Saturday, February 1, 2014

'పోలీస్ స్టేషన్లో రెండు గంటలు' వ్యాసానికి ప్రతిస్పందన

నేను ప్రతిదానికీ వివరణ ఇవ్వబూనుకుంటున్నానంటే, ఏదో డిఫెన్సులో పడిపోతున్నానని నాకే అర్థమవుతోంది. అంటే ఇక్కడ స్పందనలు పెట్టడం వల్ల నా గురించి నేను గొప్పకు పోతున్నానని ఈ బ్లాగు చదివే పాఠకులు అనుకుంటారనీ, అలా కాదని చెప్పడానికి నేను శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాననీ అర్థం. ఈ రెండూ నిజమే అయినా, మరి నా ఐటెమ్స్ మీద వచ్చిన స్పందనలు ప్రచురించడానికి
ఈ బ్లాగు కాకుండా మరేదీ దీనికి అనువైన చోటు?
కాబట్టి, ఆ ఫీలింగును వదలించుకుని దీన్ని పోస్టు చేస్తున్నాను.
రియాలిటీ చెక్ సిరీస్-లో భాగంగా పోలీస్ స్టేషన్ వాతావరణం మీద రాసిన ఆర్టికల్-కు వచ్చిన స్పందన ఇది. అందుకున్న తేది మార్చ్ 21, 2012. మెయిల్ ద్వారా వచ్చిన ఈ స్పందన వ్యాసకర్త అప్పుడు 'ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం'  రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న యేదుల గోపిరెడ్డి గారు. ఇప్పుడాయన అదే సంఘానికి అధ్యక్షులయ్యారు.

ఈ ఉత్తారానికి స్పందనగా ఆయనతో నేను ఫోన్లో సంభాషించానేగానీ ఉత్తర రూపంలో మాత్రం జవాబు ఇవ్వలేదు. ఆయన మంచి చదువరి. స్నేహశీలి.
పోలీసులు, ముఖ్యంగా పోలీసు కానిస్టేబుళ్ల కోణంలో అర్థం చేసుకోవాల్సిన ఎన్నో అంశాల్ని గోపిరెడ్డి ఈ లేఖలో ప్రస్తావించారు. వాటన్నింటితో నేను అంగీకరిస్తానుగానీ, నన్ను ముల్లులా పొడిచిందీ, ఆ వాతావరణంలో నా మనసును చేదెక్కించిందీ వాళ్ల అమర్యాదకర ప్రవర్తన. బహుశా, "ప్రశ్నించజాలని అధికారం" వాళ్లను ఇలా ప్రవర్తించేలా చేస్తుందేమో! మండల కేంద్రాల పోలీసు స్టేషన్లలో ఇది మరింత నిజం. వాళ్లకు వంద చికాకులున్నా కూడా సాటి మనిషి పట్ల మనిషి చూపాల్సిన కనీస మర్యాదకు ఇవన్నీ అడ్డం రాకూడదని నా నిశ్చయమైన నమ్మిక.



2 comments:

  1. Anonymous1.2.14

    // నన్ను ముల్లులా పొడిచిందీ, ఆ వాతావరణంలో నా మనసును చేదెక్కించిందీ వాళ్ల అమర్యాదకర ప్రవర్తన. బహుశా, "ప్రశ్నించజాలని అధికారం" వాళ్లను ఇలా ప్రవర్తించేలా చేస్తుందేమో! మండల కేంద్రాల పోలీసు స్టేషన్లలో ఇది మరింత నిజం. //

    ఒకసారి రాత్రి ఏడుగంటలకి , హైవే మీద ఒక చిన్న బడ్డి దగ్గర సిగరెట్ కొనుక్కున్నాను
    మా ఊరు కి పక్కనే ఉంది అది పాయకరావుపేట అని . అప్పుడే అక్కడ కి పోలీసు జీప్ వచ్చి ఆగింది . ఇద్దరు constables దిగి ఏదో కొనుక్కుని మల్లి జీప్ ఎక్కారు . ఆ బడ్డి కి ఒక పది అడుగుల దూరం లోకి వెళ్లి సిగరెట్ ముట్టించాను . ఈ లోపు ఆ జీప్ లో నుండి constable గట్టిగా అరుస్తున్నాడు నా వైపు చూస్తూ .
    నాకు ఏమి అర్ధం కాలేదు , నా వెనక చూసాను అక్కడ ఎవరు లేరు నిర్మానుష్యంగా ఉంది . నన్నే అని అర్ధం అయింది . కాని ఎందుకు అరుస్తున్నాడో తెలియదు .
    పోలీసు జీప్ దిగి దూకుడు గా నా దగ్గర కి వచ్చి C.I గారి ముందే సిగరెట్ తాగుతావా ఎంత ధైర్యం నీకు అని కొట్టినంత పని చేసాడు . సిగరెట్ పారేయ మని అరిచాడు . పారేశాను, జీప్ ఎక్కి వెళ్ళిపోయారు . నా మైండ్ బ్లాంక్ అయిపొయింది , అక్కడ సిగరెట్ తాగాకుడదని రూల్ కూడా లేదు . అది హైవే.
    పన్నెండు సంవత్సరాలు మెట్రో సిటీస్ లో ఉన్నాను , 4 years అబ్రాడ్ లో ఉన్నాను , కాని ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురవ్వలేదు . నో స్మోకింగ్ ఉంటె తాగకూడదు అని తెలుసు కాని , C.I ముందు , S.I ముందు తాగకూడదు అని తెలియదు .

    పోలీసు ముందు సిగరెట్ తాగకూడదా ?

    ఆశ్చర్యం గా అనిపించింది . ఇటువంటి attitude తో వీళ్ళు డ్యూటీ చేస్తుంటే సామాన్యులు ఏ విధంగా పోలీసు స్టేషన్ కి వెళ్తారు ? ఏం న్యాయం జరుగుతుంది .

    సిగరెట్ తాగకూడదు అని చెప్పినా ప్రాబ్లం ఉండదు , కాని . C.I గారి ముందు తాగకూడదు అంటే , ఆ తరువాత ఆలోచిస్తే నవ్వొచ్చింది వాళ్ళ attitude కి .

    ReplyDelete