ పెద్దగా కరెంట్ వాడింది లేదు. బిల్లు ప్రకారం 4 యూనిట్లు కాలింది. నాకు తెలిసిన ఒక మేడమ్ వాళ్లకు పోయిన్నెల పది వేల బిల్లు వచ్చిందంటే (అలాంటి వస్తువులూ, వాటికి తగిన వాడకమూ ఉన్నాయన్నారు) ఇది రాయబుద్ధయింది.
(20-5-2025 నాటి ఎఫ్బీ పోస్ట్)

No comments:
Post a Comment